DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీఈడిబి కి స్కోచ్ బంగారు పతాకం,  పెట్టుబడులు ఆహ్వానించడంలో ఆంధ్రా యే టాప్

అమరావతి, డిశంబర్ 31 , 2018 (DNS Online ) : ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులను ఆహ్వానించడం, మౌలిక వసతులు కల్పించడం లో సఫలీకృతమైనందుకు ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక అభివృద్ధి బోర్డు

(ఏపీఈడిబి), ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి స్కోచ్  à°¬à°‚గారు పతాకం లభించింది. దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో à°ˆ నెల 27 à°¨ జరిగిన 55 à°µ స్కోచ్ సదస్సులో à°ˆ అరుదైన పురస్కారాన్ని ఏపీ

ఈ డిబి ముఖ్య కార్యనిర్వహణాధికారి జె. కృష్ణ కిషోర్, స్పెషల్ కమిషనర్ భావన సక్సేనా లు అందుకున్నారు. సమాజం లో ప్రభుత్వ పరిపాలన, ఆర్థికరంగం, బ్యాంకింగ్, కార్పొరేట్

రంగం, ఆర్ధిక రంగం,
అభివృద్ధి తదితర రంగాల్లో మెరుగైన అభివృద్ధి కోసం కృషి చేసే సంస్థలు, వ్యక్తులకు à°ˆ సంస్థ 2003 నుంచి పురస్కారాలు అందించడం జరుగుతుంది. 
ఆంధ్ర

ప్రదేశ్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కులు, మౌలిక వసతులు, వస్త్ర , ఎలక్ట్రిక్ వాహన, గేమింగ్ తదితర ఆరు విభాగాల్లో మెరుగైన పోలిసీలను అందరికీ అందుబాటులో, అనువుగా

ఉండేలా రూపొందించినందున à°ˆ పురస్కారం లభించింది. 
రాష్ట్ర విభజన తో ఆర్ధికంగా వెనుకబడిన ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి పథం లో నడిపించేందుకు సింగపూర్ ఆర్థిక

అభివృద్ధి బోర్డు, బహరేన్ ఆర్ధిక అభివృద్ధి బోర్డు, రువాండా ఆర్ధిక అభివృద్ధి బోర్డు, తరహాలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి

చంద్ర బాబు నాయుడు చైర్మన్ గా ఏపీ ఈ డిబి సంస్థ 2016 లో ఏర్పాటు చెయ్యబడింది. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం రాష్ట్రం లో ఆర్థిక అభివృద్ధి కోసం మౌలిక వసతులు కల్పించడం, విదేశీ

సంస్థలకు నోడల్ ఏజెన్సీ ఏర్పాటు, సింగల్ విండో విధానం ద్వారా జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు అనుమతులు అందించడం, వాణిజ్య వ్యాపారాల పురోగమనం లో ఆంధ్ర ప్రదేశ్ ముందంజ

లో ఉన్నందున à°ˆ పురస్కారం అందించడం జరిగింది. 

దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్ డం, జపాన్, చైనా, యూరోప్, అమెరికా, సింగపూర్, మలేసియా, రష్యా లాంటి విదేశీ

సంస్థల్లోని పరిశ్రమలు ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు, ఒప్పందాలు కుదుర్చుకోవడం లో ఏపీఈడీబీ కృషి అద్వితీయమని కొనియాడారు. ఈ విభాగం సాధించిన

విజయాలకు నిదర్శనమే కియో మోటార్స్, ఆసియ పల్ప్ అండ్ పేపర్, సెయింట్ గోబియాన్, టి హెచ్ కె, తోరాయ్, లిక్సిల్, అరవింద్ మిల్స్, రాక్ మాన్ వంటి పరిశ్రమలు పెట్టుబడులు

పెట్టేందుకు రావడమేనని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో దావోస్, స్విట్జర్లాండ్, అమెరికా, రష్యా, కొరియా, కజకిస్తాన్, సింగపూర్, చైనా, అరబ్

ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్ డమ్ లలో జరిగిన  à°ªà±à°°à°ªà°‚à°š ఆర్ధిక ఫోరమ్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రాముఖ్యత, విశిష్టతలను విజయవంతంగా తెలియచేయగలిగిన కారణంగా ఆంధ్ర ప్రదేశ్ కు à°ˆ

పురస్కారం లభించింది. 

స్కోచ్ పురస్కారం లభించడం ఆంధ్ర ప్రదేశ్ చేస్తున్న కృషి కి నిదర్శనమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ

ప్రయత్నం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.  

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #amaravati  #Chandra babu  #Naidu   #APEDB  #Andhra PRadesh Economic Development Board  #New Delhi

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam