DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంబరమే తణ్ణీరే : వెంకటాద్రి వెంకన్నకు వెన్నతో అలంకారం. 

విశాఖపట్నం, జనవరి 1 , 2019 (DNS Online ): విశాఖ నగరం లోని శివారు గ్రామమైన చినముషిడివాడ లోని వేంకటాద్రి పై వేంచేసిన శ్రీవేంకటేశ్వరుని 27  à°•à±‡à°œà±€à°² వెన్నతో అలంకారం చేసినట్టు ఆలయ

అర్చకులు మహార్తి రామానుజం తెలిపారు. 
అత్యంత పవిత్రమైన ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ నెల రోజుల పాటు ఆలయంలో అనుసంధానం చేసే తిరుప్పావై లోని అంబరమే తణ్ణీరే

సొరెం పాశురం (17 వ రోజు ) విన్నపం చేసే రోజున వేంకటాద్రి లో వేంచేసిన వేంకటేశ్వరునికి వెన్నతో అలంకారం జరపడం ఆనవాయితీగా వస్తోందని తెలియచేసారు. దానిలో భాగంగానే

మంగళవారం స్వామికి అలంకారం చేశామన్నారు. ఇదే రోజు ఆంగ్ల నూతన సంవత్సర దినోత్సవం కూడా కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి రావడంతో ఈ అలంకారం మధ్యాహ్నం వరకూ

ఉంచడం జరిగిందన్నారు. ఈ నెల 6 వ తేదీన భక్తులచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి, ఈ విశేష పూజల్లో

పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #venkateswara swami  #venkatadri  #china mushidiwada

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam