DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజకీయ కీచకుల చెర నుంచి హిందూ ఆలయాలను విడిపించాలి. :సామవేదం షణ్ముఖ శర్మ

హిందూ ధర్మం పై కోర్టులు కూడా కక్ష సాధిస్తున్నాయా ?

తక్షణం దేవాదాయ శాఖ ను రద్దు చేయాల్సిందే :

ధర్మ రక్షణ కై పీఠాధిపతులను ఏక త్రాటిపైకి తీసుకు

వస్తాం, ఉద్యమిస్తాం  

హిందు ధర్మం, సంప్రదాయాలపై కోర్టుల జోక్యం ఎందుకు?

DNS తో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ 

విశాఖపట్నం,

జనవరి 3 , 2019 (DNS Online ): హిందు ఆలయాలపై కీచకులు దాడి చేస్తున్న కళ్ళు మూసుకున్న దేవాదాయ శాఖను తక్షణం రద్దు చేసి, ఆలయాల నిర్వహణ పీఠాధిపతులు అప్పగించాలని ప్రముఖ ఆధ్యాత్మిక

వేత్త, ప్రవచన కర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ పిలుపునిచ్చారు. ధర్మ రక్షణకై విశాఖ వాసులను ఉద్దీపింప చేసే కార్యక్రమం లో భాగంగా నగరానికి వచ్చిన అయన DNS తో తన

అంతరంగాన్ని వ్యక్తపరిచారు. ఇటీవల కాలం లో రాజకీయ ప్రబుద్ధులు హిందు ధర్మాన్ని అణిచివేసి, పూర్తిగా తుంగలోకి తొక్కే విధంగా చేయరాని తప్పులు

చేస్తున్నారన్నారు. దీనికి నిదర్శనమే ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు ప్రస్ఫుటిస్తున్నాయన్నారు. పీఠాధిపతులను ఏక త్రాటిపైకి ఆహ్వానిస్తామని

తెలిపారు. 

ఆలయాల నిధులు అన్య మతాలకు పంపిణీయా  ? 

లక్షలాది మంది భక్తులు హిందు దేవాలయాల హుండీ ల్లో వేసే కోట్లాది రూపాయలను అన్య మతాల ప్రచారానికి,

వాళ్ళకి ఇచ్చే స్కీం లకూ తరలించడం అత్యంత దౌర్భాగ్యమన్నారు. హిందు ఆలయాల్లో వచ్చే నిధులను కేవలం హిందు ధర్మ వ్యవస్థ కె వినియోగించాలని హెచ్చరించారు. ఈ దేశంలో

కనీసం ధూప దీప నైవేద్యాలకు కూడా నోచుకోవడం లేదని, వాటి నిర్వహణ ఈ నిధులు తరలించి, వాటిని పునరుద్దరించాలని తెలిపారు. తిరుమల లాంటి పెద్ద హిందు ఆలయాల్లో వచ్చే

నిధులను ఇతర మతాల వారికి,  à°ªà±à°°à°šà°¾à°°à°¾à°²à°•à± ఎందుకు తరలిస్తున్నారని అడిగినా, కనీసం సమాధానం చెప్పే ఠికానా దేవాదాయ శాఖ లో లేదన్నారు. హిందు ఆలయాల్లో వచ్చే నిధులను

స్వాహా చేస్తున్నఅవినీతి అధికారులను పట్టుకున్న, కనీసం కేసులు లేకుండా తిరిగి ఉద్యోగాల్లో కొనసాగిస్తున్నారన్నారు. 

హిందు దేవాలయాల్లో స్వామిని

దర్శించాలన్నా, ప్రసాదం తీసుకోవాలన్నా, కొబ్బరి కాయ కొట్టాలన్నా డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కుని స్వామిని దర్శించుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిని ఈ రాజకీయ

కీచకులు తయారు చేశారన్నారు. పైగా ఇక్కడ వచ్చిన కోట్లాది నిధులను అన్య మతాల ఉద్ధరణకు తరలించేస్తున్నారన్నారు. పైగా హిందు ఆలయాల నుంచి వచ్చిన నిధులతో

బ్రతుకుతున్న ఈ అన్యమతాల కీచకులు అదే హిందు దేవాలయాలను, దేవీ దేవతలను సైతానులుగా దూషిస్తున్నా కళ్ళు మూసుకు పోయిన దేవాదాయ శాఖను తక్షణం రద్దు

చేయాల్సిందేనన్నారు. 

అయ్యప్ప ఆలయం పై కోర్టుల అధికారం ఏంటి?

ఇటీవల కాలం లో హిందు ధర్మాన్ని భక్షించే విధంగా కీచకులు, మారీచులు ఈ దేశం లో తయారయ్యారని,

దానిలో భాగంగానే శబరీ మల అయ్యప్ప ఆలయం లోని ఆచార వ్యవహారాలపై కోర్టుల్లో కేసులు వేశారన్నారు. హిందు ఆలయాలు ఆగమాలు ప్రకారమే నడవాలి తప్ప ఈ వ్యవస్థ తో సంబంధం లేని,

అసలు ఆగమం గురించే సంబంధం లేని కోర్టులు ఆదేశాల ప్రకారం కాదన్నారు. 

పీఠాధిపతులతో సమావేశం :

అతి త్వరలోనే హిందూ ధర్మానికి చెందిన వివిధ పీఠాధిపతులతో

సమావేశం నిర్వహించి, వారందరినీ ఒకే వేదికపైకి ఆహ్వానించి, హిందూ ధర్మ పరి రక్షణకై కార్యాచరణ చేపట్టనున్నట్టు తెలియచేసారు. హిందూ ఆలయాలపై  à°°à°¾à°œà°•à±€à°¯ పార్టీల

పెత్తనం పై à°ˆ సమావేశం చర్చిస్తుందన్నారు. 

కోర్టులు హైందవ ధర్మం పై మాత్రమే తీర్పులు ఇస్తున్నాయేంటి ?

హిందూ ధర్మాన్ని సర్వ నాశనం చేసేందుకే ఈ రాజకీయ

పార్టీలు ప్రభావానికి, ఒత్తిళ్లకు, కోర్టులు కూడా ఆగమ విధానాలకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చేస్తున్నాయన్నారు. హిందూ ఆలయాలు, వాటి నిర్వహణ కేవలం ఆయా ఆలయాలు

పాటించే ఆగమాలు అనుసరించే అర్చనలు, ఉత్సవాలు, వేడుకలు, నిర్వహిస్తారని, అంటే తప్ప కోర్టులు చెప్తే ఆలయాలు నడవవు అని అన్నారు. ఇటీవల కోర్టులు మితిమీరి జోక్యం

చేసుకుంటూ హిందూ ఆలయాలను, కోట్లాది మంది హిందువుల మనోభావాలను కించపరుస్తున్నామని మండిపడ్డారు. అసలు ఈ కోర్టులు కేవలం హిందూ ధర్మం పైనే ఎందుకు పడుతున్నాయని

ప్రశ్నించారు. దీనికి నిదర్శనమే ఇటీవల సుప్రీం కోర్టు శబరీ మల అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ఎవరైనా వెళ్ళవచ్చు అని తన ఇష్టానుసారం గా ( ఆగమాలు, ఆలయ నిబంధనలకు

వ్యతిరేకంగా) తీర్పు ఇవ్వడం తో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా, పట్టించుకునే తీరిక, ఓపిక, కోర్టులకు లేకుండా పోయిందన్నారు. 

కోర్టులు కూడా కక్ష

సాధిస్తున్నాయా?

ఈ క్రమంలోనే హిందూ అయ్యప్ప ఆలయంలోకి మహిళలను ప్రవేశ పెట్టాలంటూ ఒక ముస్లిం కోర్టు లో కేసు వెయ్యడం ఏంటి,? దానిపై సుప్రీం కోర్టు రాత్రికి

రాత్రే హడావిడి తీర్పు ఇచ్చేయడం ఏంటని మండిపడ్డారు. సుప్రీం కోర్టులో వేలాది కేసులు పెండింగ్ లో ఉండగా, అయ్యప్ప ఆలయం పై హడావిడి గా తీర్పు ఇవ్వడాన్ని తప్పు

పట్టారు. హిందూ ధర్మం పై కోర్టుల జోక్యం కూడదన్నారు. కోర్టులకు కేవలం న్యాయ శాస్త్రం లో ప్రావీణ్యం ఉండవచ్చు కానీ, ఆగమాలపై ఉందన్నారు. ఒక్కో ఆగమం, ఒక్కో విధమైన

అర్చనా విధానాన్ని చెప్తుందని, అవన్నీ కోర్టులకు తెలిసే అవకాశం ఉండదన్నారు. 

హిందూ వ్యతిరేక శక్తులు కేరళ రాష్ట్రంలో అధికారం లో ఉన్న సిపిఎం పిఱవన్

విజయన్ ప్రభుత్వం ఇద్దరు నాస్తికులు, హేతువాదులను ( మహిళలు) బలవంతంగా అయ్యప్ప ఆలయంలోకి దొంగ దారిన, దొంగలుగా తీసుకు వెళ్లడం పై మండిపడ్డారు. దీనికి నిరసనగా

కోట్లాది మంది హిందువులు నిరసనలు చేస్తే వారిపై కేసులు నమోదు చేశారన్నారు. దీనిపై ఆలయ అర్చకులు ఆలయాన్ని మూసి వేసి, శుద్ధి కార్యక్రమం చేపడితే, దాన్ని

వ్యతిరేకిస్తూ తిరిగి మళ్ళీ కేసు వెయ్యడం శోచనీయమన్నారు. 

అధర్మాన్ని ఖండించమే  à°®à°¾ విధి. :

హిందూ ధర్మం పై ఎవరు వ్యతిరేకంగా ప్రవర్తించినా ఖండించడం

ఆధ్యాత్మిక వేత్తలు, ధర్మాచార్యుల కర్తవ్యమని అన్నారు. దీనిలో భాగంగానే అయ్యప్ప ఆలయం పై కోర్టుల మితిమీరిన జోక్యాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. కోట్లాది మంది

హిందువుల మనోభావాలను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదన్నారు. కోర్టుల పుట్టుక కేవలం కొన్ని సంవత్సరాలేనని, హిందూ ధర్మం విలువల కోట్లాది సంవత్సరాలన్నారు. దీన్ని

కించపరిచే అధికారం ఎవరికీ లేదన్నారు. ధర్మాచార్యులు కేవలం ప్రసంగాలు చెయ్యడం వరకే పరిమితం కాదని, తప్పు జరిగినట్లయితే ఖండించడం కూడా భాధ్యతేనన్నారు. ఇదే

విధంగా ప్రభుత్వాలు, కోర్టుల తీరు కొనసాగితే à°ˆ దేశం లో హిందువులకు మనుగడే లేకుండా పోతుందన్నారు. 

కేంద్రం కళ్ళు మూసుకుందా :

 à°¹à°¿à°‚దూ ధర్మాన్ని మేమే

బ్రతికిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంఘాలు అయ్యప్ప ఆలయం పై సుప్రీం కోర్టు ఇచ్చిన హిందూ వ్యతిరేక తీర్పు పై కనీసం ఒక

ఆర్డినెన్సు కూడా తీసుకు రాని బీజేపీ ప్రభుత్వం ఇక హిందువులకు ఏ విధంగా మొహం చూపిస్తుందని ప్రశ్నించారు. కోట్లాది మంది మహిళలు, అయ్యప్ప భక్తులు రోడ్డెక్కి

నినదిస్తుంటే కళ్ళు మూసుకున్న బీజేపీ ప్రభుత్వం కూడా హిందూ వ్యతిరేకంగానే మారిపోయిందన్నారు. వీళ్లకు హిందువులను పాలించే హక్కు లేదన్నారు. 

 

 

 

dns; dns live;

dns media; dns news; dnslive; dnsmedia; dnsnews; visakhapatnam; vizag; samavedam; shanmukha sharma; tirumala; hindu temples; 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam