DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మే నెల్లో పోలవరం నుంచి నీళ్లిచ్చే ఘనుడు బాబు ఒక్కరే  

రాష్ట్రం లో పాలనా అంతా అవినీతి మయమే, అంతా దోపిడీయే 

శ్వేత పత్రం లో అంతా అబద్దాల పుట్టే, 

బాబు ప్రచారం వల్లే కూటమి 50 సీట్లు కోల్పోయింది. 

అన్నీ

తాత్కాలికమే, ఆఖరికి ఇతని కుర్చీ కూడానా ?

మీట్ ది ప్రెస్ లో ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడి 

విశాఖపట్నం, జనవరి 4, 2019 (DNS Online ): వేసవి కాలం లో పోలవరం ఆనకట్ట నుంచి

గోదావరి నీటిని విడుదల చెయ్యగలిగిన ఘనుడు కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమేనని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం విజెఎఫ్ ఆధ్వర్యవం

లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమం లో పాల్గొన్న ఆయన రాష్ట్ర పరిస్థితి ని కూలంకషంగా వివరించారు. చంద్రబాబు నాయుడు పోలవరం ను పరిశీలించిన ప్రతీసారి మే

నెలలో పోలవరం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తా అని చెప్తున్నారని, దీనిపై తాను ఎన్నోసార్లు ఆయన్ని వారించినట్టు తెలిపారు. మే నెలలో గోదావరి నది లో నీరు ఉండదని,

మరి నీరే లేని గోదావరి నుంచి పోలవరం ఆనకట్ట లోకి నీరు ఎలా వస్తుందని, పోలవరం గేట్లు ఎత్తి త్రాగునీరు, సాగు నీటికి నీరు ఎలా సరఫరా చేస్తారో ఆయనకే తెలియాలన్నారు.

రాజమహేంద్ర వరం స్థానికునిగా ఐదు దశాబ్దాల నుంచి గమనిస్తున్నామని చెప్పినా, అయినప్పటికీ ఆయనకి సరిగ్గా ఎక్కినట్టు లేదన్నారు. 

శ్వేత పత్రం అంతా అబద్దాలే . .

.

ఏదైనా అంశం పై వాస్తవాలు తెలియాలి అంటే శ్వేత పత్రం ప్రకటించాల్సి యుంటుందన్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారని, వాటిల్లో కొన్ని

వాస్తవాలతో పాటు, అబద్దాలే ఎక్కువ ఉన్నాయన్నారు. వాటిల్లో లెక్కల్లో మహా మాయ చేసి, ప్రజలకు భూటకపు పత్రాలు విడుదల చేశారన్నారు. ఈ విధంగా ప్రకటించడం వల్ల ప్రజలకు

శ్వేతపత్రాల పై నమ్మకం లేకుండా పోయిందన్నారు. 

మోడీ ఆంధ్రా కి చేసిందేంటి ? :

ఇటీవల ఏ వార్తా ఛానెల్ చూసిన, పత్రిక చదివినా, ఆంధ్రా కి అంతా చేసేశానని మోడీ

ప్రకటనలు చేస్తుంటే, అసలు ఏమిచ్చావని చంద్రబాబు ప్రశ్నిస్తున్న వార్తలే చూస్తున్నామన్నారు. చట్టం లో ప్రకటించినవి ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్న చెయ్యక తప్పదని,

అవి తానె చేసేశానని ప్రగల్బాలు పలకడం రాష్ట్రాన్ని కించపరచడమే నన్నారు. 

విపక్ష ఘోరంగా విఫలం చెందింది :

ఆంధ్ర ప్రదేశ్ లో పరిపాలన అంతా అవినీతి

మయంగానే మారిపోయిందని, ప్రభుత్వ పధకాలను తక్కువ డబ్బులకే ప్రజలకు అందించవలసి ఉండగా, మూడొందల రేట్లు అదనంగా ధరలు ప్రజల మీద మోడుతున్నారన్నారు. స్థానికంగా ఉన్న

ఇసుక తిన్నెలు, నిల్వలను ఎమ్మెల్యేలకు ధారాదత్తం చేసేశారని, అవి వాళ్ళు అమ్ముకు తింటుంటే, అడ్డుకోవాల్సిన ప్రతిపక్ష పార్టీ సినిమా చూస్తోందన్నారు. ప్రభుత్వం

చేసే ప్రతి అవినీతి పని మీద విరుచుకు పడవలసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీసం నోరెత్తక పోవడం వల్లే ప్రజల్లో కనీస సానుభూతి ని కూడా పొందలేకపోతోందన్నారు. తమ

పార్టీ గుర్తు పై గెలిచినా 21 మంది ఎమ్మెల్యే లను చంద్రబాబు నాయుడు తోలుకు పొతే కళ్ళు మూసుకు పోయిన పార్టీ రేపు అధికారం లోకి వస్తే ఇంకెలా పరిపాలన ఇస్తుందో బాగా

తెలుస్తోందన్నారు. 

ఎన్నికల వైఖరి అంతా వ్యాపారమే :-

రాజకీయాల్లో కొనసాగుతూ, ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే ఓటుకు కనీసం రెండు వేలు పెట్టి కొనగలిగిన

దౌర్భాగ్యం ప్రస్తుతం నడుస్తోందన్నారు. ప్రస్తుతం చట్టసభలకు ఎన్నిక అంతా వ్యాపార మాయం గా మారిందని, డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కున్న వాడు, గెలిచాక తానూ

ఎన్నికల్లో పెట్టిన ఖర్చును తిరిగి సంపాదించుకుంటున్న వాడు ప్రజాసేవ చేస్తాడని ఎవరైనా ఎలా ఊహించగలరన్నారు. ఇది కేవలం వ్యాపారమేనన్నారు.  à°—తంలో చట్ట సభలకు

ఎన్నికవ్వాలంటే నీతి నిజాయితీ, తమ ప్రాంత ప్రజలకు సేవ చెయ్యాలి అనుకునే వారిని ఎంచుకునేవారని, అయితే ఇప్పుడు ఓట్లు కొనుక్కుంటున్నారన్నారు. 

విభజన బిల్లు

నేటికీ పాస్ అవ్వలేదు . . .

 à°†à°‚ధ్ర ప్రదేశ్ విభజన బిల్లు ఇంకా నేటికీ అధికారికంగా పార్లమెంట్ లో పాస్ కాలేదని, అయితే అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై, చేసిన

దుర్ఘటన ఆంధ్ర విభజన అన్నారు. ఒక రాష్ట్రం విడగొట్టాలంటే ఆ రాష్ట్ర శాసన సభ అంగీకారం తప్పని సరి అని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ విభజనను ఏకగ్రీవంగా

తిరస్కరించినా, లోక్ సభలో తలుపులు వేసి మరీ బిల్లును ఆమోదించేశారన్నారు. అసలు ఆ రోజు జరిగిన ప్రక్రియను లోక్ సభ రికార్డు చేసిందని, దానిపై ప్రశ్నించే ధైర్యం ఎవరూ

చెయ్యలేకపోతున్నారన్నారు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక వ్యాపారం ఉందని, దీన్ని ప్రశ్నిస్తే వారి వ్యాపారాలపై సిబిఐ, ఈడీ దాడులు జరుగుతాయని భయపడుతున్నారన్నారు.

 

అన్నీ తాత్కాలికమే, ఆఖరి సీఎం కుర్చీ కూడానూ..

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పదేళ్లు వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు చేసిన ఓటుకు నోటు

ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఘోరంగా నష్టపోయారన్నారు. అతని అధికార దాహం వల్ల హైదరాబాద్ నుంచి చంద్రబాబును కేసీఆర్ పంపిస్తే గతిలేని పరిస్థితుల్లో విజయవాడ

వచ్చి, తాత్కాలిక నిర్మాణాల స్టెంట్ మొదలెట్టాడన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా తాత్కాలికంగానే మారిపోయిందన్నారు. సచివాలయం, అసెంబ్లీ, సీఎం

కార్యాలయం నుంచి హైకోర్టు భవనం దాకా అన్నీ తాత్కాలికంగానే నిర్మాణాలు చేపడుతున్నారని, ఆఖరికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇతనికి సీఎం కుర్చీ కూడా

తాత్కాలికంగానే ఇస్తారన్నారు. 

బాబు ప్రచారం వల్లే కూటమి 50 సీట్లు కోల్పోయింది, 

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో హైద్రాబాద్ వెళ్లి చంద్రబాబు నాయుడు

ప్రచారం చెయ్యడం వల్లనే మహా కూటమి గెలవ వలసిన 50 ఎమ్మెల్యే సీట్లు కోల్పోయిందన్నారు. రోజూ పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి చంద్రబాబు దినచర్యలో మొదటి పని

హైదరాబాద్ ను నేనే డివలెప్ చేశా అని చెప్పుకోడమే మహా కూటమి కొంప ముంచిందన్నారు. హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందేనని, అదే పని రోజుకు వంద

సార్లు చెప్పడం వల్ల, జనం విసిగి పోయి, గెలిపిస్తే ఇదే గోల వినాలిరా బాబూ అని ఓటు వెయ్యడం మానేసినట్టు ఉన్నారన్నారు. చంద్రబాబు దెబ్బకి కాంగ్రెస్ శాశ్వతంగా దెబ్బ

పడిపోయిందన్నారు.

 

#dns  #dns live  #dns media  #dnslive  #dns news  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #undavalli  #gantla srinu babu  #vjf
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam