DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిడిపి పై తిరుగుదాడి చేస్తాం, ఎమ్మెల్సీ మాధవ్ ప్రకటన 

మహిళను బహిరంగం గానే ఫినిష్ చేస్తా బెదిరిస్తారా ?

విశాఖపట్నం, జనవరి 6, 2019 (DNS Online): భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై భౌతిక దాడి చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలపై

తిరుగుదాడి చేస్తామని ఉత్తరాంధ్ర పట్టభద్రుల  à°Žà°®à±à°®à±†à°²à±à°¸à±€ ( బీజేపీ) పివిఎన్ మాధవ్ హెచ్చరించారు. నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ఆంధ్ర

ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు పదవి పోతుందన్న భయం పట్టుకుందని, దీంతో ఎవరు ఎదురుపడితే వాళ్లపై నానా అవాకులు చెవాకులూ ప్రేలుతున్నదని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి ఆదేశం మేరకే తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై రాళ్ళ దాడి కురిపించారని, బీజేపీ కార్యకర్తలను,

మహిళలను నడిరోడ్డుపై భౌతికంగా కొట్టారన్నారు. 
కాకినాడ పర్యటనలో సమస్యల పరిష్కారానికై  à°¬à±€à°œà±‡à°ªà±€ మహిళా కార్పొరేటర్ ఎదురుపడితే ఆమెను బహిరంగంగానే ఫినిష్

చేస్తా అని బెదిరించడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన ఎలా నడుస్తోందో తెలుస్తోందన్నారు. దీనికి ప్రతిగా బీజేపీ కార్యకర్తలు, నేతలపై భౌతికదాడులు చెయ్యమని

నేరుగా ముఖ్యమంత్రే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆదేశాలివ్వడం అత్యంత జుగుప్సాకరమన్నారు. దీనికి ప్రతిగా తాము కూడా ఎదురుదాడులకు దిగుతామని హెచ్చరించారు.

తాము శాంతిగా నిరసనలు తెలియచేస్తుంటే ముఖ్యమంత్రికి మతి భ్రమించి, దాడులకు పురిగొల్పుతున్నారన్నారు. ఈ విలేకరుల సమావేశం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార

ప్రతినిధి సుహాసిని ఆనంద్, యువ మోర్చా రాష్ట్ర కార్యరదర్శి సురేంద్ర, కార్యవర్గ సభ్యుడు పాండ్రంకి నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam 

#viswanadha raju  #vizag  #bjp  #Suhasini anand  #madhav  #Chandrababu naidu  #telugudesam  #kakinada


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam