DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యా లాగ, వైద్యాన్ని విచ్చలవిడి చెయ్యొద్దు :గంటా కి గవర్నర్ క్లాసు 

పిహెచ్ à°¡à°¿ అంటే à°’à°• డిగ్రీ కాదు, సమాజ స్పృహ : నరసింహన్ 

విశాఖపట్నం, జనవరి 9, 2019 (DNS Online): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో విద్యా రంగాన్ని విచ్చలవిడితనం చేసేశారని, అదే

విధంగా వైద్య రంగాన్ని విచ్చలవిడి చేసి ప్రజల జీవితాలతో ఆటలాడవద్దు అని రాష్ట్ర గవర్నర్ ఈ జిల్ నరసింహన్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కు గట్టిగా

క్లాసు తీసుకున్నారు. బుధవారం జరిగిన ఆంధ్ర విశ్వ కళాపరిషత్ స్నాతకోత్సవం లో రాష్ట్ర కులపతి ప్రసంగంలో గవర్నర్ విద్యా విధానం పై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

విద్యారంగంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చేశామంటూ రాష్ట్ర మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు చేసిన ప్రకటనపై ఆయన తనదైన శైలిలో వార్ణింగ్  à°¨à±‹à°Ÿà±€à°¸à±à°²à± ఇచ్చారు.

ఇప్పడికే అన్ని రంగాలు కలుషితం అయిపోయాయని, ఇక విద్యారంగాన్ని కూడా కలుషితం చెయ్యవద్దని సూచించారు. ఒక విద్యార్థికి 75 శాతం మార్కులు వస్తే ప్రపంచాన్ని

జయించినంత గొప్పగా ఉండేదని, ఇప్పుడు ఎవరిని చూసినా వందకి వంద మార్కులు ఇచ్చేస్తున్నారని, అయితే ఆ విద్యార్థులకు పొట్టకోస్తే అక్షరం సరిగ్గా ఉండడం లేదని ఆవేదన

చెందారు. పైగా ఇక్కడ చదువుకున్న విద్యార్థి, ఈ దేశానికి ఉపయోగపడడం లేదని, ఇతర దేశాలకు వెళ్లి తమ మేధావితనాన్ని వినియోగించడం వలన ఈ దేశానికి, వాళ్లకి విద్యాదానం

చేసిన విద్యాలయం కు ఉపయోగం ఏంటన్నారు. వివిధ విభాగాల్లో పరిశోధనలు చేసిన విద్యార్థులకు కేవలం ఒక పిహెచ్ డి పట్టా ఇచ్చేసి చేతులు దులుపేసుకుంటే, పిహెచ్ డి కి

విలువ లేదన్నారు. విద్యాలయాలు ఇప్పుడు ఇస్తున్న పిహెచ్ డి పట్టా అంటే అన్ని డిగ్రీ పట్టల్లాగా ఇదొక పట్టా మాత్రం గానే మిగిలిపోతోందన్నారు. ఈ విద్యార్థి తన

విద్యను వినియోగింది, à°ˆ దేశానికి à°’à°• మంచి పని చేసినప్పుడే à°ˆ పిహెచ్ à°¡à°¿ à°•à°¿ సార్ధకత చేకూరుతుందన్నారు. 


రాష్ట్రంలో మరిన్ని ప్రయివేట్ యూనివర్సిటీలు :

à°—à°‚à°Ÿà°¾ 

ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో మరిన్నీ ప్రయివేట్ యూనివర్సిటీలు వస్తున్నాయని, వాటికి ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలు  à°Žà°¦à°—ాలని రాష్ట్ర మంత్రి à°—à°‚à°Ÿà°¾

శ్రీనివాసరావు తెలిపారు. విద్యారంగంలో మరిన్ని సదుపాయాలు వస్తున్నాయని, అయితే అవి ప్రయివేట్ రంగానికే పరిమితమవుతున్నాయన్నారు. ఆర్ధికంగా లోటు ఉన్నప్పడికీ

విద్యారంగానికి తాము ఎటువంటి లోటు లేకుండా బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయించమనన్నారు. ఇదే ఎయు విద్యాలయంలో గవర్నర్ అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని వర్సిటీల

ఉపకులపతులతో సమావేశం నిర్వహించామని, అలాంటి సందర్భం ఇంకెక్కడా లేదన్నారు. సైన్సు కాంగ్రెస్ లాంటి అంతర్జాతీయ సదస్సులు, ఇక్కడే నిర్వహించామని, భారత రత్న, పూర్వ

రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలం లాంటి విద్యావేత్తలు, రతన్ టాటా లాంటి ప్రపంచం మెచ్చిన పారిశ్రామికవేత్తలు ఎయులో తమ అమూల్యమైన సందేశాన్ని అందించారనున్నారు.

 

దేశం పట్ల విద్యార్థులకు భాద్యత లేదు : డాక్టర్ రామ్ గోపాలరావు

ఈ దేశం లో చదువు పూర్తిచేస్తున్న విద్యార్థుల్లో చాలా మందికి దేశం పట్ల భాద్యత లేకుండా

పోయిందని, ఐ ఐ టి ఢిల్లీ డైరక్టర్ డాక్టర్ రామ్ గోపాలరావు అన్నారు. తమ ఢిల్లీ ఐఐటి లోనే చాలా మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి లండన్ లో వాయు కాలుష్యం పై పరిశోధనలు

చేస్తున్నారని, గురివింద గింజ మాదిరిగా వీళ్ళు ఎక్కడైతే చదువుకుంటున్నారో, అదే ఢిల్లీ లో వాయు కాలుష్యం ప్రపంచం దద్దరిల్లి పోయే విధంగా ఉందన్నారు. దాన్ని

వీళ్ళు పట్టించుకోకుండా దేశాలు పట్టిపోయి ప్రక్క దేశాలను ఉద్దరిస్తారన్నారు. ఐఐటి ఢిల్లీ, ఐఐటి ముంబై ల్లో కూడా వందల సంఖ్యలో అధ్యాపక పోస్టులు భర్తీకాకుండానే

ఉండిపోయాయన్నారు. వాటిని భర్తీ చేయాల్సియుందన్నారు. ఒక విద్యాలయం నుంచి పట్టా పుచ్చుకున్న ప్రతి విద్యార్థి, తానూ చదువుకున్న విద్యా సంస్థకు తానూ సంపాదించే

సంపాదనలో 5 శాతం నిధులు అందించడం ద్వారా కొంత వరకూ ఋణం తీర్చుకున్నట్టు అవుతుందన్నారు. ప్రతి విద్యాలయాన్ని పూర్తిగా ప్రభుత్వాలే పోషించలేవని, పూర్వ

విద్యార్థులు కూడా సహకారం అందించవలసిన అవసరం ఉంటుందన్నారు. అప్పుడే విద్యాలయాలు మరింత విజయాలను సాధిస్తాయన్నారు. 

ఈ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఐఐటి

ఢిల్లీ డైరక్టర్ డాక్టర్ రామ్ గోపాలరావు కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అనంతరం ఎయు లో పిహెచ్ డి లు పూర్తిచేసిన వారికి పట్టాలను అందించారు. ఈ కార్యక్రమం లో ఎయు

ఉపకులపతి డాక్టర్  à°œà°¿. నాగేశ్వర రావు, ఎయు పాలక మండలి సభ్యులు, పూర్వ వీసీలు, రెక్టార్ డాక్టర్ ప్రసాదరావు, రిజిస్ట్రార్ డాక్టర్ నిరంజన్, పెద్ద సంఖ్యలో పరిశోధకులు,

అధ్యాపకులు పాల్గొన్నారు.  

 

 

#AU  #dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra unviersity  #ganta srinivasa rao

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam