DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆచార్య కటాక్షంతో మై హోమ్ అధినేతకు విశ్వరూప సందర్శన భాగ్యం

వైభవంగా ధనుర్మాస ఉత్సవాల నిర్వహణ 

హైద్రాబాద్, జనవరి 12, 2019 (DNS Online): గత నెల రోజులుగా ధనుర్మాస ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహింప చేసిన మై హోమ్ సంస్థల అధినేత

డాక్టర్ జె. రామేశ్వర రావు కు చిన్న జీయర్ స్వామీ శ్రీకృష్ణ విశ్వరూప సందర్శన స్వరూపాన్ని బహుకరించారు. హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ లోని రామేశ్వర రావ్ స్వగృహం

లో జరుగుతున్న ధనుర్మాస వేడుకల 28 à°µ రోజున ప్రాత: కాల సేవాకాలం అనంతరం మేలిమి చెక్కతో చేయించిన ఏకరూప శిల్ప విగ్రహాన్ని 
జీయర్ స్వామి అందించారు. డిశంబర్ 16 ,2018 నుంచి

జనవరి 13 ,2019 వరకూ ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఈ వేడుకలలో పాల్గొనేందుకు వస్తున్నా వందలాది మంది భక్తులకు అన్ని సదుపాయాలు చేస్తూ, వచ్చిన వారికి లేదనకుండా రెండు పూటలా

ప్రసాద వితరణ చేయడంతో పాటు, సంప్రదాయ గ్రంధాలను కూడా ఉచితంగా అందించి అందరి మన్ననలూ పొందారన్నారు. రెండు పర్యాయాలు మంత్రోపదశ ( సమాశ్రయణం) కార్యక్రమాలను కూడా

వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఏదైనా కార్యక్రమం భారీ ఏర్పాట్లతో ఒక్కరోజు నిర్వహించడమే అత్యంత కష్టమని, అలాంటిది నెల రోజుల పాటు ఎవరికీ ఎటువంటి లోటు

రాకుండా కార్యక్రమాలను నిర్వహించడం కేవలం భావంతుని అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుందన్నారు. 2018 - 19 ధనుర్మాస ఉత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించిన వీరి కుటుంబ

సభ్యులందరికీ ధన్యవాదాములు తెలియచేస్తూ భక్తులందరి తరపున ఈ విశ్వరూప సందర్శన శిల్పాన్ని అందించడం జరుగుతోందన్నారు. ఈ మేలిమి చెక్క విగ్రహాన్ని పది మంది

శిల్పులు, రెండు సంవత్సరాల కాలం లో అత్యద్భుత శైలి లో చెక్కడం జరిగిందన్నారు. శ్రీ కృష్ణ లీలలు, మహా భారత ఘట్టాలు, అన్నింటినీ ఈ శిల్పం లో మలిచారన్నారు. రామేశ్వర

రావు, కుటుంబ సభ్యులందరికీ శ్రీ గోదా రంగనాధుల అనుగ్రహం, కటాక్షం సంపూర్నంగా లభించాలని చిన్న జీయర్ స్వామీ మంగళాశాసనం చేశారు. అనంతరం రామేశ్వరావు మాట్లాడుతూ

ఆచార్య సన్నిధిలో  à°‡à°‚తమంది భగవతోత్తములకు సేవ చేసుకునే భాగ్యం లభించడం పూర్వ జన్మ సుకృతమని అన్నారు. సనాతన హైందవ  à°¸à°¤à±à°¸à°‚ప్రదాయాన్ని భావి తరాలకు అందించవలసిన

భాద్యత మనపై ఉందన్నారు. ఈ నెలరోజుల కార్యక్రమం లో పాల్గొని ఆచార్య అనుగ్రహం పొందిన అందరికీ ధనువాదములు తెలిపారు. ఈ నెలరోజుల పాటు జరిగిన ప్రాత: కాలంలో సేవాకాలం,

సాయంత్రం ప్రవచనం సహా అన్ని వేడుకలను ప్రత్యక్షంగా దర్శించే భక్తులతో పాటు, ప్రత్యక్షంగా పాల్గొనలేని లక్షలాది  à°®à°‚ది భాగవతోత్తములకు సౌలభ్యంగా ఉండే విధంగా

ఇంటర్నెట్ మాధ్యమాన్ని వినియోగించి పేస్ బుక్, యు ట్యూబ్ లాంటి సోషల్ మీడియా ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా అందించడం జరిగిందన్నారు. జెట్ వరల్డ్ ఐడి ద్వారా

à°ˆ ప్రసారాలను అందించామన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #dhanurmasam  #my home  #chinna jeeyar  #haiderabad

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam