DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వనయాత్ర లో ఆరుగురు అయ్యప్ప లపై గజరాజుల దాడి, ఇద్దరికీ సీరియస్

ఇద్దరినీ తొక్కేసి, నలుగురిని విసిరేసిన ఏనుగులు   

ఇద్దరికీ తీవ్రగాయాలు, శరణు ఘోషతో మారుమ్రోగుతున్న వన యాత్ర 

మహిళలకూ వనయాత్ర నిబంధన

పెట్టాల్సింది : భక్తులు.

( రిపోర్ట్ : డి ఎస్ ఎన్ మూర్తి, శబరీ మల)

ఎరుమేలి,  à°œà°¨à°µà°°à°¿ 12, 2019 (DNS Online): స్వామీ అయ్యప్ప దర్శనం కోసం అటవీ (వన యాత్ర) యాత్ర చేస్తున్న అయ్యప్ప

స్వామీ భక్తులపై అటవీ ప్రాంతం లోని ఏనుగులు దాడి చెయ్యడంతో ఆరుగురు à°­niక్తులకు గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి 7  :30  à°—à°‚à°Ÿà°² సమయంలో ఎరుమేలి నుంచి పంబ చేరుకునే

అటవీమార్గం మీదుగా ప్రయాణిస్తున్న అయ్యప్ప భక్తులపైకి మొక్కల చాటున ఉన్న మూడు ఏనుగులు ఒక్కసారిగా దూసుకు రావడం తో ఇద్దరు అయ్యప్పలకు తీవ్రగాయాలు కావడంతో

వారిని రక్షించేందుకు వెళ్లిన మరో నలుగురు భక్తులకూ సైతం గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన అయ్యప్ప ల్లో ఒకరికి కాలు నుజ్జు కావడం, మరొకరికి పొట్టపై తీవ్ర

గాయాలయ్యాయి. వీరిని కాపాడడానికి వెళ్లిన నలుగురు భక్తులను విసిరేసినట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరు కర్ణాటక కు చెందిన భక్తుడు కాగా, మరొకరు విజయవాడకు చెందిన

వారుగా గుర్తించారు. ఎరుమేలి నుంచి పంబ వెళ్లే అటవీ మార్గం లో అళుదా నది ( అళుదామేది) దాటిన తర్వాత ముత్తాది సమీపంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమం లోనే ఒక

భక్తుడు దగ్గరలోని లోయ ప్రాంతంలో పడడం తో సమీప భక్తులు కాపాడడం జరిగింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది గాయపడిన అయ్యప్పలను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఈ

బృందంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎక్కువగా ఉండడం కొంత ఆందోళన కల్గించింది. అయితే  à°à°¨à±à°—ుల భీభత్సం తో ఒక్కసారిగా ఇతర బృందాల గురుస్వాములు,

అయ్యప్పలు, దీక్షాధారులకు ధైర్యాన్ని అందించే విధంగా స్ఫూర్తి కల్గించడం గమనార్హం. 

మహిళలకూ వనయాత్ర నిబంధన పెట్టాల్సింది : భక్తులు.

ఇటీవల భారత

సుప్రీం కోర్టు అన్ని వయసుల మహిళలూ అయ్యప్ప ను దర్శించుకోవచ్చు అని తన ఇష్టానుసారం తీర్పు ఇవ్వడం పై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నాయి. ఇదే తీర్పులో పురుషులతో

మహిళలూ సమానమే అని తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు కి వనయాత్ర కనపడలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఎరుమేలి నుంచి పంబ వరకూ గల సుమారు 60 కిలో మీటర్ల వనయాత్ర ( అటవీ ప్రాంతం)

లో నడిచి వచ్చిన మహిళలకే అయ్యప్ప దర్శనం కల్పించాలి అని నిబంధన పెట్టి ఉంటే అయ్యప్ప యాత్ర, దర్శనం లో ఎందుకు నిబంధనలు పెట్టారో వాళ్లకి కూడా తెలుస్తుందన్నారు.

ఏంటో క్లిష్టమైన వనయాత్రలో అటవీ జంతువుల బారిన పడకుండా ఏంటో భక్తితో యాత్ర చేసే అయ్యప్ప స్వాములను కించపరిచిన సుప్రీం కోర్టు, తన నిర్ణయాన్ని తక్షణం వెనక్కి

తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #kerala  #karnataka  #ayyappa  #devotees  #erumeli  #pamba  #elephants  #shabari malai


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam