DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కర్మ కాలి. . అక్కడ మోడీ, ఇక్కడ బాబు ఇద్దరూ గెలిస్తే ..

రాష్ట్రం పని అథోగతే. . . à°¨à°¿à°§à±à°²à± అతడు  à°‡à°µà±à°µà°¡à± ఇతడు తేలేడు 

విశాఖపట్నం, జనవరి 15 ,2019 (DNS Online ):  à°°à°¾à°¨à±à°¨à±à°¨ సార్వత్రిక ఎన్నికలు రాజకీయ పార్టీలకంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర

ప్రజలకే చాలా ముఖ్యం. ఇంతకాలం రాజకీయ పార్టీలు తమ పట్టుకోసం నానా గడ్డి కరుస్తూ, నోటికి వచ్చిన హామీలన్నింటినీ ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేస్తున్నాయి. అయితే గతం లో

ఎదురైనా అనుభవాల దృష్ట్యా పార్టీలు ప్రజల దృష్టిని ఆక్రోశించడానికి చేయరాని తప్పులన్నీ చేసేస్తున్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర విభజన అనే భూతాన్ని సాకుగా

చూపించి,  à°¤à±†à°²à±à°—ుదేశం, భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చెయ్యడంతో ప్రజలు నమ్మి, వీరిద్దరికీ ఓటు వేశారు. అయితే ఇద్దరూ ఉమ్మడి మానిఫెస్టోకు అదనంగా తమ బుర్రకు

తోచిన హామీలు ఇచ్చేశాయి. వాటిని అమలు చెయ్యడంలోనే ఘోరాంగా విఫలమయ్యారు. దీంతో ఇద్దరి మధ్య తేడాలు వచ్చి, స్తాయి మరిచి మరి నువ్వెంత అంటే నువ్వెంత అని

నడిరోడ్డుమీదే బండబూతులు తిట్టుకుంటున్నారు. ఇంటికో ఉద్యోగం అని చంద్రబాబు  à°‡à°¸à±à°¤à±‡, విశాఖ కేంద్రం à°—à°¾ రైల్వే జోన్ ఇస్తామని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర

మోడీ ఉమ్మడి సభలోనే ప్రకటించారు. అయితే ఇద్దరూ వీటిని అమలు చెయ్యడం లో చతికిలబడ్డారు. ఈ క్రమం లోనే ఇరు పార్టీలు కూటమి నుంచి విడాకులు తీసేసుకున్నాయి. కేవలం

నాలుగున్నర ఏళ్ళ బంధాన్ని విడాకులు పుచ్చుకున్న తర్వాత ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గు మంటోంది. 

అక్కడ మోడీ - ఇక్కడ బాబు వస్తే చిప్పే  à°—తి. మళ్ళీ

అధికారం లోకి వస్తే, సత్సంబంధాలు ఏర్పడి కలిసి వచ్చే అవకాశమే లేదు. ఈ క్రమం లోనే ఆంధ్ర ప్రదేశ్ కు భారీ మొత్తంలో ఆశించిన అభివృద్ధి నిధులు మోడీ నుంచి లభించే

అవకాశం లేదు. నిధుల కోసం కేంద్రం ముందు దేహీ అని అనవలసిన పరిస్థితుల్లోనే ఆంధ్ర ఉంది, అని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్తున్నారు, ఏ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలన్నా,

అనుమతుల కంటే ముందు నిధులను అడుక్కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వెళ్లి మోడీ ఇంటి ముందు నిధుల కోసం ప్రాకులాడతాడా అన్నదే మిలియన్ డాలర్ల

ప్రశ్న. అడుక్కోక పొతే ఆంధ్ర అభివృద్ధి కి నిధులు రావు, నిధులు రాకుంటే అంటే గతి. ఈ రెంటికీ మధ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నలిగిపోతుంది అన్నది వాస్తవం. అందుకే

ప్రజలు విజ్ఞత ప్రదర్శించి, సరైన నిర్ణయం తీసుకుంటేనే అభివృద్ధి కి అవకాశం ఉంటుంది.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bjp #telugudesam  #narendra modi  #chandrababu  #andhra pradesh

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam