DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐదేళ్లు నిద్రపోయి, ఇప్పుడు కమిటీల నియామకాలా? చంద్రబాబు  సిగ్గుపడాలి

తెలుగు భాష పై చంద్రబాబు చూపేది నిర్లక్ష్య వైఖరే : యార్లగడ్డ 

విశాఖపట్నం, జనవరి 18, 2019 (DNS Online): దాదాపు ఐదేళ్ల కాలం నిద్రపోయి, పదవి పోయే ముందు నిద్ర లేచిన ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాహిత్య కమిటీల చైర్మన్ ల నియామకం చేశారని, దీనికి సిగ్గు పడాలి అని రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ

లక్ష్మి ప్రసాద్.మండిపడ్డారు. శుక్రవారం సంస్థ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రాచీన భాషగా తెలుగు భాషకు అధికారికంగా

గుర్తింపు తీసుకు వచ్చేందుకు ఎందరో కృషి చేశారని, అయితే ఆ భాషను తొక్కేసే విధంగా చంద్రబాబు చర్యలు చేపట్టారన్నారు. ఇటీవల సాహిత్య అకాడమీ సహా ఇతర విభాగాలకు

చైర్మన్ లను నియమించారని, అయితే ఈ ప్రభుత్వ సంఘాలకు ఒక కార్యాలయం కూడా లేదని, పైగా ఈ కమిటీల్లో సభ్యులు కూడా లేరని, ఇలాంటి సమయంలో వీళ్ళు చేయగలిగేది ఏంటని

ప్రశ్నించారు. అసలు ఎక్కడ కూర్చోవాలో? ఏమి చెయ్యాలో కూడా తెలియకుండా నియామకం జరపడం కేవలం చంద్రబాబు కే సదేమన్నారు. పదవీ వ్యామోహం లో, చేస్తున్న తప్పుడు పనుల్లో

ఇవికూడా ఉన్నాయన్నారు. గతంలో అమరావతి లో రాజధాని నిర్మాణ శంకుస్థాపన సమయంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకం పై కేవలం ఆంగ్ల భాషలోనే పేర్లు  à°‰à°¨à±à°¨à°¾à°¯à°¨à°¿, వాటిపై తెలుగు భాష

లో కూడా వ్రాయాలని డిమాండ్ చేసి, నడి రోడ్డు మీద ధర్నాలు, నిరసనలు కూడా చేసిన ప్రభుత్వం కళ్ళు మూసుకు పోయిందన్నారు. దీంతో ఒళ్ళుమండి ఒక శిలాఫలకాన్ని తెలుగు భాషలో

మేమే తయారు చేయించి విజయవాడ పట్టణంలో పెద్ద ఊరేగింపు నిర్వహించి సి ఆర్ డి ఏ కేంద్ర కార్యాలయానికి తీసుకు వెళ్లి అధికారులకు ఇచ్చి, అక్కడ తగిలించామన్నామని, లేని

పక్షంలో వీధుల్లో నిరసనలు చేపడతామని హెచ్చరిస్తే, గతిలేక, మేము ఇచ్చిన శిలాఫలకాన్ని రాజధానిలో పెట్టారన్నారు. ఈ ప్రభుత్వానికి గానీ, ముఖ్యమంత్రికి గానీ, రాష్ట్ర

మంత్రులకు గానీ, తెలుగు భాష అభివృద్ధి పై ఎటువంటి భక్తి, ఆసక్తి లేవని, వీళ్ళ ఆదేశాలకు లోబడే అధికారులు కూడా భాషను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం

చేశారు. రానున్న కాలంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా వుంటాయో తెలియని పరిస్థితి నెలకొందని, అందినకాడికి అన్న చందాన ప్రభుత్వ కార్యాచరణ ఉందని, ఈ క్రమం లోనే

తెలుగుభాషను తొక్కేస్తున్నారన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #yarlagadda lakshmi prasad  #lok nayak foundatiion

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam