DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నడిచే త్యాగరాజు ఐవిఎల్ శాస్త్రికి సంగీత కళా భారతి పురస్కారం 

à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా త్యాగరాజ ఆరాధనా ఉత్సవాలు ప్రారంభం 

విశాఖపట్నం,  à°œà°¨à°µà°°à°¿ 24, 2019 (DNS Online): కర్ణాటక శాస్త్రీయ సంగీత కళానిధి సద్గురు త్యాగరాజ స్వామికి ఆంతరంగిక

వారసునిగా నిరంతరం సంగీత సేవ చేస్తున్న కులపతి ఐవిఎల్ శాస్త్రి కి సంగీత కళా భారతి పురస్కారంతో త్యాగరాజ ఆరాధనా ట్రస్ట్ ఘనంగా సత్కరించింది. గురువారం విశాఖ

నగరం లోని మద్దిలపాలెం లో à°—à°² కళాభారతి కళా ప్రాంగణం లో విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ సహకారం తో త్యాగరాజ ఆరాధనా ట్రస్ట్  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¤à±à°¯à°¾à°—రాజ

ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి. ప్రారంభోత్సవ వేడుకలను à°¨ భూతొ à°¨ భవిష్యత్ అన్న రీతిలో నిర్వహించాలి అని సంకల్పించిన నిర్వాహక కమిటీ  à°ªà±à°°à°®à±à°– సంగీత

విద్వాంసులు 15 వేల మందికి పైగా శిష్య ప్రశిష్యులను తయారు చేసిన సంగీత విద్వాన్ కులపతి ఐ వి ఎల్ శాస్త్రి ని  à°¸à°‚గీత కళాభారతి. అవార్డు తో పురస్కరించాలని

నిర్ణయించింది. ఈ పురస్కారం ఈ సంవత్సరం ప్రవేశ పెట్టి, ప్రతి సంవత్సరం ప్రముఖ సంగీత ఆచార్యులకు అందించాలని తీర్మానించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా

హాజరైన ప్రముఖ వైణికులు సంగీత విద్వాన్ మహతి కళానిధి, సునాద సుధానిధి, వీణా వైద్య విశారద, జాతీయ  à°¸à°‚గీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత అయ్యగారి శ్యామ సుందర్

మాట్లాడుతూ సంగీతమే శ్వాసగా చేసుకుని వేలాది మందికి ఆదర్శనంగా నిలిచిన ఐవిఎల్ శాస్త్రి జీవితం ప్రతి కళాకారునికి మార్గదర్శకం అన్నారు. మొత్తం సంగీత

కళాకారులని తన కుటుంబం గా చేసుకుని వేలాది మందికి సంప్రదాయ సంగీత విద్య అందించడం అత్యద్భుతమన్నారు. అనంతరం శిష్య ప్రశిష్య సమేతంగా శాస్త్రిని ఘనంగా

సమ్మానించారు. సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆయనతో అనుబంధం ఉన్నవారే కావడం గమనార్హం. శాస్త్రి జీవిత సన్నివేశాలు, జీవన శైలి, వృత్తి, ప్రవృత్తి తదితర అంశాలను

సుస్పష్టంగా లిఖించి, సభికులకు వివరించారు. ట్రస్ట్ సభ్యులు నూతన వస్త్రాలతో సత్కరించుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ సంగీత సాధన, తరువాతి తరానికి అందించడమే తన

ధర్మంగా భావించి తన కర్తవ్యాన్ని నిర్వహించనున్నారు. సంగీతం కచేరీ జరిగే ప్రతి చోటా త్యాగరాజ స్వామి ప్రత్యక్షంగా ఆసీనులవుతారని, ప్రతి కళాకారుడు

మనస్ఫూర్తిగా సాధన చేయాలని సూచించారు. విశాఖ వేదికగా జరుగుతున్న త్యాగరాజ ఆరాధన వేడుకల్లో తానూ సైతం సేవ చేసుకునే భాగ్యం కల్గిందని, గత 27 ఏళ్లుగా విశాఖ లో ఈ ఆరాధన

ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది ఆరు రోజులు జరుగుతున్నాయని, ఈ వేడుకల్లో ఆఖరి రోజున జరిగే ఆఖరి కచేరి తానే చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో భారీ

సంఖ్యలో సంగీతాభిమానులు హాజరయ్యారు. సమ్మాన సభ à°’à°• జాతరను తలపించింది అనడంలో ఏమాత్రం అతి శయోక్తి కాదు.  

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #thyagaraja swami  #aradhana trust  #kalabharati   #IVL

Shashtri   #Ayyagari Shyama Sundar

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam