DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కెనడాలో అత్యంత మైనస్ డిగ్రీల ఉషోగ్రత, బయట అడుగు పెడితే ఫ్రీజే  

టొరంటో లో రాళ్లేమంచుముక్కలవుతున్నాయి 

మంచు కరగడానికి వేడి గాలి ని పంపితే పైపులు పగిలిపోయాయి  

బెంబేలెత్తుతున్న భారతీయ సంతతి 

టొరంటో

(కెనడా), జనవరి 24, 2019 (DNS Online): ఉత్తర అమెరికాలోని కెనడాలో టొరంటో నగరంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణం మొత్తం ఫ్రీజింగ్ లోకి వెళ్ళిపోయింది. ప్రజలు

ఇళ్ల నుంచి బయట పెట్టేందుకే భయపడే వాతావరణం నెలకొంది. పూర్తిగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు చోటు చేసుకోవడంతో తప్పని సరి అయితే తప్ప బయట ఆడుగుపెట్టడం లేదు.

అత్యంత వెచ్చని రక్షణ కల్పించే ప్రత్యేక దుస్తులను ధరించి మాత్రమే విధులకు వెళ్ళవలసి వస్తోంది. టొరంటో నగరంలో అధిక శతం భారతీయ సంతతి ప్రధానంగా తెలుగు

రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. విద్య ఉద్యోగ విధుల నిమిత్తం అక్కడ నివాసం ఉంటున్న కుటుంబాలు ఈ అతి తక్కువ ఉష్ణోగ్రతలకు బెంబేలెత్తి

పోతున్నాయి. మరో నాలుగైదు రోజులు ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇళ్లకు ఇళ్లే దట్టమైన మంచు గడ్డలతో మునిగిపోతున్నాయి. ఇళ్ల బయట పార్కింగ్

చేసిన కార్లు సైతం మంచు వస్తువులుగా మారిపోతున్నాయి. రోడ్లపై సెంటీ మీటర్ల మందంతో మంచు పేరుకుపోవడంతో స్థానిక ప్రభుత్వం à°ˆ మంచుని ఎత్తి  à°¤à±€à°¸à±à°•à±à°µà±†à°³à±à°²à±‡à°‚దుకు

ప్రత్యేక సాంకేతిక సదుపాయాలున్న వాహనాలను వినియోగిస్తున్నాయి. మధ్యాహ్నం వేన్ తో శుభ్రపరిచి మరో గంటలో మళ్ళీ మంచు పేరుకుపోతోంది. పైగా ఎవరి ఇంటి దగ్గర ఉన్న

మంచు వారే శుభ్ర పరిచి ఒక ప్రక్క ఎత్తవలసి యుంది. లేనట్టయినా ప్రభుత్వ వాహనాలు ఈ మంచును తొలగించారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది. కొన్ని

ప్రాంతాల్లో అపార్టుమెంట్లలోని కుటుంబాలవారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లారు. 

వేడి గాలి ని పంపితే పైపులు పగిలిపోయాయి  : 
అత్యంత

తక్కువ ఉష్ణోగ్రతల ప్రభావంతో ఇళ్లల్లో వాడుకునే కుళాయిల్లో నీళ్లు సైతం కొయ్యబారిపోవడంతో మంచు కరిగించడానికి వేడి గాలిని ( హాట్ ఎయిర్ బ్లో)  à°ªà°‚పితే పైపులు

సైతం పగిలిపోతున్నాయని స్థానికులు తెలియచేస్తున్నారు. 

స్నో క్రీడల్లో పిల్లలు బిజీ బిజీ :

పాఠశాలల్లో పిల్లలతో వాతావరణానికి తగినట్టు స్నో క్రీడలు

అందిస్తున్నారు. ఐస్ స్కేటింగ్, ఐస్ హాకీ లాంటివి పిల్లలకు నేర్పిస్తున్నారు. భారతీయ వాతావరణానికి అలవాటు పడిన పిల్లలు ఈ క్రీడల పట్ల ఆసక్తి

కనబరుస్తున్నారు. 

క్లిష్ట పరిస్థితుల్లో రైలు ప్రయాణాలు :
రోడ్లకు రోడ్లే మంచు గడ్డలుగా మారిపోతుండడంతో ఉద్యోగాలకు వెళ్ళవలసిన వారు చలి ప్రభావం

తగలకుండా ప్రత్యేక ఉన్ని దుస్తులు, మంచు పై నడిచేందుకు వీలుగా  à°·à±‚ లు ధరించవలసిన పరిస్థితి. రైల్వే స్టేషన్లు లో ట్రాక్ క్లియర్ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం

వాడుతున్నారు. ప్లాట్ ఫార్మ్స్ పై మాత్రం మంచు యథాతథంగానే ఉంటోంది.

 

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #snow  #cold  #temperature  #Toronto #vancovour  #freeze  #canada

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam