DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రా మహిళను ఆర్ధిక ఇబ్బందులు పడనివ్వను: చంద్రబాబు 

కుటుంబ పెద్దగా భాద్యత తీసుకున్నా- విశాఖ లో డ్వాక్రా మహిళ సదస్సులో వెల్లడి 

విశాఖపట్నం, జనవరి 25, 2019 (DNS Online): ఈ రాష్ట్రంలోని మహిళలను ఆర్ధికంగా ఇబ్బందులు

పడనివ్వనని, ప్రజలందరికీ కుటుంబ పెద్దగా ఉన్నానని, వారి భాద్యతలను తానూ తీసుకున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం విశాఖనగరం లోని

ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఇంజనీరింగ్ కళాశాల మైదానం లో డ్వాక్రా మహిళలకు అందించే పసుపు కుంకుమ పధక అవగాహనా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఉద్వేగ

పూరిత సందేశాన్ని అందించారు. డ్వాక్రా మహిళలను చూస్తుంటే కొండంత ధైర్యం వస్తుందని,  à°µà°¿à°¶à°¾à°–లో ఇంతమంది ఆడపడుచులను చూస్తుంటే కలో నిజమో తెలియడం లేదు మీ అండతో

కొండనైన బద్దలు గొట్టే శక్తి నాకు వస్తుందని ప్రకటించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి ప్రపంచంలో ఒక్క డ్వాక్రా మహిళలకె ఉందన్నారు. సమాజంలో ఆడబిడ్డలకు

గౌరవం రావాలని ఈ కార్యక్రమం ప్రారంభించానని, నా అక్కలు, చెల్లెళ్ళ సైన్యం ఉండగా నన్నెవరూ ఏమి చేయలేరన్నారు. రూ. 8604 కోట్లతో ఇటీవల ఒక్కో మహిళకూ 10 వేల రూపాయలు

అందించానట్టు తెలిపారు. ఇబ్బందులున్నా అప్పులు చేసి మరీ మీకు డబ్బులిచ్చానని, ఎవరి దాయదక్షిణ్యాలు  à°²à±‡à°•à±à°‚à°¡à°¾ ఉండాలని రూ. 21 వేల కోట్లు ఇప్పటివరకూ ఇచ్చినట్టు

తెలియచేసారు. రాబోయే రెండు నెలల్లో పదివేలు మీ అకౌంట్ లలో వేస్తాను. పింఛన్ల సమయంలో మూడు చెక్కులు మీకు అందిస్తాను.ఒక చెక్కు 2,500..రెండో చెక్కు 3,500,...మూడో చెక్కు 4000 కు

అందిస్తానన్నారు. ఫిబ్రవరి లో తొలి చెక్ తో ఈ పధకం మొదలవుతుందన్నారు. భవిష్యతులో మరింత సహకారం అందిస్తానని ప్రకటించారు. తానిచ్చిన 20 వేలతో ఆర్థికంగా వృద్ధి

చెందాలని, ఆర్థిక వ్యవస్థకు మారుపేరుగా డ్వాక్రా సంఘాలు మార్పు రావాలని కోరారు. పెన్షన్లు రెట్టింపు చేసి భరోసాను ఇచ్చామని, కళ్యాణ మిత్ర,చంద్రన్న బీమా పథకాలు

చాలా బాగా చేస్తున్నాం.

త్వరలోనే స్మార్ట్ ఫోన్ లు : 

దశలవారీగా మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ లు అందిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తు

ప్రణాళికలపై విజన్ డాక్యుమెంట్ లు రూపొందించాలని, à°—à°¤ ప్రభుత్వ హయాంలో కేవలం 200 కోట్లు మాత్రమే ఇచ్చారని,  à°®à°¾ ప్రభుత్వం 20 వేల కోట్లు ఇచ్చిందన్నారు. వెలుగు

ఉద్యోగులకు అదనంగా 10 శాతం శాతం జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని, వచ్చే నెల నుంచి 30 శాతం పెంపుతో జీతాలు ఇస్తామని
చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు

ఇవ్వడం లేదన్నారు. కేంద్రం డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. మరో పదేళ్ళలో దేశంలో నెంబర్ వన్ గా ఏపీ ఉంటుందని, మానవత్వమే నా కులం,మతంగా

పనిచేస్తున్నాను.ఒకే రోజు 94 లక్షల మంది లో చైతన్యం తీసుకురావడం ప్రపంచంలో రికార్డు సృష్టించామన్నారు. ప్రభుత్వం చేస్తున్న హేమ అభివృద్ధి పథకాలను గూర్చి

ముఖ్యమంత్రి వివరించారు. మనం చేస్తున్న పనులను అందరికీ వివరించాలని  à°®à°¹à°¿à°³à°²à°¨à± కోరారు.

నాలుగు జిల్లాల నుంచి వచ్చిన మహిళలు బాబు నాయుడు కి జేజేలు పలుకుతూ తమ

ఆనందాన్ని వ్యక్తం చేశారు. విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి అలా సమాఖ్య అధ్యక్షురాలు, మెప్మా అధ్యక్షురాలు ముఖ్యమంత్రిని సన్మానించారు. 10 వేల

కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి మహిళా సంఘాల వారికి బహూకరించారు. ఈ సభలో మంత్రులు కళా వెంకటరావు అచ్చం నాయుడు అయ్యన్నపాత్రుడు గంటా శ్రీనివాస రావు, కిడారి

కిషోర్, జడ్పీ చైర్పర్సన్ లాలం భవాని, అనకాపల్లి ఎంపీ ఎం శ్రీనివాస రావు, జిల్లాలోని శాసనసభ్యులు, జిల్లా కలెక్టరు కె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media 

#dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra unviersity  #dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam