DNS Media | Latest News, Breaking News And Update In Telugu

4 న భీమిలి లో మహోదయ స్నానాలు : సాగర తీరం లో మరో పుష్కరం

మహోదయకాలంలో నది సాగర సంగమ స్నానం మహోన్నతం 

నరసింహ ఉగ్ర రూపం ఉపసరించినది భీమిలి లోనే :

విశాఖపట్నం, ఫిబ్రవరి 2 , 2019 (DNS Online ):  à°®à°¹à±‹à°¦à°¯ పుణ్యకాలమందు గోస్తనీ

సాగర సంగమ తీరంలో స్నాన మాచరించడం కోటిసూర్య గ్రహణములతో సమానమైనదని బ్రహ్మాండ పురాణం తెలియచేస్తోంది. 
 à°ªà±à°·à±à°¯ బహుళ అమావాస్య, సోమవారం, శ్రవణానక్షత్రం,

వ్యతీపాతయోగం ఉన్న సమయాన్ని మహోదయ కాలంగా ఆచరిస్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4 ,2019 వ తేదీ సోమవారం నాడు మహోదయ పుణ్యకాలం సమీపించనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని

నది సాగర సంగమం లో పవిత్ర స్నానమాహరించడం అత్యంత ప్రాశస్త్యంగా బ్రహ్మాండ పురాణం లో ప్రకటితమైంది. 

విశాఖపట్నం కు కేవలం 30 కిలో మీటర్ల దూరంలోని భీమునిపట్నం

లోని బంగాళఖాతం లో గోస్తనీ నది సంగమ స్థలం కావడంతో సోమవారం అత్యధిక సంఖ్యలో భక్తులు సాగర తీరంలో పుణ్య స్నానాలు ఆచరించనున్నారు. దీనికై రాష్ట్ర ప్రభుత్వ వివిధ

శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.   

పురాణ ప్రాశస్త్యం.: 

*అర్క శ్రోణా వ్యతీపాత యుక్తా౽మా పౌష మాఘయోః!అర్ధోదయస్స విఙ్ఞేయః కించిన్యూనా

మహోదయః*

అమావాస్య, సోమవారం, శ్రవణానక్షత్రం, వ్యతీపాతయోగం కలిసిన రోజున మహోదయమనే అలభ్యపుణ్యకాలం.  à°šà°¾à°²à°¾ అరుదుగా à°ˆ కలయిక సంభవిస్తుంది.  à°…ందుచేతనే ఇటువంటి

యోగం కోటిసూర్య గ్రహణములతో సమానమైనది అని పెద్దలు చెప్పారు.
à°ˆ సమయంలో  à°¸à°®à±à°¦à±à°°à°¸à±à°¨à°¾à°¨à°‚  à°šà±‡à°¸à°¿ పితృతర్పణములు చేయాలి. ఈరోజున  à°šà±‡à°¸à±‡ దానములు విశేష ఫలితాన్నిస్తాయి.

సాధకులకు మంత్రానుష్ఠానపరులకు  à°šà°¾à°²à°¾ ముఖ్యమైన రోజు. కాబట్టి ప్రతి ఒక్కరు à°ˆ మహోదయ పుణ్యకాలంలో ఈశ్వర పూజ,  à°¸à±à°¨à°¾à°¨à°‚,  à°œà°ªà°‚,  à°¤à°ªà°‚  à°†à°šà°°à°¿à°‚à°šà°¿, వారి వారి శక్తి కొలది

దానధర్మాలను ఆచరించి అనంతకోటి పుణ్యఫలాన్ని పొందగలరు. 

గోస్తనీ సాగర సంగమం లో స్నానం మహాద్భుతం. . . :  

గోవు స్థానముల నుంచి వచ్చిన నది కావడం తో గోస్తనీ

నది అనే పేరు వచ్చింది. బ్రహ్మాండ పురాణం ను అనుసరించి దండకారణ్యం దావానలం తో దహించుచున్న సమయంలో ఋషులు, సర్వ జీవులు భగవంతుని ప్రార్ధించగా కామధేనువు

సాక్షాత్కరించి తన స్థానముల నుంచి నీటిని విడిచి దావానలమును ఆర్పింది. ఆ నీటి ప్రవాహం నుంచి వచ్చినది కావడం తో ఆ నది గోస్తనీ నదిగా ప్రసిద్ధి కెక్కిందని

బ్రహ్మాండ పురాణం తెలియచేసింది. ఆ నది విశాఖ జిల్లా భీమునిపట్నం తీర సముద్రమందు సంగమించింది. నాటి నుంచి గోస్తనీ సాగర సంగమం పవిత్ర క్షేత్రమైంది. గోస్తనీ నది

సముద్రం లో కలిసిన రోజు కావడమే à°ˆ మహోదయం. వైదిక పరంగా నాదీ సాగర సంగమం అత్యంత ఉత్తమమైనది. సముద్ర స్నానము మాధ్యమమైనది. నదీ సంగమ స్నానం అథమమైనది. 
మహోదయ పర్వదినమున

సాగర సంగమ స్నానం సర్వపాప హరణం. 

నరసింహ పురాణం లో మహోదయం. : 

ఉగ్ర రూపం ఉపసరించినది ఇక్కడే : అత్యంత విశిష్టమైన నరసింహ రూపం నుంచి అత్యంత ప్రసన్నవదనమైం

శ్రీమన్నారాయణునిగా యథారూపం దాల్చిన ప్రదేశం గోస్తనీ సాగర సంగమమేనని నరసింహ పురాణం తెలియచేస్తోంది. 

అమార్క పాత శ్రవనై ర్యుక్తాచే త్పౌష్య మాఘయో

ఆర్దోదాయ స్సవిజ్ఞేయా: కిఞ్చిన్యోనం మహోదయ: ఏతత్కాలే నృసింహావతార విసర్జనానంతరే నారాయణ రూప ధారయేత్ "
శ్రీమన్నారాయణుడు నరసింహావతారమందు దుష్ట శిక్షణ

గావించిన అనంతరం భయంకర రూపమును విడిచిపెట్టకుండా సంచరించుట వలన మార్గ మధ్యమున గల సర్వ మానవులు, సకల జీవులు భయకంపితులై పారిపోవుచుండిరి. అది చూసిన ప్రహ్లాదుడు,

ముక్కోటి దేవతలు, ఋషులు భయంకరమైన ఆ నరసింహ రూపము విడిచి శాంతరూపమున సాక్షాత్కారించామని ప్రార్ధించిరి. నారసింహుడు ఉగ్రరూపమును వీడి నారాయణ రూపమున

సాక్షాత్కరించెను. à°† పర్వ దినములే ఆర్దోదాయ, మహోదయములుగా స్థల పురాణం తెలియచేస్తోంది. 
ఆ మహాత్కార్యం జరిగినది భీమిలి గోస్తనీ సాగర సంగమ స్థలంలోనే కావడం

గమనార్హం. భీమునిపట్నం లోని సౌమ్యగిరిపై వెలసిన ఆలయమున నరసింహుని స్వరూపం పఞ్చాబేరములలో నాలుగు రూపములు నారసింహునిగాను, ఐదవ డైన మూల రూపము శాంతా మూర్తియైన

నారాయణునిగా దర్శనమిచ్చుట విశేషం.
కావున ఆర్దోదాయ మహోదయ పుణ్యకాలం లందు గోస్తనీ స్వాగత తీర స్నానములాచరించి నారాయణ నరసింహుని దర్శించుట పుణ్య

ప్రదం.
 

పెద్ద ఎత్తున ఏర్పాట్లకు సిద్ధం:

సోమవారం మహోదయం సందర్బంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు భీమిని సాగర తీరానికి

రానున్నందున ప్రభుత్వ శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పిల్లలు, మహిళలు, వృద్దులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా భారీ బందోబస్తు

చేస్తున్నారు.
 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bhimili  #mahodayam  #gostani  #sea  #holy dip  #narasimha  #vishnu

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam