DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రా కి  రూ 5.56 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చాం : అమిత్ షా. 

మేమిచ్చిన ప్రతి పనికి లెక్క చూపండి, బాబుకి సవాల్ 

చంద్రబాబు కు ఎన్డీఏ కూటమి ద్వారాలు శాశ్వతంగా మూసుకున్నాయి :  

నమ్మినవాణ్ణి ముంచడమే యు టర్న్

చంద్రబాబు నైజం: అమిత్ à°·à°¾ 

యు టర్న్ ముఖ్యమంత్రి బాబు తో ఉపయోగం లేదు: కన్నా లక్ష్మీనారాయణ 

విభజన హామీల్లో 80 శతం నెరవేర్చాం : బీజేపీ

అధ్యక్షుడు

విజయనగరం, ఫిబ్రవరి 04, 2019 (DNS Online) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి  5 లక్షల 56 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు

అమిత్ షా ప్రకటించారు. సోమవారం విజయనగరం లో జరిగిన శక్తి కేంద్ర ప్రముఖ్ సమ్మేళనం లో అయన ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన బహిరంగ సభ లో మాట్లాడుతూ చంద్రబాబు లాంటి

ద్రోహులకి ఎన్డీఏ ద్వారాలు శాశ్వతంగా మూసుకున్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది, మిత్ర ద్రోహి, ఆషాఢ భూతి ఈ దేశం లో మరొకడు లేదన్నారు. నమ్మిన వాళ్ళని,

మిత్రులను నట్టేట ముంచడమే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నైజమని, అన్నారు. సొంత మామ ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచి, ఆయన కాంగ్రెస్

పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీని బలవంతంగా లాక్కుని, తిరిగి కాంగ్రెస్ కాళ్లదగ్గర చేర్చారన్నారు. ఇది పూర్తిగా సొంత కుటుంబానికి,

తద్వారా ఎన్టీఆర్ అభిమానులకు చంద్రబాబు చేసిన తీరని ద్రోహమన్నారు. త్వరలో జరుగనున్న  à°Žà°¨à±à°¨à°¿à°•à°² ఫలితాల వెల్లడి తర్వాత తిరిగి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత

మళ్ళీ బీజేపీ చూరు పట్టుకు వేళ్ళాడడానికి చంద్రబాబు గోతి దగ్గర నక్కలా వేచి చూసినా ఆశ్చర్యపోనక్కరలేదని ఎద్దేవా చేశారు.  à°¬à±€à°œà±‡à°ªà±€ అన్యాయం చేసింది అంటూ నానా

యాగీ చేస్తున్న చంద్రబాబు బీజేపీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కాళ్లదగ్గర వేళ్ళాడుతున్న చంద్రబాబు నాయుడు, 55 సంవత్సరాల

కాంగ్రెస్ పరిపాలనలో ఆంధ్రాకి చేసిందేంటో నిరూపించాలని, సవాల్ విసిరారు. 

మేమిచ్చిన ప్రాజెక్ట్ à°² లెక్కలు ఇవే : బీజేపీ అధ్యక్షుడు   

ఆంధ్రప్రదేశ్

కు కేంద్రం ఏమిచ్చింది అని à°ªà±à°°à°§à°¾à°¨ మంత్రి నరేంద్ర మోడీ ని, బీజేపీ ని కించపరుస్తూ అవాకులు, చెవాకులు వ్యాఖ్యానిస్తున్న చంద్రబాబును, తెలుగుదేశం పార్టీ

చెంచాలకు గుణపాఠం చెప్పే విధంగా నరేంద్ర మోడీ ఇచ్చిన సంస్థలను వివరిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలిపారు. మేమిచ్చిన ప్రాజెక్ట్ లకు లెక్కలు

చెప్పాం, నీదగ్గర వీటికి ఖర్చు చేసిన లెక్కలు చూపించాలని సవాల్ విసిరారు. 

రాష్ట్ర విభజన సమయంలో చేసిన చట్టంలో ప్రకటించిన అంశాల్లో 14  à°…ంశాల్లో 10

 à°¨à±†à°°à°µà±‡à°°à±à°šà°¾à°®à°¨à°¿  ( 80 శాతం నెరవేర్చమని) తెలిపారు.  à°ˆ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలలో తెలియచేసిన జాతీయ విద్యా సంస్థలను

నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వానికి 2022 వరకూ గడువు ఉన్నప్పటికీ, ఆరేళ్ళు ముందుగానే à°ˆ  à°¸à°‚స్థల ఏర్పాటును చేపట్టామన్నారు. వాటికి అదనంగా మరో కొన్నిహామీలు ఇవ్వని

సంస్థలను కూడా భారతీయ జనతా పార్టీ అందించిందన్నారు. à°ˆ మేరకు ఆయా జాతీయ సంస్థలను ఏర్పాటు చేసిన సంవత్సరం, ప్రాంతం తదితర  à°µà°¿à°µà°°à°¾à°²à°¨à± ఆయన ప్రకటించారు. వీటిల్లో 2015 లోనే

కొన్ని అనుమతి పొంది ప్రారంభం అయ్యాయని, వాటిల్లో  à°’à°• ఐఐటి ని తిరుపతి లోను ప్రారంభించగా, à°’à°• ఐఐఐటి ని శ్రీ సిటీ లోనూ మొదలుపెట్టమన్నారు, à°’à°• ఎన్ఐటీ ను

తాడేపల్లిగూడెం లోనూ నెలకొల్పి తరగతులు మొదలు పెట్టగా, విశాఖపట్నం నగరం లో  à°’à°• పెట్రోలియం యూనివర్సిటీను, à°’à°• ఐఐఎస్ఈఆర్ ను, à°’à°• ఐఐఎంను ప్రారంభించామని తెలిపారు.

à°’à°• ఎన్ఐడిఎం గుంటూరు లో 2016 లో  à°…నుమతి / ప్రారంభించగా, 2018 లో  à°’à°• జాతీయ వైద్య విద్యా సంస్థ  à°à°à°à°Žà°‚ఎస్ ను మంగళగిరిలోనూ, à°’à°• గిరిజన విశ్వ విద్యాలయం విజయనగరం లోనూ, à°’à°•

సెంట్రల్ యూనివర్సిటీ ని అనంతపురం లోనూ నెలకొల్పామని తెలిపారు. à°’à°• వ్యవసాయ విశ్వ విద్యాలయం కు అనుమతి కూడా ఇటీవలే వచ్చిందన్నారు. 

వ్యవసాయ విశ్వ విద్యాలయం

ను గుంటూరు లో,  à°¸à±†à°‚ట్రల్ ప్యాకేజింగ్ టెక్నాలజీ ని కూడా ఆంధ్రా కె కేటాయించామని, విశాఖ లో ఫార్మసిటి విద్యాలయాన్ని విశాఖపట్నం లోను,  à°ªà±†à°Ÿà±à°°à±‹à°²à°¿à°¯à°‚ విద్యాలయాన్ని

విశాఖనగరం లోనే ఇవ్వడం జరిగిందన్నారు. దీనికి అదనంగా  à°µà±ˆà°¦à±à°¯ విద్యాలయాల్లో 900 సీట్లు అదనంగా ఆంధ్రాకి అందించామని,  à°ªà°¾à°¸à± పోర్ట్ కార్యాలయం, నార్కోటిక్ కేంద్రం,

దూరదర్శన్ కేంద్రం, ఆకాశవాణి కేంద్రం, ఇగ్నో విద్యాలయం, తదితర మొత్తం 20 జాతీయ విద్య సంస్థలను అందించామని  à°¸à°—ౌరవంగా తెలియచేస్తున్నట్టు ప్రకటించారు. 

అయితే

చట్టం లో పొందుపరచని జాతీయ సంస్థల్లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ను 2015 లో కర్నూల్ లోను నెలకొల్పగా,

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ను 2015 లో నెల్లూరు లోనూ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సయిజ్ అండ్ నార్కోటిక్స్ ను 2015 లో అనంతపురం

లోనూ, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ను 2015 లో విజయవాడ లోను ప్రారంభించామని, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంస్థను  2018 లో నెల్లూరు లోనూ

ప్రారంభించామని ప్రకటించారు. మొత్తం 11 జాతీయ సంస్థలను హామీ ఇవ్వగా, వాటిల్లో పదింటిని ఇప్పడికే నెరవేర్చమని,  à°¹à°¾à°®à±€à°²à± ఇవ్వకుండా మరో ఐదు జాతీయ సంస్థలను కూడా ఆంధ్ర

ప్రదేశ్ కు కేటాయించామన్నారు. 

ముద్ర యోజన లో 21 వేల కోట్ల రుణాలు ఇచ్చామని, భారత్ మాల ప్రాజెక్ట్ లో భాగంగా  44  à°µà±‡à°² కోట్లు నిధులు కేటాయించామని, సాగర్ మాల ద్వారా

1 లక్ష 64 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు,  31 సంస్థలకు చెందిన ప్రాజెక్ట్ లను 3 లక్షల 9 వేల కోట్ల నిధులు పోజెక్టులు అందించామని, జాతీయ ప్రాజెక్టులలో భాగంగా 15  à°µà±‡à°² కోట్ల

రూపాయల నిధులు కేటాయించామని, మొత్తం వెరసి,  5 లక్షల 56 వేల కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ à°² కె చెల్లుతుందని

ప్రకటించారు. 

ఇవేవీ పట్టని అవినీతి కోరు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ చెంచాగిరీలకు కనపడడం లేదని, వాళ్ళల్లా భారతీయ జనతా పార్టీ అవినీతి కూడుకు అర్రులు

చాచకుండా ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ కు వేల కోట్లా నిధులు కేటాయించినందుకేనా చంద్రబాబు అండ్ కో మోడీ ని, బీజేపీ ను నానా అవాకులు చెవాకులూ పేలుతున్నారని

మండిపడ్డారు. à°ˆ నెల 10 à°¨ గుంటూరు, 16 à°¨ విశాఖనగరం లో జరిగే మహా బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసే ప్రసంగంతో చంద్రబాబు, అతని చెంచా à°—à°¿à°°à±€ à°²  à°šà±†à°µà±à°²à°•à± పట్టిన

తుప్పు వదిలిపోతుందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ తాను అధికారం లో ఉన్న సమయం లో కేవలం 1 లక్ష 32 వేల కోట్ల నిధుల ప్రాజెక్టులు మాత్రమే ఇచ్చారని, అన్ని ఇచ్చి

ఆంధ్రా à°•à°¿ మేలు చేసిన బీజేపీ పై విరుచుకు పడడం అంటే ఆంధ్రాకి ద్రోహం చెయ్యడమేన్నారు. అది మీకు నిత్యా కృత్యమే కదా అని ఎద్దేవా చేశారు. 
    
ఆషాఢభూతి యు టర్న్

బాబుతో ఉపయోగం లేడు : కన్నా 

అంతకు ముందు రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ తన స్వార్ధం కోసమే చంద్రబాబు నాయుడు బీజేపీ తో జతకట్టి, ఎన్డీఏ

లో చేరాడని, తన అవసరం తీరిన తర్వాత అబాడాలు వేస్తున్నదన్నారు. రాష్ట్రం లో మోడీ à°•à°¿,  à°¬à±€à°œà±‡à°ªà±€ à°•à°¿ పెరుగుతున్న మద్దతు చూసి తట్టుకోలేని చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ

నోటికి వచ్చిన అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. రానున్న నెల రోజుల కాలం చంద్రబాబు à°•à°¿ గడ్డు కాలమేనని హెచ్చరించారు. 

ఈ సమావేశం లో అమిత్ షా హిందీ

లో చేసిన ప్రసంగానికి మాజీ కేంద్ర మంత్రి, మహిళా మోర్చా జాతీయ ఇంచార్జి à°¡à°¿. పురంధేశ్వరి తెలుగులో అనువాదం చేశారు.  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚ లో విశాఖపట్నం ఎంపీ డాక్టర్ కె.

హరిబాబు, శాసన సభ పక్ష బీజేపీ నేత,  à°µà°¿à°¶à°¾à°– ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, కేంద్ర ప్రతినిధులు,  à°†à°‚ధ్ర ప్రదేశ్

రాష్ట్ర కార్యవర్గం, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp #haribabu  #amit shah  #vizianagaram  #parliament   #vishnu kumar raju  #madhav  #chandra babu naidu  #union government  #projects  #telugu desam

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam