DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలవరం పనులు మరింత వేగవంతం : ముఖ్యమంత్రి ఆదేశం 

ప్రారంభానికి సిద్ధమైన 4 ప్రాజెక్టులు 

అమరావతి, ఫిబ్రవరి 04, 2019 (DNS Online) : సమయం తక్కువగా ఉండడం వల్ల పోలవరం పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు

నాయుడు అధికారులను ఆదేశించారు. 'ఏప్రిల్ నెలాఖరు లోపు డ్యామ్ పని పూర్తి చేయాలి... రోజువారీ పనుల లక్ష్యాన్ని నిర్ణయించాలి. అనుకున్న లక్ష్యాలను అందుకోవాలి'.. అని

ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.  à°ªà±‹à°²à°µà°°à°‚ పనులు, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై ఉండవల్లి ప్రజావేదికలో ఆయన సమీక్షించారు. à°ˆ సందర్బంగా వివిధ దశల్లో పోలవరం పనుల ఏ మేరకు

పూర్తయ్యాయి, లక్ష్యాలు చేరుకున్నారా  à°²à±‡à°¦à°¾ అని అధికారులను ముఖ్యమంత్రి à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. మొత్తం ఇప్పటి వరకు  à°ªà±‹à°²à°µà°°à°‚ ప్రాజెక్టు పనులు 65.04% పూర్తయ్యాయి. హెడ్

వర్క్స్ 55.37 శాతం పూర్తయ్యాయి. ప్రధాన డ్యామ్ ప్యాకేజిలో 54.9 శాతం పౌలు పూర్తయ్యాయి. స్పిల్ వే, స్పిల్ ఛానల్ కు సంబంధించి తవ్వకాల పనులు 1115 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 953

లక్షల క్యూబిక్ మీటర్లు అంటే 85.5 శాతం పనులు పూర్తయ్యాయి. కాంక్రీట్ కి సంబంధించి 36.79 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటికే 23.75 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు అంటే 64.55

శాతం పనులు పూర్తి చేసారు. కాఫర్ డ్యామ్ à°•à°¿ సంబంధించి 20.7 శాతం పనులు పూర్తి చేసారు. 
వీటిలో కొన్ని కీలక ఘట్టాల్లో పనులు ఇంకా వేగవంతం చేసి ఏప్రిల్ నెలాఖరుకు

పూర్తి అయ్యేలా న్నీ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 
మనకు ఉంది మరో 3నెలలు మాత్రమే ఉందని,  à°¤à°°à±à°µà°¾à°¤ మళ్లీ గోదావరిలో వరదనీరు

ఉంటుందని ఆయన అప్రమత్తం చేసారు. పోలవరం పనులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఎర్త్ వర్క్, కాంక్రీట్ పనులు ముమ్మరం చేయాలని, ఎడమ,కుడి కాలువ పనులు వేగం

పుంజుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 

ఇరిగేషన్ ప్రాజెక్టులలో పురోగతి : 

మొత్తం అనుకున్న 62 సాగునీటి ప్రాజెక్టుల్లో ఇప్పటికే 19 ప్రాజెక్టులు

ప్రారంభమయ్యాయని, ఇంకా మరో నాలుగు ప్రాజెక్టులు ఇక ప్రారంభానికి సిద్ధమవుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. కెఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్టు, కందుల

ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు, గొల్లపల్లి రిజర్వాయర్ దిగువన మడకశిర బ్రాంచ్ కెనాల్, అడవిపల్లి రిజర్వాయర్ సిద్ధంగా ఉన్నాయి. 
à°ˆ 4  à°ªà±à°°à°¾à°œà±†à°•à±à°Ÿà±à°²

వ్యయం రూ.3,665  à°•à±‹à°Ÿà±à°²à±. ఇప్పటికే రూ.3,333  à°•à±‹à°Ÿà±à°²à± ఖర్చుచేశాం. ఇంకా రూ.332 కోట్లు  à°µà±à°¯à°¯à°‚ చేయాలి. à°ˆ 4ప్రాజెక్టుల ద్వారా 1,70,090  à°Žà°•à°°à°¾à°² కొత్త ఆయకట్టు, 13,40,772  à°Žà°•à°°à°¾à°² స్థిరీకరణ

జరుగుతుంది.... అని ముఖ్యమంత్రి వివరించారు. 28, 246 కోట్ల రూపాయల తో మరో 26 ప్రోజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయని, వీటి వల్ల 11,87,588 ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి

వస్తున్నాడని, 23 లక్షల కు పైగా ఎకరాలు స్థిరీకరణ అవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. 

వెలుగొండ ప్రాజెక్టు పనులపై, సమీక్షిస్తూ టన్నెళ్ల పనులు ప్రతివారం ఎంత

చేశారో చెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  à°®à°¦à°¨à°ªà°²à±à°²à°¿à°•à°¿ 5à°•à°¿.మీ దూరానికి కృష్ణా జలాలు చేరాయి, à°ˆ రాత్రికి, లేదా రేపటికి 50క్యూసెక్కులు చేరతాయని అధికారులు

వివరించారు. చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి 150క్యూసెక్కులు విడుదల అవుతున్నాయని, చిత్తూరు సరిహద్దుకు 85క్యూసెక్కుల నీరు, కుప్పానికి à°ˆ నెల 25  à°•à°²à±à°²à°¾ నీరు చేరాలని

ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్

పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #chandrababu naidu  #polavaram  #telugudesam

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam