DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చకుడికి వెయ్యి జీతం కూడా ఇవ్వలేని దౌర్భాగ్యం స్థాయి దేవాదాయ శాఖది. 

దేవాదాయ శాఖా నిర్లక్ష్య  à°µà±ˆà°–à°°à°¿ :అధికారులు లేకుండా గ్రీవెన్సా? 

అర్చకులా ?  à°µà°¾à°³à±à°²à±†à°µà°°à± ? అనేలా ఉంది à°ˆ గ్రీవెన్స్ ?

తూతూ గ్రీవెన్స్. . ఇది అర్చకులకు

ఘోర అవమానం. :

విశాఖపట్నం, ఫిబ్రవరి 05, 2019 (DNS Online) : ఆలయాల్లో మూల విరాట్ కు నిత్యం అర్చనలు చేసే అర్చకులకు కనీసం వెయ్యి రూపాయలు జీతం కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి లో

రాష్ట్ర దేవాదాయ శాఖా ఉంది. ఇదే విషయం విశాఖ గ్రీవెన్స్ లో బహిర్గతమైంది. à°¦à±‡à°µà±à°¨à°¿ పేరిట భక్తులు హుండీల్లో వేస్తున్న ఆదాయం, మొక్కుబడులను అధర్మంగా దోచుకుతినే

దేవాదాయ శాఖా లో నిర్లక్ష్య వైఖరి పూర్తి స్థాయిలో కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. మొక్కుబడిగా చేసిన గ్రీవెన్స్ లో జిల్లా అధికారి లేకుండా తూ తూ మంత్రంగా

చేపట్టడం తో అర్చకుల పై దేవాదాయ శాఖా అధికారులకు ఎంత గౌండవం ఉందొ తెలుస్తోంది. మంగళవారం దేవాదాయ శాఖా కమిషనర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లా కేంద్రంలోను

అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారులు అర్చక, ఆలయ సిబ్బంది కి గ్రీవెన్స్ నిర్వహించవలసి ఉంది. ఈ ఆదేశాల ప్రకారం కచ్చితంగా ఈ గ్రీవెన్స్ లో ఏసీ ఉండాల్సిన అవసరం

ఉంది. తద్వారా ఆలయాల అర్చకులు, ఆలయాల సిబ్బంది అందించే వినతి పత్రాల ద్వారా వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాల్సియుంటుంది. అయితే విశాఖ జిల్లా కేంద్రం లో

మంగళవారం ( ఫిబ్రవరి 5 ) న ఉదయం 11 గంటల నుంచి జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమం లో విశాఖ జిల్లా ఏసీ పాల్గొనాల్సియుంది, అయితే వారు గైర్హాజరు కావడం తో కార్యాలయ క్రింది

స్థాయి అధికారి సూపరెంటెండెంట్ రామకృష్ణ పరమ హంస మాత్రమే పాల్గొన్నారు. ఆయనకి ఈ అర్చకుల సమస్యలు వినడానికి మాత్రమే అర్హత ఉంది తప్ప, వాటి పరిష్కారం పై ఎటువంటి

అధికారం లేదు. పరిష్కారం చూపించలేని వాళ్లకి అర్చకులు తమ గోడు వినిపించుకుంటే ఉపయోగం ఏంటని వివిధ ఆలయాల అర్చకులు మండిపడుతున్నారు. వీటిల్లో నిర్ణయాధికారం

లేని వాళ్లకి సైతం ఇది బాధాకరం గానే కనిపించి, వాళ్ళ ఆవేదన విని వాళ్ళు కూడా అయ్యో అనడం తప్ప మరొకటి చెయ్యలేని పని. ఈ గ్రీవెన్స్ లో విశాఖ జిల్లాలోని వివిధ

ప్రాంతాల్లోని ఆలయాలకు చెందిన అర్చకులు తమ ఆవేదన వ్యక్తం చేసేందుకు తరలి వచ్చారు. తీరా వచ్చాక ఏసీ గైర్హాజరు తో నిరాశకు లోనయ్యారు. వచ్చిన దరఖాస్తుల్లో ఒక

అర్చకునికి నెల జీతం వెయ్యి రూపాయలు ఉంది, అది కూడా ఒక ఏడాది నుంచి ఇవ్వడం లేదు, మరొకరికి నెలకి ఐదువేలు నిర్దారించారు, దానిలోనే ఆలయంలో ధూప దీప నైవేద్యాలకు

లింకే పెట్టారు, అధికారుల పర్యటనలో చేసే ఖర్చు కూడా అర్చకుల జీతం లోనే కోసేస్తున్నారంటూ మరొకరి ఆవేదన. అందరూ అర్చకుల మీదే ఆడుతున్నారు అంటూ ఓ అర్చకుని

మనోవేదన. ఇవేవీ పట్టని అసిస్టెంట్ కమిషనర్ à°ˆ గ్రీవెన్స్ కు గైర్హాజరు అయ్యారు. 


శ్రమ అర్చకుడిది ..  à°¦à±‹à°ªà°¿à°¡à±€ సిబ్బందిదా ? : ఉత్తరాంధ్ర అర్చక

సంఘం 

అర్చకులే లేకపోతే అధికారులకు పనేంటి ?

అర్చకులు సరిగ్గా అర్చనలు చేస్తేనే ఆలయాలకు ఆదాయం వస్తుంది. అప్పుడే ఆలయంలో గుమాస్తాలు, ఏవో లు ఇంకా

వగైరాలు ఇతరత్రా ఉద్యోగాలకు అవసరం పడుతుంది. ప్రధానంగా ఆలయంలో అర్చకుడికి కనీసం వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి లో దేవాదాయ శాఖ ఉందని

ఉత్తరాంధ్ర అర్చక సంఘం సంయుక్త కార్యదర్శి కొత్తలంక మురళి కృష్ణ మండిపడ్డారు. అర్చక సంఘం తరపున వినతి పత్రాలు అందించేందుకు ఏసీ కార్యాలయానికి వచ్చారు. ఈ

సందర్బంగా అయన మాట్లాడుతూ జిల్లాలోని చాలా దేవాదాయ శాఖా పరిధిలోని ఆలయాల్లో కొందరికి వెయ్యి రూపాయలు నెల జీతం నిర్ధారించారని, అది కూడా గత ఏడాది నుంచి ఇవ్వడం

లేదని, పైగా అదే ఆలయం లో పనిచేస్తున్న గుమస్తాలకు 40 వేల రూపాయల జీతాన్ని ఇస్తున్నారని మండిపడ్డారు. పైగా à°ˆ ఆలయాల్లో  à°‰à°‚డే గుమస్తాలకు, మేనేజర్లకు, ఏవో లకు అర్చకులు

అంటే చాలా నీచమైన అభిప్రాయం ఉందని, అర్చకులకు జీతాలు ఇవ్వాలంటే వీళ్లకు చేతులు రావని, వీళ్ళ సొంత ఆస్తులు ఖర్చు అయిపోతున్నట్టు తెగ బాధపడిపోతున్నారని

మండిపడ్డారు. అదే విధంగా రాష్ట్రంలో దేవాదాయ శాఖా అధికారులకు సైతం అర్చకులంటే చాలా చిన్న చూపు ఉందని, ఈ శాఖా మొత్తం అర్చకులు చేసే అర్చనల మీదే ఆధారపడి ఉందన్నారు.

ఒక్కసారిగా అర్చకులు గుడి మూసేస్తే moottam దేవాదాయ శాఖా మూత పడే అవకాశం ఉంటుందన్నారు. అర్చకులే లేకపోతే ఇక దేవాదాయ శాఖ ఎందుకని ప్రశ్నించారు. ఈ రోజు జరిగిన

గ్రీవెన్స్ తో కేవలం ఒక పత్రం ఇవ్వడం వరకే పరిమితమన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra pradesh  #government  #endowments  #archakas  #temples  #assistant commissioner  #grievances

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam