DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రాని ఆదుకోండి మహాప్రభో: రాష్ట్రపతికి ఆడారికిషోర్ వేడుకోలు

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 12 , 2019 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014 లో ప్రకటించిన అన్ని అంశాలను తక్షణ అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించి ఆంధ్రా ని

ఆదుకోవాలని భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ని ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి ఆడారి కిషోర్ కుమార్ వేడుకున్నారు. గత రెండు

రోజులుగా న్యూ ఢిల్లీ లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్ననిరసనల్లో అయన పాల్గొన్నారు. రెండవ రోజైన మంగళవారం ఆంధ్ర భవన్ నుంచి

జంతర్ మంతర్ వరకూ ర్యాలీ చేపట్టిన అనంతరం భారత రాష్ట్రపతి ని మీడియా ముఖంగా వేడుకున్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ భారత అత్యున్నత

చట్టసభ పార్లమెంట్ ఆమోదించిన ఈ చట్టాన్ని అమలు చెయ్యకపోతే ఈ దేశంలో రాజ్యాంగం పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు. అత్యంత క్లిష్ట మైన పరిస్థితుల్లో

 à°†à°‚ధ్ర ప్రదేశ్ లో à°—à°¤ ఐదేళ్లుగా ఆంధ్రులు  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨ ఆర్తనాదాలు ప్రధాని నరేంద్ర మోడీ à°•à°¿ గానీ, కేంద్రం లోని బీజేపీ à°•à°¿ గాని వినిపించలేదని, దీంతో గల్లీ నుంచి

ఢిల్లీ వరకూ పోరాట దీక్ష చేపట్టామన్నారు.  à°¢à°¿à°²à±à°²à±€à°²à±‹ à°ˆ నెల 11,12 తేదీల్లో జరిగిన ముఖ్యమంత్రి ధర్మ పోరాట దీక్షకు ఆంధ్రప్రదేశ్ యువజన జే.ఏ.సి తరపున రాష్ట్ర కన్వీనర్

హోదాలో పాల్గొన్నట్టు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ సహా మిగిలిన విభజన హామీలను తక్షణం నెరవే ర్చే విధంగా కేంద్రానికి

సూచించాలన్నారు. ఆర్ధిక, రాజ్యాంగ కోవిదులైన రాష్ట్రపతి పరిధిలోనే కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేయవలసి యున్నందున, కేంద్ర ప్రభుత్వానికి తన భాద్యతలు తెలియడం

లేదన్నారు. ఇంతకాలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని గల్లీల్లో నిరసనలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి వినపడని కారణంగా ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ కే

చేరుకున్నామన్నారు. ఇప్పడికీ తమ ఆవేదన కేంద్రం లో అధికారం లో ఉన్న మోడీకి, బీజేపీ కి వినపడడం లేదన్నారు. తమ డిమాండ్లలో ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖకు రావాల్సిన

రైల్వేజోన్, ఉత్తరాంధ్ర ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇచ్చ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. 

11 మందికే రాష్ట్రపతి అనుమతి : . . .

తెలుగుదేశం

పార్టీకి చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, యువజన జేఏసీ నేతలు, స్వయం ప్రకటిత మేధావుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అయితే రాష్ట్రపతి కేవలం 11 మందికే అనుమతి ఇవ్వడంతో ఈ బృందం లో కీలకంగా భావించిన వారు వారు మాత్రమే రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్బంగా తమ 18 డిమాండ్లను రాష్ట్రపతి

రామ్ నాధ్ కోవింద్ కు వివరించినట్టు బృంద సభ్యులు తెలిపారు. 

 

 

pix: NTV courtesy

 

#dns  #dnsnews  #dnsmedia  #dnslive  #dns news #dns media  #dns live  #vizag   #visakhapatnam  #bjp  #telugudesam  #chandrababu naidu  #adari kishore kumar  #delhi  #protest  #dharma porata deeksha  #president  #Ramnadh Kovind

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam