DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్ధి  ఆడారి కిషోర్ కు ఎపిటిఎఫ్ (1938)మద్దతు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 14 ,2019 (DNS Online ) : త్వరలో జరుగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోటీలో ముందంజలో నడుస్తున్న ఆడారి కిషోర్ కుమార్ కు ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్

ఫెడరేషన్ మద్దతు ప్రకటించింది. గురువారం నగరం లోని à°“ హోటల్ లో జరిగిన సమావేశంలో ఎపిటిఎఫ్ (1938 )  à°…ధ్యక్షులు కె. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే

మార్గదర్శకంగా నిలిచినా  à°®à°¾à°°à±à°ªà± బాలకృష్ణ వారసునిగా ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి విద్యార్థి దశ నుంచి పోరాట పటిమను చూపిస్తున్న యువకులు, ఆంధ్ర ప్రదేశ్ యువజన

జేఏసీ కన్వీనర్ ఆడారి కిషోర్ కుమార్ కు ఎమ్మెల్సీ పోటీల్లో మద్దతు గా నిలిచి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై

పరిపూర్ణ అవగాహనా కల్గి యుండి, ప్రతి ఉద్యమం లోనూ తన సమకారం అందించడం ద్వారా టీచర్లకు ఈయన ప్రాతినిధ్యం వహించడం ఒక భాద్యతగా గుర్తించామని తెలియచేసారు. గత 12

ఏళ్లుగా ఉన్న ఎమ్మెల్సీ లు  à°¸à°®à°¸à±à°¯à°² పరిష్కారం లో ఘోరంగా విఫలం చెందారని,వాటి పరిష్కారం ఆడారి వల్లనే జరుగుతుందన్నారు. ప్రధాన కార్యదర్శి జి. హృదయ రాజు మాట్లాడుతూ

సిపిఎస్ జాతా లో కూడా ఆడారి కిషోర్ కుమార్ పాల్గొనే, ధర్నాలు, నిరసనలు చేసిన సందర్భాల్లో ప్రత్యక్షంగా పాల్గొని, విజయవాడ లో పాల్గొని, రాష్ట్ర ప్రత్యేక హోదా, విశాఖ

కేంద్రంగా రైల్వే జోన్ సాధనకై న్యూఢిల్లీ లో సైతం ప్రత్యక్ష ఉద్యమం లో పాల్గొన్న యువకిశోరానికి తమ టీచర్స్ సంఘం అండగా నిలుస్తామని తెలియచేసారు. ఈ సందర్బంగా

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎంఎల్ సి అభ్యర్థి ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ దేశ భవిష్యత్ కు ఆశాదీపాలైన విద్యార్థులను తయారు చేస్తున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న

సమస్యలను పరిష్కరించవలసిన భాద్యత తనపై ఉందని, దీన్ని భాద్యతగా స్వీకరించి, వాటి పరిష్కారాన్ని కృషి చేస్తానన్నారు. తానూ అనకాపల్లి గ్రామం నుంచి విద్యార్థి

నాయకునిగా ఉద్యమ జీవితాన్ని మొదలు పెట్టి అత్యున్నత విద్య సంస్థ హైదరాబద్ కేంద్రీయ విద్యాలయం లో విద్యార్థి సంఘం నాయకునిగా విజయం సాధించి, విద్యార్థి సమస్యలను

పరిష్కారానికి కృషి చేశానన్నారు. ఉపాయధ్యాయుల సమస్యల పరిష్కారానికి చట్ట సభ వేదికగా తన వాణిని బలంగా వినిపిస్తానన్నారు. అందరూ తనపై ఉంచిన నమ్మకాన్నివాస్తవ రూపం

కల్పిస్తానన్నారు.  
à°ˆ సమావేశం లో సంఘం రాష్ట్ర  à°—ౌరవ అధ్యక్షులు వి. సదాశివ రావు, ఉపాధ్యక్షులు ఆర్. కృష్ణ, శ్రీకాకుళం జిల్లా అకాధ్యక్షులు కె. పాపారావు, ప్రధాన

కార్యదర్శి చలపతి రావు, విజయనగరం అధ్యక్షులు జి. ఈశ్వర రావు, ప్రధాన కార్యదర్శి జె.సి. రాజు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి జాకబ్

తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #bjp  #government  #MLC  #teachers constituency  #Adari Kishore Kumar  #APTF  #Marpu Balakrishnamma  #Vijayanagaram  #Srikakulam  #andhra pradesh

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam