DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాక్ పై ప్రతీకార చర్య తీసుకోవాల్సిందే : మాజీ మంత్రి కొణతాల 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 15, 2019 (DNS Online ): కాశ్మీర్ లోని పుల్వామా దగ్గర జరిగిన  à°‰à°—్రదాడికి పాకిస్తాన్ పై భారత్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని మాజీ మంత్రి కొణతాల

రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం విశాఖపట్నం సాగర తీరం లోని విక్టరీ ఎట్  à°¸à°¿ సైనిక స్మారక స్తూపం వద్ద కొవ్వోతుల ప్రదర్శన చేశారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

అమరులైన ప్రతి సైనికుని కుటుంబానికి ఈ దేశ పౌరులు అండగా నిలబడి వారికి తాము అండగా ఉన్నామని నిలబడవలసి అవసరం ఉందన్నారు. ఇంతటి దుశ్చర్యకు పాల్పడి భారత సైనికుల పై

దొంగ తనంగా దాడి చేసిన జైష్ ఏ మహ్మద్ ముఠాకోరు నేత మసూద్ అజర్ ను భారత్ కు తిరిగి రప్పించాలని, ఇలాంటి నీచ తుచ్ఛులకు అండగా నిలిచినా పాకిస్తాన్ పై సైనిక ప్రతీకార

చర్య తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం గతం లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ లాంటి రహస్య సైనిక చర్యలు చేపట్టి పాకిస్తాన్

ఆగడాలకు తక్షణం అడ్డుకట్ట వేయాలన్నారు.  à°­à°¾à°°à°¤ సైనికులు పగలనక, రాత్రనక దేశ సరిహద్దుల్లో రక్షణ కాస్తూ తమ జీవితాలను పణంగా పెట్టారని, ప్రతి భారతీయుడు ప్రతి

సైనికుడు తమ ఇంటిలోని కుటుంబ సభ్యులుగా భావించాల్సిన తరుణమిది అన్నారు. తక్షణం ప్రపంచ దేశాలకు భారత్ శక్తిని చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, ఉగ్రవాదాన్ని

పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలను ఐక్య రాజ్య సమితి నుంచి శాశ్వతంగా బహిష్కరించాలి డిమాండ్ చేశారు. అనంతరం భారీ ర్యాలీగా   సాగర తీరంలోని విక్టరీ ఎట్ సి

స్తూపం నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ 
జై జవాన్ జై భారత్  à°¨à°¿à°¨à°¾à°¦à°‚ చేసుకుంటూ కదిలారు. 

పాక్ పై కఠిన చర్యలు తప్పవు. : బీజేపీ నేత చలపతి

రావు.

కాశ్మీర్ లోని భారత సైనికులపై దొంగదాడి చేసిన జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థ పై, దాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పైన, కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు

తీసుకుంటుందన్నారు. గతంలోనే ఇదే దుర్మార్గుడు భారత్ చెర లో ఉండగానే పాక్ కు తరలించుకు పోయారని, భారత పార్లమెంట్ పై దాడి చేసిన ఘటనలో కీలక పాత్ర పోషించాడని,

అప్పుడే ఇతన్ని భారత్ కు రప్పించి ఉరి తీసి ఉంటె à°ˆ రోజు భారత్  40 మంది సైనిక శక్తిని కోల్పోయేది కాదన్నారు. సైనికులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పాక్ పై చర్యలకు

పూర్తి అధికారం ఇచ్చిందన్నారు. అంతకు ముందు అమరులైన సైనికులకు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులూ పివి నారాయణ రావు, రత్నకుమారి తదితరులు

పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #candle light protest  #konathala ramakrishna  #Victory at Sea  #Alluri statue  #Vibhajana Hakkula porata samithi  #military  #Kashmir  #attack

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam