DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సైనికులే చట్ట సభకి అర్హులు అనే నిబంధన పెట్టాల్సిందే 

సైనికులు పహారాకు తప్ప పరిపాలనకు పనికిరారా ?

పుల్వామా ఘటన: రాజకీయ తప్పిదం, తీవ్ర పర్యవసానం

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 17, 2019 (DNS Online ): భారత సరిహద్దుల్లో నిరంతరం

జరుగుతున్న జీవన్మరణ పోరాటం లో ధైర్యం గా ఎదురొడ్డి విజయం సాధిస్తున్న సైనికులే ఈ దేశాన్ని పరిపాలించేందుకు తగిన అర్హులు అనే నిబంధన తక్షణం తీసుకురావాల్సిన

అవసరం ఎంతైనా ఉంది. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకూ అన్ని స్థాయిల్లోని చట్ట సభలకూ కేవలం సైనికులే అర్హులు అనే నిబంధన తీసుకు రావాలీ. దేశ రక్షణకు సంబంధించిన

అత్యంత కీలక నిర్ణయాలు క్షేత్ర స్థాయి లో పనిచేసిన వీరు మాత్రమే తగిన నిర్ణయం తీసుకోగలరు అనే అభిప్రాయం చాల మందిలోనే ఉంది. ఏసీ గదుల్లో కూర్చుని రాజకీయ నేతలు

తీసుకునే తప్పుడు నిర్ణయాల ఫలితంగా వందలాదిగా అమాయక భారత సైనికులు అమరులు అవుతున్నారు. దేశాన్నిపీక్కు తినాలి అనుకునే రాజకీయ పార్టీల స్వార్ధ పూరిత

నిర్ణయాలకు కొందరు అధికారులు వత్తాసు పలకడమే చాలా ప్రమాదాలకు ఆస్కారం కల్పిస్తోంది. 
యుద్ధం లో ప్రత్యక్షంగా పోరాడేవాళ్ళకే సమస్య తీవ్రత తెలుస్తుంది తప్ప

ఏసీ గదుల్లో కూర్చునే వారికేమి తెలుస్తుంది అనే ప్రశ్నలు దేశ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమం లోనే సరిహద్దుల్లోనుంచి ఒక్కసారిగా మొత్తం సైనికులు

తప్పుకుంటే పరిస్థితి ఏంటో à°ˆ రాజకీయ నేతలను ఆలోచన చేసే లోగానే జరగరాని ఘోరం జరిగిపోతుంది. 

బడ్జెట్ లో నిధులు ఇస్తున్నామని గొప్పగా కాకి లెక్కలు చెప్పే

కేంద్ర ప్రభుత్వం పెద్దలకు, దేశ రక్షకులపై కనీస భాద్యత ఉన్నట్టుగా కనపడడం లేదు. కాశ్మీర్ లోయలోని పుల్వామా లో భారత సైనికులపై ఉగ్ర దుండగులు చేసిన దమన కాండ నుంచి

భారత దేశం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలానే ఉన్నాయి. కాశ్మీర్ లోయలో సైనిక శిబిరాలపై భారీ దాడి జరుగుతుందని నిఘావర్గాలు ముందుగానే హెచ్చరించినా తగిన

నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం, అధికారులు పట్టించుకున్నట్టుగా లేదు, తమకు లేని సొంత మెదడు వాడినందువల్లే ఇంత తప్పిదం జరిగింది. 
ఇక పై ఇలాంటి దుర్ఘటనలు

జరుగకుండా ఉండాలంటే సైన్యం లో క్షేత్ర స్థాయి లో పనిచేసిన వారినే చట్ట సభల్లో పోటీ చేసేందుకు అర్హులుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో దేశంలోని

రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులందరినీ సైన్యంలోకి పంపి భారత్ పాకిస్తాన్ సరిహద్దులో గస్తీకి పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది సైనికులు పడే అవస్థలు. పాలకుల

నిర్లక్ష్య వైఖరి మారితే తప్ప ఈ దేశంలో సైనికులకు సంపూర్ణ భరోసా లభించదు.

 

 

#dns  #dns live  #dns media #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #parliament  #India  #soldiers  #elections  #Borders  #Border Security Force  #Army  #Military  #Jawans  #Air Force  #CRPF

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam