DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానవాళి మనుగడకు మహత్తర మందు శ్రీవిష్ణు సహస్రం: చిన్న జీయర్ 

విజయ కీలాద్రి పై వైభవంగా విరాట్ విష్ణు సహస్రనామ పారాయణ 

విజయవాడ,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 16, 2019 (DNS Online ): సమస్త మానవాళి మనుగడకు మహత్తరమైన మందు ( ఔషధం) శ్రీ విష్ణు సహస్రనామమేనని

పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలిపారు. మాఘ శుద్ధ ఏకాదశి ( భీష్మ ఏకాదశి)  à°ªà°°à±à°µà°¦à°¿à°¨à±‹à°¤à±à°¸à°µà°‚ ను పురస్కరించుకుని శనివారం సీతానగరం పరిధిలోని

 à°µà°¿à°œà°¯ కీలాద్రి ఆలయ సముదాయం లో జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణ లో విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఉపదేశం అత్యంత వైభవంగా జరిగింది. à°ˆ సందర్భంగా జీయర్

స్వామి మాట్లాడుతూ వివిధ వ్యధలతో తపిస్తున్న సర్వ మానవాళి కి ముక్తి లభించాలి అనే సంకల్పంతో మహా భారత యుద్ధం అనంతరం భీష్మ పితామహులు ఈ లోకానికి అందించినదే శ్రీ

విష్ణు సహస్రనామ స్తోత్రం అని తెలిపారు. భారత యుద్ధ అనంతరం అంపశయ్య పై ఉన్న భీష్మునికి బాధరహిత శక్తిని, పూర్వ యధా శక్తిని అందించి శ్రీకృష్ణుడే ఆయనతో మానవ

ధర్మాన్ని పాండవులకు తెలియచేసిన రోజు ఇదే. ఈ సందర్భంగా భీష్ములు తెలియచేసిన మహావిష్ణువు వెయ్యి నామాల రూపమే శ్రీ విష్ణు సహస్రనామం అని తెలిపారు. భీష్ములు ఈ

లోకానికి అందించిన విలువైన సంపదకు గుర్తింపుగా మాఘ శుద్ధ ఏకాదశి à°•à°¿ భీష్మ ఏకాదశిగా ఆచరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. à°—à°¤  25 సంవత్సరాల క్రితం భీష్మ ఏకాదశి

రోజున విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ప్రారంభించామని, నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ పారాయణ చేయడం జరుగుతోందన్నారు.

సుమారు లక్షమంది భక్తులతో విజయవాడ పిడబ్ల్యుడి  à°®à±ˆà°¦à°¾à°¨à°‚ లో 1994 లో మొట్టమొదటి సారిగా అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. తమిళనాడు లోని మద్రాస్ (1996) సుమారు 70 వేల మందితోను,

అదే విధంగా విశాఖ సాగర తీరం లోను, హైద్రాబాద్ గాచి బౌలి మైదానంలోనూ, రాజమహేంద్రవరం లోను, ఈ విష్ణు తరంగాలను అందరికీ ప్రసరింపచేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమం

లో వందలాది భక్తులకు జీయర్ స్వామి విష్ణు సహస్ర నామాన్ని ఉపదేశం చేసారు. అంతకు ముందు పలు విద్యా సంస్థలకు చెందిన చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.

గత వారం రోజులుగా విజయ కీలాద్రి ఆలయ సముదాయం ద్వితీయ బ్రహ్మోత్సవాల సందర్బంగా భీష్మ ఏకాదశి పర్వదినోత్సవం కూడా రావడం గమనార్హం. గత వారం రోజులుగా జీయర్ స్వామి

ప్రత్యక్ష పర్యవేక్షణలో సమాశ్రయణం ( మంత్రోపదేశం), సామూహిక ఉపనయనములు చేపట్టారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #vishnu sahasranamam  #virat  #parayanam  #vijayawada  #vijaya keelaadri  #chinna jeeyar swami  #bheeshma

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam