DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చచ్చే వరకూ చంద్రబాబు కు పాదాక్రాంతులమే : ఎమ్మెల్యే పీలా గోవిందా  

నిలువు నిపాదం నీతిమంతుణ్ణి. . . . అవినీతి రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తా 

తెలుగు దేశాన్ని వీడేది లేదు, వ్యాపారం వేరు, పదవి వేరు.  

విశాఖపట్నం,

 à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 18, 2019 (DNS Online ): చచ్చే వరకూ తెలుగుదేశం పార్టీని వీడేది లేదని, ఆజన్మాంతం  à°¤à°® కుటుంబం చంద్రబాబు కు పాదాక్రాంతులమే నని అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద

సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం నగరం లోని ఓ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ తానూ జీవితం చివర వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని, తన

తండ్రి మహాలక్ష్మి నాయుడు పై గౌరవం తోనే తనకు ఎమ్మెల్యే టికెట్లు చంద్రబాబు ఇచ్చారని, తన సోదరునికి నగర అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు. అయితే కొందరు మీడియా వారి

కుట్రల కారణంగా తాము తెలుగుదేశం పార్టీ వీడుతున్నట్టు అభూత కల్పనలు వెలుగులోకి వచ్చాయన్నారు. కళ్ళు పెట్టి చూసి, వాస్తవాలు వ్రాయాలన్నారు. తన హయాంలో అంతా

అభివృద్దే జరిగిందని తానూ చిన్నతనం నుంచి నీతినిజాయితీలనే నమ్ముకుని పనిచేస్తున్నానని, జీవిత కాలంలో ఎప్పుడైనా అవినీతి కి పాల్పడినట్టు ఎవరైనా రుజువు చేస్తే

తమ కుటుంబం మొత్తం రాజకీయ సన్యాసం తీసుకుంటామని ప్రకటించారు. తుంపాల చెక్కెర కర్మాగారం లో ఎటువంటి అవినీతి జరగలేదని, అక్రమ మైనింగ్ తో తమకు ఎటువంటి సంబంధం

లేదని, అనకాపల్లి అభివృద్ధి చెందింది తన హయాంలోనేనన్నారు. మొట్టమొదటి సారిగా అనకాపల్లి లో జూనియర్ కళాశాల వచ్చింది అంటే  à°®à°‚త్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు చలవేనని,

మొత్తం రోడ్లన్నీ అద్భుతంగా నిర్మించగలిగామంటే మంత్రి అయ్యన్న పాత్రుడు, తన గెలుపుకు ఆడారి తులసీరావు, తన పార్టీ క్యాడర్ ప్రభావమేనన్నారు. రాష్ట్రం లో

జరుగుతున్న అనేక అక్రమాలకూ ఆలవాలం, నెలవు అనకపల్లే నని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయేంటి అని విలేకరులు అడిగిన ప్రశ్నకు తన నియోజకవర్గంలో జరిగే

పనులన్నీ తన అభిమానులూ, పార్టీ క్యాడర్ కోసమేనని, వారికోసం తానూ ఏమి చేయడానికైనా సిద్ధం అంటూ తన నైజాన్ని తనకి తెలియకుండానే బహిర్గతం చేసేసారు. తుంపాల చెక్కర

ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్నప్పటికీ పాత యంత్రాలతోనే తిరిగి తెరిపించడం వెనుక కధేంటి అని అడిగిన ప్రశ్నకు మండిపడ్డారు. తన హయాంలో ఒక్క అవినీతి కూడా జరగలేదని,

అంతా సక్రమమేనని, తానూ అవినీతి పరుణ్ణి అని ఎవరూ నిరూపించలేకపోయారన్నారు. తానూ చంద్రబాబు ఫోటో పెట్టుకునే ఎన్నికల్లో గెలిచానని, తన చివర వరకూ చంద్రబాబు

పాదాక్రాంతుణ్ణేనన్నారు. ఆయన కోసం, లోకేష్ కోసం ఏమి చేయడానికైనా సిద్ధమేనన్నారు. తన ఎదుగుదలకు కారణం చంద్రబాబు, లోకేషే నన్నారు. తానూ ఏమి చేసినా పార్టీ ఎదుగుదల

కోసం, అభిమానుల కోసమేనని అసలు విషయాన్ని బయట పెట్టారు. 

అసెంబ్లీ లోకి రాని ప్రతిపక్షాన్ని చూస్తే ప్రజలు అసహ్యించుంటున్నారని, తాము సిగ్గుతో

తలదించుకుంటున్నామన్నారు. చంద్రబాబు మహిళలు సొంత సోదరులుగా చూస్తుంటే, ప్రతిపక్ష నాయకుడు తన సొంత సోదరిని కించపరుస్తున్నారన్నారు. ఆమెకు కనీసం పార్టీలో ఏ పదవీ

ఇవ్వకుండా ఆమె పట్ల కక్ష సాధింపు చేస్తున్నారన్నారు. ఆమెకు తమ సానుభూతి తెలియచేస్తున్నామన్నారు.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #telugudesam  #anakapalle  #MLA  #Peelaa Govinda Satyanarayana  #Chandrababu naidu  #Lokesh  #andhra pradesh


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam