DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐసిడిఎస్ అంటే కిరాణా సరుకు పంపిణీ సంస్థ కాదు : కమిషనర్ 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 19, 2019 (DNS Online ): మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖా ( ఐసీడీఎస్ ) అంటే కిరాణా సరుకు పంపిణీ చేసే సంస్థ (శాఖ) కాదని, దానికి పౌరసరఫరాల శాఖా ఉందని సంస్థ

కమిషనర్ హనుమంతు అరుణ్ కుమార్ అన్నారు. మంగళవారం నగరం లోని సాగర తీరం లో గల హరిత రిసార్ట్స్ లో జరిగిన విశాఖపట్నం జోన్ 1 విభాగపు సంపూర్ణ సమీక్ష సమావేశం లో అయన

ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ విభాగం పట్ల ప్రజల్లో ఒక ఆశాభావం ఉందని, చిన్నారుల నుంచి మహిళల వరకూ అభ్యున్నతి, ఆరోగ్య, అవసరాలపై

ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని గ్రామ స్థాయిలోని పాఠశాలలకు వెళ్లే వయసు రాని చిన్నారులను సమీప అంగన్వాడీ

కేంద్రాలకు తీసుకురావాల్సిన భాద్యత ఉందని,  à°µà°¾à°°à°¿à°¨à°¿ సంరక్షించవలసి ఉందన్నారు. అదే విధంగా మహిళలకు తగిన సూచనలు అందించాలన్నారు. చాలామందిలో మహిళా శిశు సంక్షేమ

శాఖా అంటే పప్పులు, నూనె, కోడిగ్రుడ్డు పంపిణీ చేసే కేంద్రంగా అభిప్రాయం ఉందన్నారు. అయితే పప్పులు, అప్పులు లాంటి కిరాణా సరుకు పంపిణీ చెయ్యడానికి ప్రత్యేకించి

ఈ శాఖను నడపవలసిన అవసరం లేదని, వాటికోసం రాష్ట్ర పౌర సరఫరాల శాఖా ఉందని, రేషన్ కార్డులపై వీటిని పంపిణీ చేస్తుంటారన్నారు. మన శాఖకు కొన్ని ప్రత్యేక భాద్యతలు

అప్పగించారని, వాటిని కచ్చితంగా నెరవేర్చాలన్నారు. విశాఖ లో జరుగుతున్నా సమీక్ష సమావేశం నాల్గవది, ఇంతకూ ముందు ఇతర జోన్లకు సంబంధించి సమీక్ష సమావేశాలు

నిర్వహించామన్నారు. à°ˆ సమావేశంలో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు à°Žà°‡ రాబర్ట్స్, విశాఖపట్నం ఇంచార్జి ప్రాజెక్ట్ డైరక్టర్ (ఎఫ్ ఏ సి)  à°µà±ˆ. సునంద, విజయనగరం ఇంచార్జి

ప్రాజెక్ట్ డైరక్టర్ (ఎఫ్ ఏ సి) ఎస్. పద్మావతి, శ్రీకాకుళం ఇంచార్జి ప్రాజెక్ట్ డైరక్టర్ (ఎఫ్ ఏ సి) ఎస్ డి . అనిత, ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన సీడీపీఓ లు, గ్రేడ్ 1 ,

గ్రేడ్ 2 సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది, సహాయక సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.   

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra pradesh  #government  #ICDS  #ICPS  #Angan wadi schools  #commssioner #arun kumar  #Regional Joint Director  #AE Roberts  #CDPOs  #Supervisors  #Grade

1  # grade 2

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam