DNS Media | Latest News, Breaking News And Update In Telugu

70 ఏళ్ళ కాంగ్రెస్ ఇవ్వని విశాఖ రైల్వే జోన్ నాలుగేళ్ల మోడీ ఇస్తారు

విశాఖ రైల్వే జోన్ ఇచ్చేది భాజపానే : రాష్ట్ర అధ్యక్షులు కన్నా. 

అధికారం ఉండగా చెయ్యని కాంగ్రెస్ ఓటేస్తే చేస్తుందట ?

విశాఖపట్నం, ఫిబ్రవరి 22, 2019 (DNS Online): విశాఖపట్నం

కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేసేది భారతీయ జనతా పార్టీయేనని రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. శుక్రవారం నగరంలోని న్యూకొలని

లోని రైల్వే మైదానంలో మార్చి 1 న ప్రధాని నరేంద్ర మోడీ సభ ఏర్పాట్లకు నగరానికి వచ్చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పోరాటం

చేస్తున్నప్పడికీ రాష్ట్ర విభజన సమయంలో అధికారం లో ఉన్న కాంగ్రెస్ నాడు కళ్ళుమూసుకు పోయిందని, ఇప్పుడు మళ్ళీ ఓటు వేస్తె జోన్ ఇస్తా అని రాహుల్ ప్రకటించడాన్ని

ఎద్దేవా చేశారు. అధికారం ఉన్ననాడు చెయ్యని వాళ్ళు, మరోసారి అధికారం ఇస్తే భారీ కుంభకోణాలు తప్ప కాంగ్రెస్ చేసేది, జనం చూసేది ఏమీ ఉండదన్నారు. పోలవరం ప్రాజక్ట్

ఆంధ్ర ప్రజలకి బీజేపీ ఇచ్చిన గొప్ప వరం అని, మోడీ అధికారం లోకి వచ్చిన రెండవ రోజే ముంపు గ్రామాలని ఆంధ్రాలో కలిపి పోలవరాన్ని ఆంధ్రాకి వరంగా ఇచ్చారన్నారు. అదే

విధంగా పదేళ్ల సమయం ఉన్నప్పటికీ కేవలం నాలుగున్నరేళ్ల కాలం లోనే విద్య సంస్థలన్నీ ఆంధ్రా కు ఇచ్చేశామన్నారు. కేవలం మూడు హామీలు మాత్రమే ఉన్నాయని, వాటిల్లో

విశాఖ రైల్వే జోన్ తప్పక ఇస్తామని, మరో రెండు నెలల కాలం మోడీ ప్రస్తుత పదవి కాలం ఉందన్నారు. మరో రెండు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి అత్యున్నత కమిటీ సభ్యులు,

ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి విశాఖ రైల్వే జోన్ ఇవ్వవలసిన ఆవశ్యకతను 
మరొక్కసారి తెలియచేస్తామన్నారు.

విశాఖలో జరిగే భారత ప్రధాని నరేంద్ర మోడీ సభ ద్వారా ఆంధ్ర ప్రజలకు భారీ వరాలు లభించనున్నాయన్నారు. ప్రధాని హోదాలో తన భాద్యతలను ఏ విధంగా నిర్వహించారో స్వయంగా

మోడీయే ఆంధ్ర ప్రజలకు వివరిస్తారన్నారు. ఉత్తరాంధ్రా ప్రజల చిరకాల వాంఛ త్వరలోనే నెరవేరనుందన్నారు. 
 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #telugudesam  #kanna lakshminarayana   #narendra modi  #railway grounds  #ew colony 

#public meeting


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam