DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐదేళ్లలోపు చిన్నారులకు వినికిడి లోపం సరిదిద్దవచ్చు: కృష్ణ కిశోరె 

 à°µà°¿à°¨à°¿à°•à°¿à°¡à°¿ శస్త్ర చికిత్స పూర్తిగా ఉచితం. 

విశాఖపట్నం, ఫిబ్రవరి 25, 2019 (DNS Online) : జన్మతః వచ్చే వినికిడి లోపాన్ని ఐదేళ్ల లోపు పిల్లలకు సరైన శాస్త్ర చికిత్స ద్వారా

సరిదిద్ద వచ్చని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు వైద్య ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ టి. కృష్ణ కిశోరె తెలిపారు. సోమవారం పేదవాల్తేరు లో గల ఆసుపత్రి లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ కాక్లియర్ ఇంప్లాంట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ ఆసుపత్రిలో చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక

అవగాహనా కల్పిస్తున్నామన్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు వినికిడి సరిగ్గా లేనట్టయితే సమీపం లోని వైద్యుని వద్దకు తీసుకువెళ్లి

తగిన సలహా తీసుకోవాలన్నారు. అన్ని ఆధునిక సదుపాయాలూ కల్గిన తమ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చినట్టయితే శిశువుకు చేపట్టవలసిన అన్ని కనీస పరీక్షలూ నిర్వహించి,

తదుపరి ప్రభుత్వ కింగ్ జార్జి ఆసుపత్రిలో గుండె సంబంధిత పరీక్షలు చేయించడంతో పాటు, సమీపంలోని మానసిక చికిత్స ఆసుపత్రిలోనూ చిన్నారులను పరిశీలించడం

జరుగుతుందన్నారు. ఈ వైద్య పరీక్షలు కనీసం వారం రోజుల పాటు జరుగుతాయని, ఆ తదుపరి గుంటూరు లోని ఎన్టీఆర్ వైద్య సేవ కార్యాలయానికి ఈ పరీక్షల రిపోర్టులను పంపి, శస్త్ర

చికిత్సలకు అనుమతి పొందడం జరుగుతుందని వివరించారు. అనుమతి లభించిన తర్వాత రెండు గంటల సమయం ఈ వినికిడి ని పొందేందుకు శస్త్రచికిత్స చేసి, ఒక పరికరాన్ని లోపల

అమర్చడం జరుగుతుందన్నారు. ఈ పరికరాలను అమెరికా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా ల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. చికిత్స అనంతరం ఒక ఏడాది సమయం పాటు చిన్నారులను

వైద్య పరిశీలనలో ఉంచుతామన్నారు. వినికిడి లోపాన్ని సరిదిద్దెందుకు చికిత్స అనంతరం చిన్నారులకు వినికిడి అలవాటు చేసేందుకు అత్యాధునిక పరికరాలను గత సంవత్సరం

ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం à°ˆ తరహా చికిత్సలు ఆంధ్ర  à°ªà±à°°à°¦à±‡à°¶à± లో  à°µà°¿à°¶à°¾à°–పట్నం లోని తమ ఆసుపత్రిలోనే జరుగుతున్నాయని తెలిపారు. విశాఖ లో ఇంతవరకూ 47 వరకూ శస్త్ర

చికిత్సలు పూర్తిగా ఉచితంగానూ, ప్రభుత్వ సహకారం తోనూ దిగ్విజయంగా నిర్వహించామని తెలిపారు. గత సంవత్సరం నుంచి విశాఖ ఈ ఎన్ టి ఆసుపత్రిలో దిగ్విజయంగా

చేస్తున్నామని, కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల లో ఈ ఏడాదే ప్రారంభించి, ఒక్క చికిత్స జరిపారన్నారు. ఈ విలేకరుల సమావేశం లో ఆసుపత్రి వైద్యులు

పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #bjp  #ENT  #kishna kishore  #Dr; Government Hospital  #Mental Hospital  #NTR Vaidya Seva  #Central Government

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam