DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిన్న బేటా.  .నేడు డేటా.  . బాబు కి వీడని గ్రిడ్ గ్రహణం ?

డేటా చోరీ పాపం తలో పిడికెడు. . . .


విశాఖపట్నం, మార్చి 05, 2019 (DNS Online) : గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న అంశం డేటా చోరీ. దీనికి ఆది అంతం ఎక్కడ

ఉన్నాయో తెలియదు కానీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మెడకు పూర్తిగా చుట్టుకుంది. దీనికి నిదర్శనమే ఆయన మాట్లాడే  à°ªà±à°°à°¤à°¿ వేదిక మీదా డేటా చోరీ పై

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, తెలంగాణ సీఎం లపై విరుచుకుపడుతున్నారు. అసలు 

బయటకు వెళ్లిన డేటా ఎవరిదీ ?

ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత కీలకమైన ప్రజా సమాచారం చోరీ

చెయ్యబడింది అంటూ అధికార ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న డేటా లో ఉన్న వివరాలు ఏంటి? అది రాష్ట్రంలోని ప్రతిపక్ష సానుభూతిపరులకు సంబంధించిన డేటా అని, దాన్ని

అత్యంత కిరాతకంగా తొలగించేందుకు చేయరాని పనులన్నీ చేయించింది అధికార తెలుగుదేశం పార్టీయేనని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్తనాదాలు చేస్తోంది.

దీనిపై రాష్ట్ర గవర్నర్ నుంచి భారత రాష్ట్రపతి వరకూ అన్ని స్థాయి అధికారుల దృష్టికీ తీసుకువెళ్ళింది. హైద్రాబాద్ కేంద్రంగా టిడిపి కి చెందిన ఒక వ్యక్తి

నిర్వహిస్తున్న ఐటి గ్రిడ్స్ సంస్థ కేంద్రంగా తమ అభిమానులు, క్యాడర్ల ఓట్లు తొలగించడమే అత్యంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆ పార్టీ

నేతలు విమర్శలు చేస్తున్నారు. 
అయితే  à°¦à±€à°¨à°¿à°•à°¿ ధీటుగా అధికార తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకూ à°ˆ డేటా తమ పార్టీ

కార్యకర్తల కోసం తయారు చేసిన సేవా యాప్ కు సంబంధించినదని, తమ వ్యతిరేక పార్టీలు కక్షకట్టి తమపై బురద జల్లే పని చేస్తున్నాయని మండిపడుతున్నారు. 

ఓటు

తొలగించడం అంటే :

భారత పౌరులందరికీ తమ ప్రాంతంలో ఓటు ను వినియోగించుకునే హక్కు ను రాజ్యాంగం కల్పించింది. అయితే భారతీయులు తమ ఓటును సొంతంగా తొలగించుకునే

సందర్భాలు చాలా అరుదు. అలాంటిది ఏకంగా లక్షల్లో ఓట్లు గల్లంతు అయ్యాయి అంటే ఇది ఆలోచించవలసిన అంశం. ఒక వ్యక్తి ఓటు తొలగిపోయే పరిస్థితి ఆ వ్యక్తి భౌతికంగా

జీవించి లేనప్పుడు జరుగుతుంది. మరణ ధ్రువపత్రాన్ని విడుదల చేసినప్పుడు, అతని ఆధార్ కార్డు రుజువుగా, అతని ఓటు ప్రభుత్వం తొలగించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఓట్లు

తొలగించేసారు అంటే సదరు వ్యక్తులు జీవించి లేరు అని. లేదా à°† వ్యక్తికీ వేరే ప్రాంతంలో ఓటు ఉంది అని తెలుస్తోంది. 

ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నట్టు ?

తమ

ప్రమేయం లేకుండానే తమ ఓట్లు తొలగించేసారు అంటూ లక్షలాదిగా ప్రజలు రోడ్లెక్కి గగ్గోలు పెడుతుంటే. . . దీనికి సమాధానం చెప్పవలసిన భారత ఎన్నికల కమిషన్ ఏం

చేస్తున్నట్టు?  à°ˆ విషయం వీళ్ళకి సంబంధం లేనట్టు నిద్ర పోతోందా? ప్రతి వ్యక్తి à°•à°¿ ఓటు అర్హత కల్పించేంది కేవలం భారత ఎన్నికల సంఘం. ఏ వ్యక్తి ఓటు అయినా తొలగించాలి

అంటే సదరు వ్యక్తి సొంతంగా ఇచ్చిన లేఖలు ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఈ ఓట్లు గల్లంతులో ఇన్ని లక్షల మందీ తమ ఓట్లు రద్దు చెయ్యమని ఎన్నికల కమిషన్ కి దరఖాస్తు

చేసుకున్నారా ? అసలు ఏ బూత్ లో ఎన్ని ఓట్లు తొలగించారో ఎన్నికల కమిషన్ కి అయినా తెలుసా? అసలు కమిషన్ అనుమతి లేకుండా ఓట్లు తొలగించే అధికారం ఇంకెవరికి

ఉంటుంది?

ప్రచార సర్వేలో నో నొక్కితే వేటు ?: వైకాపా

ఇటీవల కాలంలో ప్రచారం పిచ్చి బాగా ముదిరిపోయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్లాది రూపాయలు వెచ్చించి

ప్రజా సాధికారిత సర్వే అని ఒక పనికిమాలిన నివేదికను చేపట్టారని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. దీని ఆధారంగా రాష్ట్రంలో జరుగుతున్న

పథకాలపై ప్రతి మనిషి కి రోజుకు ఓ ఐదారుసార్లు ఈ సర్వే కాల్ సెంటర్ నుంచి ఫోన్లు వస్తుంటాయని, చంద్రబాబు పనితీరు నచ్చితే 1 నొక్కండి, లేదా 2 నొక్కండి అని వస్తుందని,

పొరబాటున ఎవరైనా 2 నొక్కారంటే, వాళ్ళ ఓటు గల్లంతు అవుతోందని వైకాపా నేతలు మండిపోతున్నారు. దీనికి ప్రధాన నిదర్శనం తూర్పు గోదావరి జిల్లా లోని ఒక అసెంబ్లీ

నియోజకవర్గం లో ఒక్కో బూత్ లోనూ ఇలా ఓట్లు గల్లంతు అయినా విధానం ఇదే నని à°’à°• అధికారి ( పేరుచెప్పడం ఇష్టం లేని వారు) తెలియచేయడం గమనార్హం.  

 

photo courtesy : whom so ever it may concern

#dns   #dns live  #dns

media   #dns news   #dnslive  #dnsmedia   #dnsnews  #vizag   #viswanadha raju  #visakhapatnam  #bjp  #IT grids   #chandrababu naidu  #YS Jagan Mohan  #voters   #election commission

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam