DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సైన్యం పై కారుకూతలు కూసే సిద్దు, డిగ్గీ లకు దేశ బహిష్కరణ చెయ్యాలి : ఎమ్మెల్సీ మాధవ్ 


విశాఖపట్నం, మార్చి 06, 2019 (DNS Online) : భారత దేశ సైన్యం పై కారుకూతలు కూసే పంజాబ్ మంత్రి నవజ్యోత్ సిద్దు, మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ లను తక్షణం దేశ బహిష్కర చెయ్యాలని

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కేంద్రానికి సూచించారు. బుధవారం నగర బీజేపీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ దేశ భక్తి

బ్రాండ్ అంబాసిడర్లు గా దేశ ప్రజలని గత 90 ఏళ్లుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బట్టబయలు అయ్యిందన్నారు. కాంగ్రెస్ లోని వాళ్లంతా ఉగ్ర ప్రేరేపిత

దేశమైన పాకిస్తాన్ కు మద్దతుగా ప్రకటనలు చెయ్యడమే కాకుండా ఇటీవల పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులను కించపరుస్తూ సిద్దు,

దిగ్విజయ్ వ్యాఖ్యానించడం క్షమించరాని నేరమన్నారు. ఈ దాడుల్లో ప్రభుత్వం చెప్తున్నట్టు 330 మంది ఉగ్రవాదులు మరణిస్తే వారి మృత శరీరాలు చూపించాలి అంటూ కాంగ్రెస్

సహా ఇతర పాకిస్తాన్ మద్దతు భారత రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలపై అంతా మండిపడుతున్నారు. à°ˆ క్రమం లోనే భారత వైమానిక దళం ఉగ్ర శిబిరాలపై  à°¬à°¾à°‚బులు వేసారా లేక అక్కడ

చెట్లు పీకడానికి వెళ్ళారా అని మంత్రి గా ఉన్న సిద్దు చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయన్నారు. అదే విధంగా కాశ్మీర్ లో భారత సీఆర్పీఎఫ్

బలగాలపై పుల్వామా పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడులను కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఒక ప్రమాదంగా ప్రకటించడాన్ని భారత ప్రజలు మండిపడుతున్నారు. ఈ దాడుల్లో 40

మంది రక్షణ బలగాలు అమరులైన విషయం తెలిసిందే. తక్షణం ఈ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ భారత ప్రజలకు బేషరతు క్షమాపణ చెప్పాలని, వీరిద్దరినీ

పార్టీనుంచి బహిష్కరించాలి డిమాండ్ చేశారు. 

 

#dns  #dns live  #dns media  #dns news   #dnslive   #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #MLC  #PVN Madhav  #Nagendra  #Telugudesam  #Narendra Modi  #Railway Zone  #IT grids  #chandrababu naidu  #hyderabad  #election  #votes

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam