DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాల్తేర్ డివిజన్ పునస్సమీక్ష జరుగుతుంది: DNS తో  ఎమ్మెల్సీ మాధవ్ 

పూర్తిస్థాయి జోన్ ఏర్పాటు కు రెండుళ్లు పడుతుంది

విశాఖపట్నం, మార్చి 06, 2019 (డి ఎన్ఎస్): విశాఖపట్నం కేంద్రం గా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో అత్యంత

ప్రతిష్టాత్మకమైన వాల్తేర్ డివిజన్ పై పునః సమీక్ష జరుగుతుందని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తెలిపారు. నూతనంగా ఏర్పడిన రైల్వే జోన్ పై అన్ని

వర్గాల్లోనూ ఎన్నో సందేహాలు ఉన్నాయని, దీంతో అధికార తెలుగుదేశం బీజేపీ పార్టీని అప్రదిష్టపాలు చేసేందుకు విపరీత వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళనలు

రేకేత్తిస్తోందన్నారు. ఒరిస్సా కు ఇబ్బంది కలుగకుండా ఆంధ్ర ప్రాంతంలోని రైల్వే లైన్లను విజయవాడ జోన్ కు కలుపుతూ ప్రస్తుతం దక్షిణ కోస్త రైల్వే జోన్ ను

ప్రకటించారన్నారు. తదుపరి అంతర్గతం గా జోన్ లో లైన్లను సమీక్షిస్తూ వాల్తేర్ డివిజన్ ను పునః సమీక్ష చేయడం జరుగుతుందన్నారు. ఒక రైల్వే డివిజన్ ఉండాలి అంటే కనీసం

300 కిలో మీటర్ల లైన్లు ఉండాలన్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతం లో ఉన్న రైల్వే లైన్లు ఈ పరిధి కంటే తక్కువగా ఉన్నందున ఈ విభాజిత డివిజన్ ను ప్రస్తుతం విజయవాడ

డివిజన్ లో కలపడం జరిగిందన్నారు. తదుపరి పూర్తిస్థాయి పనితీరు సమయంలో విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం, పార్వతీపురం లైను, కిరండూల్ లైను, రాయగడ లని లతో పాటు,

విశాఖపట్నం నుంచి స్టీల్ ప్లాంట్ లైను, విశాఖపట్నం పోర్ట్ లైను తదితర అన్ని విభాగాల కు గల రైల్వే లైన్లను కలిపి ప్రత్యేక డివిజన్ ను విశాఖ ప్రాంతంలో ఏర్పాటు

కానుందన్నారు. దీనిపై ఆర్ధికంగా ఉన్న వెసులుబాటు కూడా దక్షిణ కోస్త రైల్వే జోన్ కు కలిసి వస్తుందన్నారు. 

40 ఏళ్ళ కాలంలో బాబు కి చేతకాలేదు :

40 ఏళ్ళ కాలం

పాటు కేంద్రం లో చక్రం తిప్పానని ప్రగల్బాలు పలికే చంద్రబాబు నాయుడు ఈ జోన్ ఏర్పాటు లో చేసింది ఏంటి అని ప్రశ్నించారు. గతం లో ఎన్డీఏ అధికారం లో ఉన్ననాడు

తెలుగుదేశం పార్టీ కి చెందిన కె. ఎర్రన్నాయుడు పార్లమెంటరీ రైల్వే కమిటీ కి చైర్మన్ గా ఉండగా విశాఖ పట్నం కేంద్రంగా రైల్వే జోన్ సాధించుకోడం చేతగాలేదు కానీ,

ఇప్పుడు బీజేపీ జోన్ ఇస్తే నోటికి వచ్చిన ప్రేలాపనలు టిడిపి వర్గాలు చెప్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే ప్రతి పధకానికి చంద్రబాబు తన తోక

తగిలించుకుంటున్నదన్నారు. ఇప్పుడు రాష్ట్రం లో అమలవుతున్న ప్రతి పధకం కేంద్రం ఇచ్చినదేనన్నారు. అయితే ప్రధాని ఫోటోలను కూడా తొలగించి చంద్రబాబు తన ఫోటో

వేసుకుని జనాన్ని మోసం చేస్తున్నదన్నారు. అతని స్వార్ధ పూర్తి కుటిల బుద్ధికి చివరి రోజులు వచేశాయన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #government  #india  #prime minister  #narendra modi  #andhra

pradesh  #kanna lakshminarayana  #Haribabu  #MP  #MLA  #MLC 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam