DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈఎస్ఐ ఆసుపత్రి డిమాండ్ తో 12 న భారీ ర్యాలీ:సిఐటియు

విశాఖపట్నం, మార్చి 07, 2019 (à°¡à°¿ ఎన్ఎస్): కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర కార్మికులకు ప్రకటించిన  500 పడకల ఈఎస్ ఐ ఆసుపత్రిని తక్షణం నిర్మించాలని సిఐటియు నగర కమిటీ డిమాండ్

చేసింది. గురువారం నగరం లోని గురుద్వారా వద్ద గల ఈ ఎస్ ఐ ఆసుపత్రి డిస్పెన్సరీ ఎదురు భారీ నిరసనలు చేసారు. ఈ సందర్బంగా నగర కన్వీనర్ ఆర్ కె ఎస్ వి కుమార్ మాట్లాడుతూ

గత మూడేళ్ళుగా ఇక్కడ ఆసుపత్రి నిర్మిస్తామని లక్షలాది మంది కార్మికులను మభ్యపెడుతున్నారన్నారు. గతంలో కేంద్ర కార్మికశాఖ సహాయ మంత్రి హోదాలో బండారు

దత్తాత్రేయ షీలానగర్ లో 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసారని అయితే అది అక్కడే ఆగిపోయిందన్నారు. వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల సంస్థల్లో విధులు

నిర్వహిస్తున్న లక్షలాది మంది కార్మికులకు అత్యాధునిక వైద్య సదుపాయం అందకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఇటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, అటు

కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్య వైఖరిని చూపడం వల్లనే ఇది ఆదిలోనే నిలిచిపోయిందన్నారు. దీనికి నిరసనగా ఈ 12 న విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి గ్రేటర్

విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జివిఎంసి) ఎదురుగ గల గాంధీ విగ్రహం వరకూ వందలాదిగా కార్మికులతో భారీ ర్యాలీ చేపట్టనున్నామన్నారు. కోట్లాదిగా నిధులు ఈ ఎస్ ఐ

బోర్డు వద్ద మురిగిపోతున్నాయని, ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం లో ఉన్న తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీకి ప్రజలు, కార్మికులు

అంటే పూర్తి హ్యేయ భావం ఉన్నందునే ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదన్నారు. వీళ్ళ పార్టీ కార్యాలయాలు కట్టుకోడానికి కోట్లాది గా నిధులు ఖర్చు

చేస్తారని మండిపడ్డారు. 

 

#dns  #dns live  #dns media  #dnslive  #dns news  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #CITU  #ESI hospital  #sheelanagar  #Trade unions  #State Government  #Indian Government  #Labour Minister #Bandaru Dattatreya
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam