DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి : ఐద్వా 

విశాఖపట్నం, మార్చి 07, 2019 (à°¡à°¿ ఎన్ఎస్): ఎంతోకాలంగా అపరిష్కృతంగా à°—à°¾ ఉన్న  à°šà°Ÿà±à°Ÿà°¸à°­à°²à±à°²à±‹ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను తక్షణం అమలు లోకి తీసుకురావాలని à°…à°–à°¿à°² భారత

ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నగర ఉపాధ్యక్షురాలు ఆర్. ఎన్. మాధవి డిమాండ్ చేసారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం లో భాగంగా గురువారం నగరం లోని ద్వారకా బస్సు

కాంప్లెక్ కూడలి వద్ద గల గురుజాడ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), శ్రామిక మహిళా సమన్వయ కమిటీ- సిఐటియు, ఐక్య ఉపాధ్యాయ

ఫెడరేషన్ (యుటిఎఫ్) ఆధ్వర్యంలో నినాదాలు చేసారు. ఈ సందర్బంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని గతంలో రాజ్యసభలో 108

రాజ్యాంగ సవరణ చేసినప్పటికీ అది నేటికీ చట్ట రూపం దాల్చలేదు. మన భారత పార్లమెంట్ లో 11.28 శాతం మహిళలు, మన ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో శాతం మాత్రమే మహిళలు ప్రాతినిధ్యం

వహిస్తూ ఉండటం దురదృష్టకరం . చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. మరో ప్రక్క ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు రోజురోజుకీ

పెరిగి ఇటీవల కాలంలో 17 శాతం మద్యం పైన ఆదాయం పెరిగిందని చెప్పి సంబంధిత అధికారులు వెల్లడించడం అంటే ప్రజల అనారోగ్యం కుటుంబాల విచ్ఛిన్నత పెరుగుతుందని దాని

అర్థం. ప్రభుత్వాలు మద్యం నియంత్రణ కి పూనుకోవాలని, ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మద్యాన్ని పంపకం అదుపు చేయాలని, ఎన్నికల మ్యానిఫెస్టో లో మహిళా అంశాలు

పొందుపరచాలని అన్నారు. మహిళలపై హింస రోజురోజుకీ పెరిగిపోతోంది మహిళలపై హింస అరికట్టడంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా బిజెపి పాలిత

రాష్ట్రాల్లో మహిళలపై వేధింపులు అధికంగా ఉన్నాయని అన్నారు. మహిళలపై వేధింపులు అరికట్టడంలో ప్రభుత్వాలు ఫలం అయ్యాయి అని  à°…న్నారు. à°ˆ కార్యక్రమంలో నగర కమిటీ

 à°…ధ్యక్షులు వై సత్యవతి, సంతోషం, బొట్ట ఈశ్వరమ్మ, సూర్య మణి, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live   #dns media   #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #AIDWA  #BJP  #TDP  #parliament  #assembly

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam