DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు లో తొలి అడుగు. . ఓఎస్ డి నియామకం 

విశాఖ రైల్వే జోన్ ఓఎస్ à°¡à°¿ à°—à°¾ ఎస్ ఎస్  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± నియామకం 

విశాఖపట్నం, మార్చి 08, 2019 (డి ఎన్ఎస్): దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర వాసులు ఎదురు చూస్తున్న విశాఖ పట్నం

కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కు ప్రత్యేక అధికారి ( ఓ ఎస్ డి ) గా సీనియర్ రైల్వే అధికారి ఎస్ ఎస్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు భారతీయ రైల్వే శాఖా విడుదల

చేసిన ప్రకటనలో దక్షిణ మధ్య రైల్వే లో చీఫ్ పర్సనల్ అధికారి (అడ్మిన్) గా విధులు నిర్వహిస్తున్న ఎస్ ఎస్ శ్రీనివాస్ ను కొత్తగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే

జోన్ కు à°“ ఎస్ à°¡à°¿ à°—à°¾ నియమిస్తున్నట్టు తెలిపింది. 
కొత్త జోన్ ఏర్పాటు కై తగిన ప్రణాళిక, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, భవన నిర్మాణానికై తగిన స్థల సమాచార

సేకరణ, పూర్తిస్థాయి ప్రాజెక్ట్ నివేదిక, పూర్తి స్థాయి జోన్ ఏర్పాటుకు సంబంధించి సిబ్బంది సద్దుబాటు తదితర వివరాలతో కూడిన బ్లు ప్రింట్ ల తయారీలో ఈయన ప్రధాన

భూమిక వహించనున్నారు. ఈ జోన్ ఏర్పాటు లో సానుకూల నిర్ణయాలు తీసుకునేందుకు తగిన సూచనలు సైతం స్వీకరించనున్నారు. ఇప్పడికే వాల్తేర్ డివిజన్ ను చీల్చడం పై

ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన భాద్యత కూడా ఈయనపై ఉండవచ్చు. 

 

#dns  #dns live  #dns media  #dns news   #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #railway zone  #south coast railway zone 

#waltair division  #piyush goyal  #odissa


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam