DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ పాతచింతకాయలకు రాలే పళ్ళు  తినేవా ? ఊడేవా ? 

సబ్బం హరి, కొణతాల, లగడపాటి, దాడిలతో ఓట్లు పడేనా ? 

విశాఖపట్నం, మార్చి 09, 2019 (డిఎన్ఎస్) :  à°†à°‚ధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు, తార్ మార్ తక్కడ మార్ లు బాగానే

జరుగుతున్నాయి. ఎన్నికల వేడి తాకడంతో ఏళ్ళ తరబడి నిద్రపోతున్న వృద్ధనేతలు కూడా జవసత్వాలు కూడదీసుకు మరీ నిలబడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమం లోనే

యువరక్తంతో కూడుకున్న అన్ని రాజకీయ పార్టీల్లోనూ వీళ్ళ రాక మందిని పెంచుతుందే తప్ప, సీట్లు మాత్రం పెంచవు అన్నది అందరూ అంతర్గతంగా అనుకునేదే. ఈ క్రమం లోనే

పార్టీ అధిష్టానం వేసుకునే లెక్కలను బురిడీ కొట్టించి మరీ యువ నేతలు, కాబోయే తాజా మాజీలు అటు నుంచి ఇటు కప్పలు  à°—ెంతినట్టు గెంతుతున్నారు. 

గతంలో తమ రాజకీయ

చతురతతో అంత పొడిచాం . . ఇంత పొడిచాం అని సొంత డచ్చ్చాలు కొట్టుకునే నేతల్లో చాలామంది ఇంట్లో పడక్కుర్చీలకే పరిమితిపై పోగా కొందరు మాత్రం యువత మాకు పోటీయా అంటూ

ముందుకు ఉరుకుతున్నారు. ప్రస్తుతం ప్రజలలో తిరుగుతూ అడగడదపా వాళ్ళని పలకరిస్తూ ఉండే ప్రస్తుత నేతలకే ఎంత కష్టపడినా నాలుగు ఓట్లు రాలడం లేదు అన్నది వాస్తవం.

అలాంటిది ఎప్పుడో దేశాన్ని ఉద్ధరించాం . . . ఇప్పుడు ఓట్లు వెయ్యండి అంటే ఫలితం ఉంటుందా అంటే గ్యారంటీ లేదు. 

వీరిలో ఐదేళ్ల క్రితం పదవి కోల్పోయిన సబ్బం హరి,

లగడపాటి లాంటి వాళ్ళు, ఎప్పుడో దశాబ్దాల క్రితం పదవి కోల్పోయిన కొణతాల, దాడి లాంటి వాళ్ళు కూడా తామింకా బరిలోనే ఉన్నామంటూ, ఇంతకూ ముందే బయటకు తోసేసిన అదే రాజకీయ

పార్టీల్లోకి మళ్ళీ చేరిపోతున్నారు. వీళ్ళ రాక ఏంటో . . వీళ్ళ టాలెంట్ ఏంటో .. . వీళ్ళను అసలు గుర్తించే ఓటర్లు (నేటి యువ తరం వారికి . .  à°ˆ వృద్ధ నేతలు ఎవరో కూడా తెలియని

స్థితి) ఉన్నారో  à°²à±‡à°°à±‹ కూడా సందిగ్ద పరిస్థితులు నెలకొన్నాయి.  

పైగా వీరిలో ముగ్గురికి అనకాపల్లి రాజకీయాలతో బాగా అనుభవం ఉంది. సబ్బం హరి, విశాఖ మాజీ మేయర్

గా పని చేసి, తదుపరి అనకాపల్లి ఎంపీ గా ఎన్నికయ్యారు ( ఇది ఐదేళ్ల క్రితం), దాడి వీరభద్ర రావు, ఈయన కూడా అనకాపల్లి నుంచే శాసన సభకు ఎన్నికై మంత్రి కూడా పనిచేశారు ( ఇది

కూడా గతమే), ఇక కొణతాల రామకృష్ణ ఈయన అనకాపల్లి ఎంపీగా ( సబ్బం హరి కంటే ముందు ఐదేళ్లు) పనిచేశారు. గత ఐదేళ్ల కాలం లో వీళ్ళని టీవీల్లో చూసిన వాళ్ళే అతి కొద్దీ మంది

ఉంటారు. ఇక నేరుగా చూసిన జనం అనకాపల్లి లోనే చాలా తక్కువమంది ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. ఇక నాల్గవ వారు లగడపాటి రాజగోపాల్ అనే కంటే పెప్పర్ గోపాల్ అంటే

అందరికీ బాగా తెలుస్తుంది. ఈయన విజయవాడ ఎంపీగా (ఐదేళ్ల క్రితం) ఎన్నికయ్యారు. అక్కడి వారే ఈయన్ని మరిచిపోయారు, ఇక ఆంధ్ర ప్రదేశ్ లో గుర్తించే జనం ఎంతమంది ఉంటారో ?

వీళ్ళ కోసం కొందరి వదులు కోడానికిసైతం పార్టీలు సిద్దపడ్డాయి అంటే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అని ఆశించి ఉంటాయి. అలాకాక, వీళ్ళ వల్ల ఇప్పటివరకు పడతాయి అనుకున్న

ఓట్లు కూడా తుడిచిపెట్టుకు పొతే . . . . 

నాటి రాజకీయాల్లో వీళ్ళు చక్రాలు, బొంగరాలు త్రిప్పి ఉండవచ్చు, అయితే ఆ బొంగరాలు ఇప్పుడు ఎంతవరకూ ఉపయోగపడతాయో వీళ్ళను

పార్టీల్లోకి చేర్చుకుంటున్న అధిష్ఠానాలకే తెలియాల్సి యుంది. దాదాపుగా జనమే మరిచిపోయిన పాతచింతకాయ పచ్చళ్ళను బరిలో నిలబెడితే రాలేది పరువు కు వచ్చిన  à°ªà°³à±à°³à°¾

లేక ఎప్పుడో ఊడిపోయిన పళ్ళా అనేది తేలాల్సియుంది.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #telugudesam  #ysr congress  #Konathala ramakrishna  #sabbam hari  #daadi veerabhadra rao  #lagadapati rajagopal  #chandrababu naidu  #YS jagan mohan reddy


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam