DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మళ్ళీ గెలిపించు గోవిందా. .: వెంకటాద్రి చెంత ఎమ్మెల్యే గోవిందా

వేంకటాద్రి ఆలయంలో పీలా గోవింద ప్రత్యేక పూజలు 

విశాఖపట్నం, మార్చి 10, 2019 (డిఎన్ఎస్) :  à°¤à±à°µà°°à°²à±‹ జరుగనున్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి తనని

ఎమ్మెల్యే గా గెలిపించాలని అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద వెంకటాద్రి నాధుణ్ని వేడుకున్నారు. ఆదివారం విశాఖ శివారు ప్రాంతమైన పెందుర్తి వేంకటాద్రి కొండపై

వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామీ ఆలయంలో అయన ప్రత్యేక పూజలు జరిపారు. ప్రస్తుతం ఎన్నికల వేడి రాష్ట్రవ్యాప్తంగా తారాస్థాయి లో ఉండడం తో  à°¸à±à°µà°¾à°®à±€ అనుగ్రహం

లభించాలని కోరుతూ గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. దీనిలో భాగంగానే ఆదివారం ఆయన వేంకటాద్రి ఆలయానికి విచ్చేసారు. ఇటీవలే అధికార తెలుగుదేశం పార్టీ అధినేత,

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లా లో పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులలో అనకాపల్లి నుంచి మరోసారి పీలా గోవింద సత్యనారాయణ పోటీ

చేయనున్నారు. 

సంప్రదాయ అలవాట్లు కొనసాగింపు అత్యద్భుతం :

ఇదే ఆలయ ప్రాంగణంలో భగవద్రామానుజ శ్రీవైష్ణవ సంక్షేమ సంఘం ఆధ్వర్యవంలో మహిళలకు ముగ్గుల

పోటీలు నిర్వహిస్తుండడం తో వారిని అభినందించారు. వీరు చేస్తున్న సేవ కార్యక్రమాలను అడిగి తెలుసుకుని హైందవ సత్సంప్రదాయాన్ని భావితరాలకు అందించే విధంగా

ముగ్గుల పోటీలు, వస్త్రధారణ, బాష, ఆరాధనలు తదితర అంశాలను పెద్దల ద్వారా తెలియచేయడం అభినందనీయమన్నారు. ఇదే రోజు ఆయన వివాహ వార్షికోత్సవం కూడా కావడం గమనార్హం. ఈ

సందర్బంగా వైష్ణవ సంఘం పెద్దలు పీలా గోవింద్ దంపతులను ఆశీర్వదించారు. 

నిబంధనలు దాటకూడదు :
అనకాపల్లి ఎమ్మెల్యే గానే కాకుండా, ఆలయ అభివృద్ధి కమిటీ తనవంతు

సహకారం అందిస్తూ. . . ఇదే ఆలయంలోని కల్యాణ మండపాన్ని ఆయన తన సొంత నిధులతో నిర్మించారు. ఆయన పట్ల ఉన్న గౌరవంతో ఆలయ అర్చక సిబ్బంది ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే కు పూర్ణ

కుంభ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేయగా, ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇటువంటి సంప్రదాయాలు పాటించవద్దు అని తిరస్కరించారు. అనంతరం ఆలయం

చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామీ దర్శనం చేసుకున్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #telugudesam  #MLA   #Anakapalle  #Peela Govind  #Venkatadri  #venkateswara swamy temple  #pendurty


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam