DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పార్టీకి ఫస్ట్ ఏయిడే కాదు చికిత్స కూడా చేస్తాం : టిడిపి కు ముస్లింల అల్టిమేటం,

ఇది ప్రాధమిక చికిత్సే . . శస్త్ర చికిత్స కూడా చేస్తాం.

విశాఖపట్నం, మార్చి 11, 2019 (డిఎన్ఎస్) : దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని ఉన్న ముస్లిం నేతలను విస్మరించిన

తెలుగుదేశం పార్టీకి అల్టిమేటం జార్టీ చేశారు. సోమవారం నగరం లోని బుధుల్ పార్క్ హోటల్ లో జరిగిన విలేకరుల సమావేశం లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ రహమాన్

మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న ముస్లిం నేతలకు రాష్ట్రం లో ఎక్కడ ఎమ్మెల్యే టికెట్లు ఇంతవరకూ ప్రకటించలేదన్నారు. ఇది పార్టీ పై వ్యతిరేకత

కాదంటూనే అధినేతకు అల్టిమేటం జరీ చేశారు. ఎందరో అనుభవజ్ఞులు ఉండగా విశాఖ దక్షిణం నుంచి ఒక అసాంఘిక కార్యాచరణ చేసే అనుచరగణం కల్గిన వ్యక్తికీ పార్టీ టికెట్

కేటాయించినట్టు ప్రకటనలు విడుదల కావడం ద్వారా ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఏ విధమైన సంకేతాలు ఇస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 శతం ఓటు బ్యాంకు ఉన్న ముస్లిం

సామాజిక వర్గానికి నారా హమారా సభ ద్వారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో బీజేపీ కి కేటాయించిన సీట్లు ఇప్పుడు

ఖాళీగానే ఉన్నాయని, వాటిని ఆయా స్థానిక ముస్లిం నేతలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉత్తరం లో అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదని, అదే విధంగా మిగిలిన

జిల్లాలో కూడా సుమారు 60 సీట్లలో అభ్యర్థులను వెల్లడించవచ్చన్నారు. 
నగర సీనియర్ నేత, నగర మాజీ అధ్యక్షుడు డాక్టర్ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ పార్టీ పట్ల విధేయతతో

ఉండడమే తాము చేసిన తప్పిదంగా కనపడుతోందన్నారు. నాటి ఎన్ టీ రామారావు నుంచి తాము పార్టీనే నమ్ముకుని ఉన్నందుకు తగిన ప్రతిఫలం చంద్రబాబు చూపించారన్నారు. అయితే తమ

సామాజిక వర్గానికి అన్యాయం చేస్తే పార్టీ అభ్యర్థుల విజయానికి సహకరించేది లేదని తేల్చేశారు. రెహమాన్ లాంటి సీనియర్లను ప్రక్కనబెట్టి కేవలం కుల రాజకీయాలు

చేసే వ్యక్తులను టికెట్లు ఇస్తే పార్టీ క్యాడర్ తో పాటు, ప్రజలు కూడా ఘాటుగానే విమర్శిస్తున్నారన్నారు. కోట్లాదిగా సొంత నిధులు ఖర్చు చేసి పార్టీ అభివృద్ధికి

పాటుపడిన వారు తమ సామాజిక వర్గం లో చాలా మందే ఉన్నారన్నారు. తాము వైద్య వృత్తిలో ఉన్నామని, ఈ అల్టిమేటం పార్టీ అధిష్టానానికి ఒక ప్రాధమిక చికిత్స లాంటిదేనని, తమకు

అన్యాయం జరిగితే ఆపరేషన్ (శస్త్ర చికిత్స) కూ వెనుకాడబోమన్నారు. ఈ విలేకరుల సమావేశం లో విజయవాడకు చెందిన పార్టీ సీనియర్ నేత, రాజకీయ విశ్లేషకులు రఫీ, తదితరులు

పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #bjp  #vizag  #visakhapatnam  #ganta srinivasa rao  #telugudesam  #chandrababu naidu  #vaasupalli ganesh  #muslims  #SA rahman  #Zaheer ahmad  #rafi

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam