DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవం అస్తి. . ప్రచారం నాస్తి . . ఇదే సింహగిరి యాగం. 

అర్చకులు సూపర్ హిట్టు - అధికారులు అట్టర్ ఫ్లాపు 

దేవస్థానానికి మీడియా అవసరం లేదా ? 

ఆలయ ప్రచార సిబ్బంది అంతా  à°•à±‚పస్థ మండూకాలేనా ? 

ఆహ్వానం

లేక కానరాని మీడియా - 

గోప్యంగా చేసే యాగం ఎవరికోసం ?

అంతా కూపస్థ మండూక వ్యవహారమే.  . . 

హుండీ లు పెట్టారు - జనాన్ని పిలవడం మరిచారు. 

ఈఓ

నిర్వాకంతో బయటకు విస్తరించని వైభవం 

విశాఖపట్నం , మార్చి 16, 2019 (DNS Online): విశాఖ నగర ప్రాంతంలోని సింహాచల క్షేత్ర గోశాల లో గత ఐదు రోజులు జరుగుతున్న శ్రీ సుదర్శన

నృసింహ యాగం లో  à°ªà±à°°à°¹à±à°²à°¾à°¦ వరద సింహగిరి నారసింహుని వైభవం ప్రజ్వలింప చేస్తున్న వైదిక బృందానికి అభినందనలు వ్యక్తమవుతున్నాయి. వీరు అత్యద్భుతంగా చేస్తున్న

యాగాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో ఆలయ అధికారారులు అట్టర్ ఫ్లాప్ కొట్టారు. వీరి రికార్డును వీరే తిరగరాసినట్టుగా ఉంది. సింహాచల దేవస్థానంలో జరిగే ఏ

కార్యక్రమమైనా బాహ్య ప్రపంచానికి తెలియచేయడం లో ఆలయ ప్రచార విభాగం ( మీడియా రిలేషన్స్) ఘోరంగా వైఫల్యం చెందింది. కేవలం కూపస్థ మండూకాల్లో ఉండే ఈ విభాగం

నిర్వాకం వలన వైదిక బృందాలు చేస్తున్న కృషి ప్రజలకు చేరడం లేదు. భారీ à°—à°¾ హుండీ లు పెట్టారు, అందులో మొక్కుబడులు వేయాల్సిన భక్తులను మాత్రం పిలవలేదు. 

శ్రీ

పాంచరాత్రాగమ విధానంలో జరుగుతున్న ఈ వైభవాన్ని ప్రత్యక్షంగా చూడడానికి జనమే కరువయ్యారు. అత్యంత వైభవంగా 32 హోమ కుండలతో జరుగుతున్న ఈ యాగం పూర్తిగా శ్రీ సింహాచల

దేవస్థానమే నిర్వహిస్తోంది. ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న యాగం గురించి విశాఖ నగరం లోని వారికే కాదు సింహగిరి ప్రక్కనే ఉన్న అడవివరం లోని జనానికి కూడా

తెలియలేదు అంటే à°ˆ తప్పిదం ఎవరిదీ? లోక కల్యాణార్థం సంకల్పిత అంటూ అర్చకులు నిత్యం ఆరాధనలో ప్రకటిస్తుంటే . . . అర్చకులు కూడా నిజమే అనుకుంటున్నట్టు ఉంది. 
లోకం

కోసం చేసే à°ˆ యాగం గురించిన వివరాలు అదే లోకానికి కూడా తెలియకుండా చెయ్యడం ఆలయ అధికారుల తీరుకు అడ్డం పడుతోంది. 

యాగ ప్రచారం అంతా గోప్యమే.  . .

లక్షలాది ముడుపులు, విరాళాలను వెచ్చించి నిర్వహిస్తున్న ఈ యాగ నిర్వహణ విశేషాలను ప్రజలకు చేరవేయడంలో ఆలయ ప్రచార విభాగం ( మీడియా రిలేషన్స్ ) అట్టర్ ఫ్లాప్

కొట్టింది. కనీసం ప్రక్క గ్రామం లో ఉన్న వారికి కూడా à°ˆ యాగం గురించి తెలియడం లేదంటే వీళ్ళ నిర్లక్ష్య వైఖరి బయట పడుతోంది. 
కూపస్థ మండూకం ( నూతిలో కప్ప ) లా ఉండే ఈ

విభాగం లో ఒక తాత్కాలిక ( కాంట్రాక్ట్ ) సిబ్బంది తో నడిపిస్తున్నారు. ఈయన పురాతన కాలంలో మీడియా లో ఉన్నట్టు గా వినికిడి. పెద్దగా బాహ్య ప్రపంచంతో సంబంధం లేని

వ్యక్తులతో à°ˆ మీడియా విభాగాన్ని నిర్వహిస్తే ఇలాగే అట్టర్ ఫ్లాప్ కొడుతోంది.  à°†à°‚ధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర స్థాయిలో అక్రిడేషన్ ఉన్నవారినే

సింహగిరి పై రిపోర్టింగ్ కు అనుమతించమని ఈ విభాగానికి ఆలయ ఈఓ హుకుం జరీ చేసారంటూ ఈ అనధికారిక పీఆరో ప్రకటించడం గమనార్హం. అంటే ఈ ఆలయం లో జరిగే ఏ కార్యక్రమమైనా

కవరేజి à°•à°¿ స్టేట్ అక్రిడేషన్ వారు మాత్రమే రావాలని ఆదేశాలు ఉన్నాయిట. వాస్తవంగా ఇదే ఆదేశాలు ఈఓ ఇచ్చి ఉంటె . .  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ విలేకరులుగా చెప్పబడుతున్న వారిలో

ఎంతమందికి  à°¸à±à°Ÿà±‡à°Ÿà± అక్రిడేషన్ లు ఉన్నాయో ఆలయం ఈఓ అధికారికంగా ప్రకటిస్తే అద్భుతంగా ఉంటుంది. ఆలయంలో జరిగే అపచారాలు, దోషాలను మిగిలిన వారైతే నిష్పక్ష పాతంగా

ప్రకటించడం జారుతుందని, తమ తప్పులు బయటకు పొక్కకుండా ఈ మీడియా విభాగం చేస్తున్న వ్యవహారం ఇదే. అసలు మీడియా వారికీ ఏమి అర్హతలు ఉండాలో చెప్పడానికి ఈఓ ఎవరు? అతని

ఆదేశం అంటూ హంగామా చెయ్యడానికి అనధికారిక పిఆర్ ఓ ఎవరు ? విలేకరులు అంటే ఆలయంలో అతనికింద ఊడిగం చేసేవాళ్ళు అనుకున్నారా ఏంటో తెలియల్సియుంది..

పీఆరో డొల్ల

తనం బహిర్గతం : 

కాంట్రాక్ట్ విధానంలో ( పెద్దల ఆబ్లిగేషన్ పై) ట్రాన్స్ పోర్ట్ విభాగం లో ఉద్యోగం చేరిన వ్యక్తి ప్రస్తుతం సింహాచల దేవస్థానంలో అనధికారిక

పిఆర్ à°“  à°—à°¾ ఉద్యోగం వెలగబెడుతున్నారంటే  à°†à°²à°¯ ప్రచారానికి,  à°®à±€à°¡à°¿à°¯à°¾ విభాగానికి à°ˆ à°“ ఇచ్చిన విలువ ఏంటో తెలుస్తోంది.  

అసలు ఈ విభాగం డొల్లతనం అంతా ప్రస్తుత

జరుగుతున్న సుదర్శన నృసింహ యాగం లో బయట పడిపోయింది. స్థానికంగా ఉండేదే మొత్తం మీడియా అనుకునే ఈ కూపస్థ మండూకానికి ప్రక్కనే విశాఖ నగరం లో జిల్లా స్థాయి,

రాష్ట్రస్థాయి, న్యూస్ ఏజెన్సీలు తదితర మీడియా సంస్థలు సుమారు 150 కి పైగా ఉన్నాయి అనే విషయం కూడా తెలియదు అంటే . . . ఈయన మీడియా జన జీవన స్రవంతి లోకి వచ్చి ఎన్ని యుగాలు

అయ్యిందో మరి ఆయనకే తెలియాలి. 

వీటిల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువ ప్రచారం కల్పించే సంస్థలు సుమారు 30 వరకూ ఉన్నాయి. కనీసం వీటిల్లో ఏ ఒక్క వార్తా

సంస్థకు à°ˆ యాగం గురించి తెలియదు అంటే సింహాచల ఆలయ ప్రచార విభాగం ( పిఆర్ à°“ ) à°Žà°‚à°¤ గొప్పగా పని చేస్తున్నారో తెలుస్తోంది. 

మీడియా అంటే ఆ నలుగురేనా ? :

తనకి

తెలిసిన నలుగురే మొత్తం మీడియా అనుకునే పెద్దలకి బాహ్య ప్రపంచం గురించి పరిచయం కల్గించవలసిన అవసరం కూడా ఉంది అనీ ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తోంది. లక్షల

రూపాయలు వెచ్చించి చేస్తున్న ఈ యాగాన్ని చూసేందుకు పట్టుమని పదిమంది కూడా భక్తులు రావడం లేదు అంటే ఇది దేవాలయానికే అవమానం. సింహాచల క్షేత్రం లోని స్వామి పై

ఎంతో నమ్మకం, భక్తి, విశ్వాసం ఉన్నవారు వేలాదిగా ఉన్నారు. వీరిలో ఇంటికి ఒక్కరు చొప్పున యాగశాలకు వచ్చిన మొత్తం గోశాల నిండిపోతుంది. అలాంటిది యాగ దర్శనానికి

జనమే కరువు అంటే à°ˆ వైఫల్యం పూర్తిగా సింహాచల ఆలయ ప్రచార విభాగం ( మీడియా విభాగం) ది, వీరికి కొలువు ఇచ్చిన ఆలయ ఈఓ దే. 

ఎన్నికల కోడ్ అడ్డంకి కాదు :

ఎన్నికల

కోడ్ ఉన్నప్పటికీ ఇది దేవాలయం సొంతంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. దీనికి దేవాదాయ శాఖా అనుమతి ఉంటుంది. పైగా భక్తుల నుంచి విరాళాలు వసూలు చేస్తున్నారు. దీని

గురించి నగర వీధుల్లో పోస్టర్లు, బ్యానర్లు, స్వాగత ద్వారాలు పెట్టడం వలన ఎన్నికల కోడ్ భంగం కాదు. పైగా ఈ యాగం ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినది. ఎన్నికలో కోడ్

అడ్డంకి అనుకుంటే à°ˆ యాగం ఇప్పుడు చెయ్యకూడదు. కోడ్ పోయిన తర్వాత చెయ్యాలి. యాగం చెయ్యడానికి అడ్డంరాని కోడ్  à°ªà±à°°à°šà°¾à°°à°¾à°¨à°¿à°•à°¿ ఎలా వస్తుందో వీళ్ళకే తెలియాలి. చేసిన

తప్పుని కవర్ చేసుకోడానికి మరో కొన్ని తప్పులు చెయ్యడం ఈ ఆలయ ఈఓ కి వెన్నతో పెట్టిన విద్య అన్నది అందరికీ తెలిసిన రహస్యం. గతంలో చందన యాత్రలో ఈయన చేసిన

తప్పిదాలకు పీఠాధిపతులే ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి.  à°ªà±ˆà°—à°¾ వారికీ ఇచ్చిన మాటలను à°ˆ చెవితో విని à°† చెవితో వదిలిన ఘటనలూ కో కొల్లలు. 


కొసమెరుపు :  à°®à±Šà°¦à°Ÿà°¿

రోజు యాగశాలను దర్శించేందుకు వచ్చిన చిన్న జీయర్ స్వామి వెంట వచ్చిన 20 మంది భక్తులు తప్ప. ఇతరులు  à°ˆ యాగ ప్రాంగణంలో à°•à°¾à°¨à°°à°¾à°²à±‡à°¦à±. à°œà±€à°¯à°°à± స్వామి ప్రవచనం

చేస్తున్నప్పుడు సభలో ఉన్న 30 కుర్చీల్లో సగం ఖాళీగానే దర్శనం ఇచ్చాయి అంటే ఈ యాగాన్ని ఆలయ ఈఓ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో తెలుస్తోంది.

 

#dns  #dns live  #dns media  #dns news 

#dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #simhachalam  #yagam  #sudarshana yagam  #nrusimha yagam  #chinna jeeyar  #ahobila jeeyar #EO  #Media Relations  #PRO #goshala  #election code 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam