DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరణి ( కొయ్య) తో అగ్ని మధనం - సుదర్శన యాగం అత్యద్భుతం

ఒక్క రేణువు తో మహా జ్వాల. . యాగం లో సాంప్రదాయ వైభవం

విశాఖపట్నం , మార్చి 17, 2019 (DNS Online): కేవలం ఒకే ఒక్క అగ్ని రేణువు తో మహా జ్వాలా ప్రజ్వలనం జరుగుతోంది. అరణితో (

కొయ్యలు ) మధించి అగ్ని ని వెలికి తీసే విధానమే అగ్ని మధనం. ఇదే హైందవ సంప్రదాయం లో క్రతువు   వైభవం. విశాఖ నగర ప్రాంతంలోని సింహాచల క్షేత్ర గోశాల లో à°—à°¤ ఆరు రోజులు

జరుగుతున్న శ్రీ సుదర్శన నృసింహ యాగం లో నృసింహ, సుదర్శన, పంచ సూక్త హవనం అత్యన్వ వైభవంగా జరుగుతోంది. 32 హోమ కుండాల్లో అగ్నిహోత్రం జాజ్వల్యమానంగా

ప్రజ్వలిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న అగ్ని జ్వాలలు కేవలం ఒక్క అగ్ని రేణువు నుంచే వచ్చాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. హైందవ సంప్రదాయం ప్రకారం ఏదేని

యాగం నిర్వహిస్తున్నప్పుడు హోమ కుండంలో అగ్ని ని హారతి కర్పూరం గానీ, మరే ఇతర ఆధునిక సాధనాలను వినియోగించారు. దీనికి అగ్ని ప్రతిష్ఠా అనే మహాద్భుతమైన

కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అదే విధంగా విశాఖ నగర ప్రాంతంలోని సింహాచల క్షేత్ర గోశాల లో జరుగుతున్న శ్రీ సుదర్శన నృసింహ యాగం లో ప్రహ్లాద వరద సింహగిరి

నారసింహుని వైభవం ప్రజ్వలింప చేస్తున్న వైదిక బృందం కూడా వైదిక క్రియ ద్వారానే అగ్నిహోత్రం ని ప్రజ్వలింప చేశారు.  à°‡à°¦à±‡ సంప్రదాయ క్రతు ప్రక్రియ. ఆధునిక

సాధనాలతో అగ్ని వెలిగించడం ద్వారా ఆశించిన  à°«à°²à°¿à°¤à°¾à°²à± ఉండవు అన్నది ఏనాడో పెద్దలు, ఋషులు తెలియచేసారు. ఇప్పడికీ 
హైందవ సంప్రదాయం లో జరిగే క్రతువులు, యాగాల్లో ఈ

విధంగానే అగ్ని మధనం జరుగుతుంది. ఈ అరణితో జరిగిన మధనం వల్ల వచ్చిన ఒక్క నిప్పు రేణువుతోనే ప్రధాన హోమ కుండంలో ప్రక్రియ మొదలవుతుంది. ఇలా వచ్చిన అగ్ని ని మొత్తం

యాగం లో పాల్గొనే భక్తులు అందరికీ చూపించడం జరుగుతుంది. అనంతరం యాగ భోక్త (ఆయా క్రతువు ఏ దేవత అభీష్టం కోసం జరుగుతోందో) వారికీ విన్నవించడం జారుతుంది. ఇదే

ప్రక్రియ ద్వారా సింహగిరి గోశాలలో జరుగుతున్న శ్రీ సుదర్శన నృసింహ యాగం కూడా అరణి ద్వారా వచ్చిన అగ్ని రేణువుతోనే మహా జ్వాలా జాజ్వల్యమానంగా సాగుతోంది. ఇది

కేవలం క్రతువు నిర్వహిస్తున్న వైదిక బృందం కష్టం పైనే పూర్తిగా ఆధారపడుతుంది. ఈ అగ్ని మధనానికి కంకణ ధారణ చేసిన వైదిక అర్చక, ఋత్విక్కులు మాత్రమే అర్హులు. ఈ

విధంగా వచ్చిన అగ్ని తోనే ప్రస్తుతం గోశాలలో  32 హోమ కుండాల్లో à°—à°¤ ఆరు రోజులుగా అనంత హవనం జరుగుతోంది, మరో మూడు రోజులు సాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్ని

ఆగిపోవడం ఉండదు. రాత్రిళ్ళు సైతం జ్వాల నిలిచి ఉంటుంది.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #simhachalam  #yagam  #sudarshana yagam  #nrusimha yagam  #chinna jeeyar  #ahobila jeeyar #EO  #Media Relations  #PRO #goshala  #election code #Arani

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam