DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఉత్తరం లో ఈ వలస పక్షి గూడు నిలిచేనా . . కూలేనా ? 

విశాఖ ఉత్తరం : భూ వివాదాల వలస రాజు గెలిస్తే 8 వ వింతే :

భూ బాధితుల ఓట్లు పడతాయా ?

విశాఖపట్నం, మార్చి 22, 2019 (DNS Online): విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ

అభ్యర్థి కేకే రాజు విజయం సాధిస్తే అది ప్రపంచంలో 8 à°µ వింతే అవుతుందని ప్రస్తుత పోటీ తెలియచేస్తోంది. 

విశాఖ నగరం అంటే భూ దందాలకు అన్ని విధాలా ఆస్కారం

ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలూ దీనిపైనే ద్రుష్టి పెట్టాయి. పైగా ఇతర ప్రాంతాల నుంచి వలస పక్షులని దిగుమతి చేసి, విశాఖ వాసుల నెత్తిన బలవంతంగా రుద్దుతున్నాయి.

విశాఖ నగరం లోని వివిధ శాసన సభ స్థానాల బరిలో నిలిచినా అభ్యర్థులు 90 శాతం à°•à°¿ దిగుమతి కాబడ్డవారే. . . తూర్పు గోదావరి జిల్లా  à°®à°‚డపేట నుంచి వచ్చిన కేకే రాజు, ఎక్కడో

ప్రకాశం నుంచి వచ్చిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు సహా విశాఖ ఉత్తర నియోజకవర్గం పై వాలిపోయారు. వీళ్ళ గురించి జనానికి చెప్పవలసిన అవసరం లేదు. వీళ్ళ భూ వివాదాల

బారిన పడి ఏళ్ళ తరబడి చుక్కలు చూస్తున్నవాళ్ళే వీళ్ళ బ్రతుకులు శాసించబోయే ఓటర్లు కూడానూ. 

వ్యాపార నేపధ్యం:

భూమిని నమ్ముకునే కుటుంబ నేపధ్యం నుంచి

వచ్చిన రాజు, అదే భూమిని వ్యాపార సమిధగా చేసి, సిరి డెవలపర్స్ పేరిట సంస్థ ను ప్రారంభించి ఇబ్బడి ముబ్బడిగా వివాదాలు సృష్టించేశారు. దీంతో ఎందరో అభాగ్యులు

రోడ్డుపాలయ్యారు. ఇతని పై ఎన్నో మార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకునే వాడు లేరు అంటే ఆనతికాలం లోనే ఇతను ఏ స్థాయిలో ఎదిగిపోయ్యారో తెలుస్తుంది. ఎదుగుతున్న తన

ప్రత్యర్ధులకు అదుపు చేసేందుకు ఇతను చెయ్యని ప్రయత్నం లేదంటే అతిగా శయోక్తి కాదు. అయితే à°† వివాదాలకు ఆధారాలు లేకపోవడంతో బాధితులు రోడ్డున పడ్డారు. కేవలం 
13

ఏళ్ళ కాలంలోనే వ్యాపారిగా అమాంతం ఎదిగిపోయిన కేకే రాజు కు తన పేరువెనక ఎమ్మెల్యే అని రాసుకోవాలనే కోరిక బలంగా పెరిగిపోయింది. దీంతో రాజకీయంగా ఎదగాలి అనుకునే

తన ఆలోచనలకూ తగ్గట్టుగా ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. గంతకు తగ్గ బొంత అన్నట్టు ఎన్నో కేసుల్లో ఏ 1 ముద్దాయి, దోషిగా ఉన్న వైఎస్సార్

కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశ్రయం పొందేందుకు కి దగ్గరయ్యే విషయం లో సీనియర్ నేతలకు చుక్కలు చూపించి, వారిని బురిడీ కొట్టించి విశాఖ

ఉత్తరం లో పార్టీ అభ్యర్థిగా మొత్తానికి టికెట్ సంపాదించేసారు. వచ్చిందే తడవుగా నామినేషన్ కూడా . . .

ఇతను వలస పక్షే. . . :

కేకే రాజుగా గుర్తింపు పొందిన

కమ్మిల కన్నప రాజు స్వగ్రామం: తూర్పుగోదావరి జిల్లా, మండపేట మండలం ఏడిద సీతానగరం గ్రామం. విశాఖ నగరం తోనే కాక, అసలు విశాఖ జిల్లాలోనే ఏమాత్రం సంబంధం లేని ఈ కేకే

రాజు కన్ను విశాఖ ఉత్తరం పై పడింది. ఈ ప్రాంతంలోనే రాష్ట్రంలోనే అత్యధిక ధనవంతులు ఉండడం తో వారి తో లావాదేవీలు జరుపుతూ వారికి మరింత దగ్గరయ్యేందుకు తగిన మార్గం

ఎమ్మెల్యే సీటే అని పూర్తిగా నమ్మకం కుదురైన తర్వాత, టికెట్ కోసం సీనియర్లను తొక్కి మరీ టికెట్ సంపాదించేసారు. ఇక ఎమ్మెల్యే పదవి కూడా వరించేస్తే జిల్లాకే

పరిమితమైన వ్యాపారాలను ఇతర రాష్ట్రాలకు విస్తరించే ఏర్పాట్లలో ఉన్నట్టు తెలుస్తోంది. 

పూర్తి వ్యతిరేకత : 

కేకే రాజు స్థానికుడు కాక పోవడం తో విశాఖ

ఉత్తర నియోజకవర్గంలో ప్రజలకు ఇతను తెలిసే అవకాశం లేదు. పైగా ప్రజలతో ఎటువంటి సంబంధం లేకుండా కేవలం ఒక గిరి గీసుకుని తన వ్యాపార పరిధిలోనే ఉండడం ఇతనికి

పూర్తిగా మైనస్. అత్యంత ధనికులు ఉండే ప్రాంతమైన బాలయ్యశాస్త్రి లే అవుట్ లో కార్యాలయం ప్రారంభించినా ప్రక్కనే ఉన్నఅపార్ట్మెంట్ వాసులకు ఎవరికీ ఇతనెవరో కూడా

తెలియదు అంటే ఇతని స్థితి తెలుస్తోంది. నిత్యం ఆర్భాటం చెయ్యడం తప్ప, అసలు తక్కువ అనే పేరు మాత్రం కేకే రాజు మూట గట్టుకున్నారు. 

ఉత్తరం ప్రత్యేకత

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అధిక శాతం రాజులు, ఎస్సీ, యాదవ తదితర సామాజిక వర్గాల తో పాటు, వ్యాపార వర్గాలు, సంపన్న కుటుంబాలు, ఉద్యోగవర్గాలు ఉన్నాయి. అన్ని

రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా ఇక్కడే ఉండడం గమనార్హం. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, జనసేన తదితర పార్టీల అభ్యర్థులు (వివిధ

నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు) ఇక్కడే ఉన్నారు. అయితే వీరి ప్రభావం జనంలో అధికంగానే ఉండడం కేకే రాజు పూర్తి à°—à°¾  à°¨à°¿à°°à°¾à°¶à±‡. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ à°•à°¿

చెందిన పి విష్ణు కుమార్ రాజు కూడా ఈయన సామజిక వర్గానికి చెందినవారు కావడం, ఆయనకు ప్రజాదరణతో పాటు, సమాజంలో మంచి పేరు, బోళామనిషి, నేరుగా ఉన్నది ఉన్నట్టు బహిరంగానే

చెప్తారు అన్న మంచి పేరు ఉండడం పూర్తిగా కేకే రాజు కు తమ సామాజిక వర్గం తో పాటు ఇతర వర్గాల ఓట్లను కూడా దూరం చేయనుంది. 

రాజు గెలిస్తే ప్రపంచం లో 8 వ వింతే

:

ఇక గంటకో పార్టీ మారే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఇక్కడే బరి లో నిలవడం కేకే రాజుకు పూర్తిగా చిత్త చంచల్యం కల్గించే అంశం. గెలుపు కోసం గంటా చేసే

ప్రయత్నాలు ప్రత్యర్థులకు మైండ్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం. అవసరమైతే ఓటును పొందేందుకు సామదాన బేధ దండోపాయాలను సైతం వినియోగించే అవకాశాలున్నాయని అతనికి అత్యంత

సన్నిహితంగా ఉండేవారు చెప్పా విషయం. ఇలాంటి నేపథ్యంలో కేకే రాజు గెలిస్తే అది ప్రపంచంలో ఎనిమిదో వింతే అవుతుంది అన్నది సదరు ఓటరు అభిప్రాయం. 

 

 

#dns  #dns live  #dns media 

#dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #ganta srinivasa rao  #YSR congress  #telugudesam  #visakhapatnam north  #poll  #election  #voting  #Vishnu kumar raju  #KK Raju
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam