DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ బరిలో దందా - పోలీసు సై ఆటలో గెలుపెవరిది ?

నిందితులతో కలిసి పోలీసు పోటీయా ? 

అడ్డదారి కి అండ కోసమే ఎన్నికల బరిలోకి ?

విశాఖ ఎంపీగా గెలిస్తే కేంద్రంలో అధికారమే . . . 

విశాఖపట్నం, మార్చి 22, 2019 (DNS

Online): విశాఖపట్నం లోక్ సభ స్థానానికి ఈ పర్యాయం అత్యంత ప్రత్యేకత ఏర్పడింది. దందా పోలీసు సై ఆటకు తెర తీశాయి రాజకీయ పార్టీలు. జనసేన పార్టీ తరపున దేశమంతా ప్రఖ్యాతి

గాంచిన విశ్రాంత సిబిఐ అధికారి వివి లక్ష్మీనారాయణ కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ తరపున కొన్ని భూదందా కేసుల్లో అరెస్టు కాబడిన రియల్టర్ ఎంవివి సత్యనారాయణ. ఈ

ఇద్దరిలో గెలుపేవారిని వరిస్తుందో à°ˆ ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి. 

వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి  à°¨à±‡à°ªà°§à±à°¯à°‚ ఇదే :

విశాఖపట్నం పై ఆర్ధిక నేరస్థులు, భూ

దందాల్లో నిందితుల దృష్టి పడింది అంటే నమ్మే పరిస్థితి గతం లో ఉండేది కాదు. అయితే అది నిజమని ప్రస్తుత ఎన్నికలు తెలుస్తున్నాయి. గతం లో వివిధ భూ దందా కేసుల్లో

అరెస్ట్ కాబడిన వ్యక్తి నేడు విశాఖపట్నం లోక్ సభ స్థానానికి పోటీపడుతుండడం గమనార్హం. అయితే వ్యాపార పరంగా చేసిన పనులకు పోలీసులతో ప్రజలందరి ముందూ అరదండాలు

వేయించుకున్న వ్యక్తి నేడు అదే ప్రజలను తనకు ఓటు వెయ్యమని కోరడం విశేషం. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆధారం చేసుకుని భూదందాలు చేయడంతో పాటు, ఆయా వ్యక్తులను

భయభ్రంతుల్ని కూడా చెయ్యడంతో పోలీసు వర్గాలు రంగం లోకి దిగిన ఘటనలు పార్టీ నేతలు, కార్యకర్తలు మరిచిపోయినా ఇతని బారిన పడిన బాధితులు, ప్రజలు మరిచిపోలేదు. డబ్బు

ఉందికదా ఓట్లు ఎలాగైనా పొందవచ్చు అనే లెక్కలు వేసుకుంటున్నపార్టీలు ప్రజల్లోకి వచ్చేసారు. నామినేషన్ కూడా వేసేసారు. 

పోలీసు ను ఎదుర్కునే ధైర్యం ఉందా ?

"

గత ఏడాదిగా తనకు ఎదురులేదు అని చాలా ధీమాగా ఉన్న ఎంవివికి జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఝలక్ తో మైండ్ బ్లాంక్ అయిపొయింది. పైగా ఒక మిసైల్ ని విశాఖ బరి లో

నిలిపాం అని పవన్ ప్రకటించడంతో ఎవరా అని ఎదురుచూస్తున్నఅందరికీ రాత్రికి రాత్రి జెడి లక్ష్మీనారాయణ ను తెరమీదకి తీసుకురావడంతో ప్రజలతో పాటు వైఎస్ ఆర్

కాంగ్రెస్ పార్టీకి ఊహించలేని షాక్ తగిలినట్లయింది. à°ˆ బలమైన అభ్యర్థిని ఎదుర్కొనే సత్తా ఎంవివికి ఉందా అనేది అనుమానమే. 

సంచలనాల జెడి :

పోలీసు

అధికారిగా దేశమంతా విస్తుపోయేలా ఆంధ్రా లో ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసుల్లో

అరెస్ట్ చేసి 
జైలు కు పంపి 17 నెలల పాటు నెలలు అక్కడే కూర్చోబెట్టిన నేత వివి లక్ష్మీనారాయణ. 
విశాఖ లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన పార్టీ అభ్యర్థి  à°µà°¿à°µà°¿

లక్ష్మీనారాయణ అంటే జనానికి తెలియక పోవచ్చు, కానీ జెడి అనగానే ఠక్కున గుర్తుకు వస్తారు. ప్రత్యర్థి నీతి నిజాయితీ లకు మారుపేరుగా నిలిచిన అత్యంత బలమైన లక్ష్మి

నారాయణ (మాజీ సిబిఐ జెడి ) పోలీసు అధికారి కావడం, ఆయనకు ప్రజల్లో చాలా క్రేజ్ ఉండడం ఎంవివికి మింగుడు పడని అంశంగా మారిపోయింది.  à°‡à°ªà±à°ªà±à°¡à± ప్రధానంగా వీరిద్దరి మధ్యే

పోటీగా మారిపోయింది. 

దగ్గుబాటి కి తిరోగమనమే :

గతం లో ఇక్కడే ఎంపీ గాను, కేంద్ర సహాయ మంత్రిగానూ పనిచేసి దగ్గుబాటి పురంధేశ్వరి వాళ్ళ విశాఖ నగరానికి

పెద్దగా ఒరిగిందేమీ లేకపోగా సొంత ఆస్తులు పెంచుకున్నారన్న వివాదం బాగా ముదిరింది. ప్రస్తుతం ఆమెనే భారతీయ జనతాపార్టీ మరోసారి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది.

అయితే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చినా కూడా ఈమె దెబ్బకి బీజేపీ కి కంకుదెబ్బలు తప్పవని తేలిపోయింది. విశాఖ అభ్యర్థిగా ఈమెను ప్రకటించడం తో మోడీ కి ఉన్న

పేస్ వాల్యూ మొత్తం తుస్సు మని పోయింది. 

విశాఖ లో గెలిచే అధికారమే :

విశాఖ ఎంపీ స్థానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక్కడ విజయం సాధించిన పార్టీ

కేంద్రంలో అధికారంలోకి ( నేరుగా లేదా కూటమితో ) వస్తుంది అన్న నమ్మకం బలంగా ఉంది. గతంలో తెలుగుదేశం గెలిచి ఎన్డీఏ, కాంగ్రెస్ గెలిస్తే యుపిఎ, బీజేపీ గెలిస్తే

ఎన్డీఏ ఇలా అధికారం లోకి వచ్చాయి. ఇప్పుడు గెలిచే పార్టీ ఢిల్లీ గద్దె ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.  

 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam