DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అనకొండలపై పోలీసు మార్కు కాదు ప్రజా మార్కు చూపిస్తా : మాజీ జెడి 

విశాఖ వాణిని చట్టసభలో వినిపిస్తా . . . . 

జన సేనానీ  à°…భినవ ఛత్రపతి శివాజీ 

విశాఖలోనే ఉంటా. . . నగరాన్ని గాడిలో పెడతా . . . 

విశాఖపట్నం, మార్చి 22, 2019 (డి ఎన్ఎస్):

 à°µà°¿à°¶à°¾à°–లో పెరిగిపోయిన భూ దందా, అవినీతి అనకొండలపై పోలీసు మార్కు కాకుండా ప్రజా మార్కు చూపించి వాళ్ళని తరిమికొడతానని మాజీ జెడి (సిబిఐ) లక్ష్మీనారాయణ

ప్రకటించారు. శుక్రవారం విశాఖపట్నం లోక్ సభ స్థానానికి జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేసిన అయన  à°…నంతరం విశాఖ తూర్పు నియోజకవర్గం లో పార్టీ కార్యాలయాన్ని

ప్రారంభించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ తానూ పూర్తి స్థాయి రాజకీయ జీవితాన్ని గడుపుతానని, విశాఖలోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నానని

తెలిపారు. దశాబ్దాలుగా విశాఖ ప్రాంతాన్ని వివిధ రాజకీయ నేతలు అడ్డగోలుగా దోచుకున్నారని, వీళ్ళ అవినీతి ముందు అనకొండలు కూడా చాలా చిన్నవేనన్నారు. విశాఖ వాణిని

లోక్ సభ లో వినిపించి విశాఖ అభివృద్ధికి సర్వ శక్తులు ఒడ్డుతానని తెలిపారు. ఇంతవరకు అందమైన నగరం చెప్పండి అంటే అంతా సింగపూర్ అంటున్నారని, ఇక పై అందమైన నగరం గా

విశాఖ పేరు వచ్చేలా నగరాన్ని తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. కేవలం అవినీతి పై పోరాటం చేసేందుకే జనసేన పుట్టిందని, ఎవరిపై వ్యక్తిగత వ్యతిరేకత ఉండదని

తెలిపారు. ఆధునిక భారత దేశంలో పుట్టిన అభినవ ఛత్రపతి శివాజీయే ఈ జన సేనాని పవన్ కళ్యాణ్ అని అన్నారు. కేవలం భారత దేశ రక్షణకై శివాజీ పోరాటం చేశారని, అదే విధంగా

అవినీతి రహిత పాలన కోసం పవన్ పోరాటం చేస్తున్నారన్నారు. విశాఖ కేంద్రంగా ఈ పోరాటాన్ని తానూ ప్రారంభిస్తున్నట్టు వివరించారు. రామాయణం లో విభీషణుని పాత్ర ను

గుర్తు చేశారు. లంకలో రాముడు ప్రవేశించిన తదుపరి లంకేశ్వరునిగా విభీషణునికి పట్టాభిషేకం చేసిన రామునిలా  à°œà°¨à°¸à±‡à°¨à°¾à°¨à°¿ తనను విశాఖ కొత్వాల్ à°—à°¾ నియామకం

జరిపారన్నారు. విభీషణునికి లంక ఆధిపత్యం లభించడం à°Žà°‚à°¤ వాస్తవమో తానూ విశాఖ ఎంపీగా గెలవడం కూడా అంటే వాస్తవం à°—à°¾ జరుగుతుందని ప్రకటించారు. 

పోలీసు విధుల

నుంచి పదవి విరమణ చేసాక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి క్షేత్ర స్థాయి లో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, యువత తో చర్చలు జరిపిన తదుపరి వారి సమస్యలు తెలుసుకున్న

అనంతరమే జనసేన లో అధికారికంగా చేరినట్టు తెలిపారు. ఈ సమావేశం లో విశాఖ తూర్పు అభ్యర్థి కోన తాతారావు, జనసేన సీనియర్ నాయకులూ బొలిశెట్టి సత్య, శివశంకర్, మిత్ర పక్ష

సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #bjp  #ganta srinivasa rao  #telugudesam  #jana sena  #JD Lakshminarayana  #pawan kalyan  #parliament  #visakhapatnam east  #kona tatarao  #CBI  #Anakonda
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam