DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాలుష్య నియంత్రణ మా వల్ల కాదు : విశాఖ దక్షిణ అభ్యర్థులు 

ఎవరైతే నాకేంటి, డోంట్ కేర్ :ముఖాముఖి లో  à°µà°¾à°¸à±à°ªà°²à±à°²à°¿ ఫైర్

విశాఖపట్నం, మార్చి 28, 2019 (DNS Online) : విశాఖ పాత నగరాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య పోర్ట్ నుంచి

విడుదలవుతున్న కాలుష్యం. దీన్ని నివారించడం మా వల్లకాదు అని విశాఖ పట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు చేతులెత్తేశారు. శుక్రవారం విజెఎఫ్ ప్రెస్

క్లబ్ నిర్వహించిన ముఖాముఖీ లో అధికార 
తెలుగుదేశం పార్టీ కి చెందిన అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తనపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ

ఎవరైతే నాకేంటి, డోంట్ కేర్ అనడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇక ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ

గతంలో తానూ ఇదే చోట ఎమ్మెల్యే à°—à°¾ సేవలందించానని, ఇప్పడికే తానూ అత్యావశ్యకమైన పనులన్నింటినీ నెరవేర్చడం జరిగిందన్నారు. 

ఎవరైతే నాకేంటి, నా రూటే సెపరేటు :

వాసుపల్లి     

పార్టీ తనకు టికెట్ ఇవ్వడం తమ పార్టీ లోని సీనియర్లకు ఇష్టం లేదని, అందుకే తనపై విలేకరుల సమావేశం పెట్టి మరీ ఓడిస్తామని ప్రకటన చేసారని,

ఎవరైనా తానూ డోంట్ కేర్ అని తెలుగుదేశం అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతిపక్ష పార్టీ నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా

ఘాటుగానే వస్తాయన్నారు. వాటన్నింటినీ పట్టించుకునే తీరిక తనకు లేదన్నారు. తానూ సైన్యం లో పనిచేసి వచ్చానని, ఇలాంటి తాటాకు చప్పుళ్లను తానూ పట్టించుకోనన్నారు.
/> గత ఐదేళ్ల పదవి కాలంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకార గ్రామాలను ఆదుకున్నది తానేనని, మత్స్యకారులకు, ముస్లిములకు, వెనుకబడిన సామజిక వర్గాల ప్రజలకు

ప్రత్యేకంగా ప్రజా దర్బారులు పెట్టి వారి సమస్యలను పరిష్కరించానన్నారు. అత్యంత ఖరీదైన ప్రాంతమైన ద్వారకా బస్సు కాంప్లెక్స్ వద్ద నిర్మించిన దుకాణ సముదాయంలో

అందరూ అత్యంత నిరుపేదలకు కేటాయించడం జరిగిందన్నారు. వందలాది మందికి ఇళ్లను కేటాయించామన్నారు. 

గతమెంతో ఘనం, మేము వస్తే స్వర్ణయుగమే : ద్రోణంరాజు

శ్రీనివాస్.

గతం లో ఎమ్మెల్యే గా సేవ చేసిన సమయంలో అత్యంత దుర్భరంగా ఉన్న దక్షిణ నియోజకవర్గాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్

పార్టీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రకటించారు. వన్ టౌన్ లోని కురుపాం మార్కెట్ ను సుందరీకరణ చేసానని, మత్యకార గ్రామాలకు ఇళ్ల కేటాయింపులు, సామాజిక భవనాలు

నిర్మించామని, పోర్ట్ ట్రస్ట్ అధికారులతో సంప్రదింపులు జరిపి కాలుష్యం అధికంగా ప్రజలపై పడకుండా నిరోధించేందుకు నివారణ చర్యలు తీసుకున్నామన్నారు. ఎంబెరు

మానార్ స్వామి ఆలయం, జగన్నాధ స్వామి ఆలయం, ఇసుక కొండ సత్యనారాయణ స్వామి ఆలయం అభివృద్ధి పరిచానన్నారు. మహిళలకు స్వయం ఉపాధి పథకాలకై రుణాలు అందించామన్నారు. జగదాంబ

కూడలి నుంచి, పాత నగరం వరకూ గల ఇరుకు రహదారులను విస్తృత పరిచి సుందరీకరణ కై డిపిఆర్ ను సిద్ధం చేయడం జరిగిందన్నారు. సముద్ర తీర ప్రాంతాల నివాసితులు తుఫాను రక్షణ

కేంద్రాలు నిర్మించామని తెలిపారు. తన తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ సైతం ఇదే నియోజకవర్గం నుంచి సేవలు అందించారన్నారు. గతం లో తానూ చేసిన ప్రజాసేవ ను గుర్తించిన

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని 2014 లోనే కోరడం జరిగిందని, అయితే కాంగ్రెస్ పార్టీ పై ఉన్న విశ్వాసం, నమ్మకంతో నాడు పార్టీ

మారలేదన్నారు. తదుపరి ఇటీవల కాంగ్రెస్ లో జరిగిన పరిణామాలకు విసిగి ఉండడంతో, మరో మారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానం పలకడం తో ఆ పార్టీ లో చేరడం

జరిగిందన్నారు. 

పోర్టు కాలుష్యం పై తాము చేయగలిగింది చాలా స్వల్పమని, అయితే నియోజకవర్గ అభివృద్ధి కి కృషి చేస్తామని బీజేపీ అభ్యర్థి రామ్ కుమార్,

కాంగ్రెస్ అభ్యర్థి సింకా, జనసేన అభ్యర్థి గోవర్ధన్ లు తెలిపారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #telugu desam #janasena  #congress  #visakha south  #dronamraju srinivas  #vasupalli ganesh kumar  #ram kumar  #telugudesam  #chandrababu naidu #modi  #ys jagan mohan reddy

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam