DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓటు - హక్కే కాదు, ఒక భాద్యత : కొత్తవలస లో అవగాహనా ర్యాలీ

(రిపోర్ట్ : పివిఎస్ రంగాచార్యులు, కొత్తవలస )

కొత్తవలస (విజయనగరం), మార్చి 29, 2019 (DNS Online) : భారత పౌరులకు రాజ్యాంగం అందించిన మహా శక్తి ఓటు హక్కు అని, దాన్ని సద్వినియోగం

చేసుకోవడం ప్రతి ఒక్కరి భాద్యత అని ప్రభుత్వ అధికారుల సంఘం తెలియచేస్తోంది. శుక్రవారం ఓటు హక్కు మాత్రమే కాదు - ఇది ఒక భాద్యత అనే నినాదాలతో కొత్తవలస లోని మండల

రెవిన్యూ అధికారి కార్యాలయం నుంచి పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ లో పలు విభాగాల ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, విద్యావేత్తలు, వైద్యులు, యువత

పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన నవ సమాజ నిర్మాణం ఏర్పడాలి అంటే సమాజం పట్ల భాద్యత కల్గిన వ్యక్తులు చట్టసభలకు ఎన్నిక కావాలని, వారిని ఎన్నుకునే అవకాశం భారత ప్రజలకు

ఈ దేశ రాజ్యాంగం కల్పించింది అన్నారు. ఎన్నికల సమయంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని తమ భాద్యత గా భావించి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని

కోరారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #ganta srinivasa rao  #telugudesam  #chandrababu naidu  #vote  #awareness;  #kothavalasa  #vizianagaram  #MRO

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam