DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణ ద్వేషి బాబు బ్యాచ్ ని ఇంటికి పంపండి: బ్రాహ్మణ వేదిక పిలుపు 

విశాఖపట్నం, మార్చి 30, 2019 (DNS Online) : బ్రాహ్మణ ద్వేషం నరనరాల్లో జీర్ణించుకు పోయిన చంద్రబాబు నాయుడిని ఈ ఎన్నికలతో ఇంటికి శాశ్వతంగా సాగనంపాలని బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక

పిలుపు నిచ్చింది. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో నగరంలోని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు నిర్వహించిన

విలేకరుల సమావేశంలో వివి వామన రావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి కి బ్రాహ్మణులంటే ఎల్లవేళలా ద్వేషమే ఉందని, ఇంతవరకూ జరిగిన ఎన్నికల్లో పార్టీ తరపున కనీసం ఒక్క

టికెట్ కూడా బ్రాహ్మణులకు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. పైగా ఏ మొహం పెట్టుకుని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య తెలుగుదేశానికి ఓటు వెయ్యమని

బ్రాహ్మణులను అడుగుతున్నాడో చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ రాష్ట్రంలో లక్షల్లో బ్రాహ్మణులూ ఉంటె కేవలం కొన్ని వేలమందికి బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు ఇచ్చాడని,

మిగిలిన వారి దరఖాస్తులను ఏ విధంగా తిరస్కరించాడో రాష్ట్రం అంతా చూసిందన్నారు. ఒక బ్రాహ్మణునికి ఎలా మర్యాద ఇవ్వాలో తెలియని ఈ పార్టీ ని ఇంతకాలం ఆదరించింది

చాలు, ఇక వీళ్ళు ఉద్దరించాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కనీసం ఒక్క కార్పొరేషన్ కి గానీ, ఆలయాల్లో ట్రస్ట్ బోర్డుల్లో గాని, ఎమ్మెల్యే టికెట్ గాని,

ఎమ్మెల్సీ టికెట్ గానీ, ఎంపీ టికెట్ గాని ఇచ్చిన దాఖలాలు లేవని, కేవలం బ్రాహ్మణులంటే ఓటు వెయ్యడానికి పరిమితం అన్న అహంకారం నరనరాల్లో జీర్ణించుకున్న

చంద్రబాబు, అతని చంచా బ్యాచ్ కి ఇక శాశ్వతంగా చరమ గీతం పాడాలని రాష్ట్రంలోని యావత్ బ్రాహ్మణ కుటుంబ సభ్యులకూ ఈ వేదిక ద్వారా పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో వివిధ

బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు వివి à°—à°¿à°°à°¿, నండూరి సుబ్రహ్మణ్యం, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #telugudesam  #ysr congress  #vamana rao  #brahmin  #ananda surya  #andhra pradesh brahmin welfare corporation  #IYR

Krishna Rao  #TTD  #Ramana Dixitulu

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam