DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతాం : విశాఖపశ్చిమ అభ్యర్థులు 

ఇది à°’à°• మినీ భారత్ లాంటిది : బీజేపీ చంద్రశేఖర్ 

కార్మికుల సమస్యలకు సత్వరం పరిష్కారం : సిపిఐ జెవి 

ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపా: వైకాపా

మళ్ల 

జాతీయ పార్టీ గెలిస్తే సమస్య పరిష్కారం సులభం: కాంగ్రెస్ 

విశాఖపట్నం, మార్చి 30, 2019 (DNS Online) : పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలోని

పారిశ్రామిక వాడలు అధికభాగం విశాఖ పశ్చిమ శాసన సభ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్నఎన్నికల్లో ఈ నియోజకవర్గం లో పోటీపడుతున్న వివిధ పార్టీల

అభ్యర్థులతో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ నిర్వహించిన ముఖ ముఖి లో పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అభ్యర్థులు తెలిపారు. జనసేన, వామపక్షాలు, బీఎస్పీ పార్టీల

ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేస్తున్న జెవి సత్యనారాయణ మూర్తి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్, బిజెపి అభ్యర్థి బుద్ధా

చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. 

ఇది à°’à°• మినీ భారత్ లాంటిది : బీజేపీ చంద్రశేఖర్ 

విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఒక మినీ భారత్ దేశం లాంటిదని, ఇక్కడే

దేశంలోని ఎన్నో ప్రాంతాల ప్రజలు నివాసం ఉంటున్నారని, బీజేపీ అభ్యర్థి బుద్ధా చంద్ర శేఖర్ అన్నారు. దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రంగం రక్షణ రంగమని,

ప్రధానంగా ఈ విభాగాల తో తలెత్తే సమస్యల పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం జోక్యం అవసరమన్నారు. కేంద్రంలో అధికారంలోకి రానున్న బీజేపీ పార్టీ అభ్యర్థి విజయం

సాధిస్తే à°ˆ ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలకు సులభంగా పరిష్కారం లభిస్తుందన్నారు.  
రైల్వే జోన్ డివిజన్ నుంచి వచ్చే ఆదాయం నేరుగా కేంద్రానికే వెళ్తుంది తప్ప,

ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా లోకి వెళ్ళదు అన్నారు. విశాఖపట్నం ను బీజేపీ కి ఉన్న అభివృద్ధి పరచాలి అనే నిబద్ధతకు నిదర్శనమే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్

ఏర్పాటు చేయడమేనన్నారు. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా ఆర్ ఆర్ బి వస్తుందని, తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. కొత్త రైళ్లు వస్తాయని, బెర్తుల కొత్త

పెరుగుతుందన్నారు. వీటన్నింటి తో పాటు పరోక్షంగా వందలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. à°ˆ సంస్థల్లో చాలా భాగం  à°µà°¿à°¶à°¾à°– పశ్చిమ నియోజకవర్గంలోనే ఏర్పాటు

కానున్నాయన్నారు. రైల్వే శాఖా కు అధికంగా భూములు పశ్చిమ నియోజకవర్గంలోనే ఉన్నాయన్నారు. అందరికీ న్యాయం చేసే అవకాశం మాకు వస్తుందన్నారు.  

కార్మికుల

సమస్యలకు సత్వరం పరిష్కారం : సిపిఐ జెవి 

కాలుష్యాన్ని నియంత్రించేందుకు పరిశ్రమలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని,  à°µà±€à°Ÿà°¿à°¨à°¿ నిరోధించడం లో ప్రభుత్వాలు

ఘోరంగా విఫలం అయ్యానని పారిశ్రామిక రంగ, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను సత్వరం పరిష్కరించి, శ్రామిక కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతామని జనసేన- సిపిఐ ఉమ్మడి

అభ్యర్థి జెవి సత్యనారాయణ మూర్తి తెలిపారు. అసంఘటిత రంగంలోని కార్మికులు స్థానికేతరులే ఉన్నారని, ఇకపై స్థానికంగా నైపుణ్యం ఉన్న అర్హులైన యువతకు ఉపాధి

కల్పనకు కృషి చేస్తానన్నారు. 
విశాఖ నగరంలోని పశ్చిమ నియోజక వర్గం అధిక భాగం పారిశ్రామిక వాడల్లోనే ఉన్నందున శ్రామికులు, కార్మికుల సమస్యల పరిష్కారానికే

అధిక సమయం వెచ్చిస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పధకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేవిధంగా కృషి చేస్తానన్నారు. తానూ దశాబ్దాలుగా

కార్మిక రంగంలోనే ఉన్నానని, పోరాటాలు ఉద్యమ స్ఫూర్తితోనే జీవనాన్ని సాగిస్తున్నట్టు తెలిపారు. 

ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపా: వైకాపా మళ్ల 

à°ˆ

ప్రాంతంలో అత్యధిక శాతం కాలుష్యం, దీన్ని అదుపు చేసేందుకు సంబంధిత అధికారులను రాష్ట్ర స్థాయిలోను, కేంద్ర స్థాయి లోనూ ఎన్నో దఫాలుగా చర్చలు జరిపి కొంతవరకూ

విజయం సాధించినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మళ్ల విజయ్ ప్రసాద్ తెలిపారు. గతంలోనే ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో సింహాచలం నుంచి బీహెచ్ పివి మార్గం

నిర్మాణం కోసం చెయ్యని ప్రయత్నం లేదని, అధికారుల్లో సమన్వయ లోపం, శాఖా విబేధాల కారణంగా నేటికీ పరిష్కారం కాలేదన్నారు. కార్మికులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా

వివిధ ప్రభుత్వ, కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్సలకై కృషి చేశానన్నారు. 

జాతీయ పార్టీ గెలిస్తే సమస్య పరిష్కారం సులభం: కాంగ్రెస్ 

కేంద్ర

ప్రభుత్వ సహకారంతో అన్ని ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భగత్ తెలిపారు. ఈ నియోజక వర్గం అన్ని ప్రాంతాలలోనూ అనుసంధానమై ఉందన్నారు. ఏ

సమస్య వచ్చిన ఇతర ప్రాంతాలతో అంతర్గత భాగమై ఉందన్నారు. ఈ పరిధిలోనే విశాఖపట్నం విమానాశ్రయం కూడా ఉందని, జాతీయ సంస్థలైన రక్షణ రంగ, విమానయాన, నావికాదళ తదితర రంగాలు

అంతర్భాగమై ఉన్నాయన్నారు. ఈ నియోజక వర్గంలో జాతీయ పార్టీ కి చెందిన అభ్యర్థి విజయం సాధిస్తే కేంద్రం తో చర్చించి, అన్ని సమస్యలకూ పరిష్కారం

లభిస్తుందన్నారు. 

ప్రచారం లో బిజీ గా ఉన్నందున పాత్రికేయులు నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి రావడం లేదని అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి,

సిట్టింగ్ ఎమ్మెల్యే, విప్ పిజివిఆర్ నాయుడు నిర్వాహకులకు సమాచారం అందించారు. 

అనంతరం అభ్యర్థులను విజెఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు,

ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజు పట్నాయక్, సంయుక్త కార్యదర్శి దాడి రవికుమార్, సభ్యులు ఎమ్మెస్సార్ ప్రసాద్, ఈశ్వర్ రావు, వరలక్ష్మి, శేఖర్ మంత్రి తదితరులు సత్కరించారు.

అంతకు ముందు పాత్రికేయులు సంధించిన ప్రశ్నలకు అభ్యర్థులు తమదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #indian navy  #indian railways   #airport  #industries  #Simhachalam  #Gopalapatnam  #NAD jn  #telugudesam  #YSR

Congress  #MLA  #Malla Vijay Prasad  #PGVR Naidu  #Budda Chandra sekhar  #CPI  #Janasena  #BSP  #JV Satyanarayana Murty  #Congress  #West
 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam