DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భయభ్రాంతుల్ని చేస్తున్న పెందుర్తి జనసేన బైకు ర్యాలీలు 

బైక్ రైడర్లు తాగి బండి తోలుతుంటే కనపడడం లేదా? 

పోలీసులకు కనపడినా పట్టింపు లేదు, 

వేపగుంట (విశాఖపట్నం) , ఏప్రిల్ 2 , 2019 (DNS Online డి ఎన్ ఎస్ ) : ఎన్నికల ప్రచారం

పేరిట విశాఖ నగరం పెందుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ నిర్వహిస్తున్న బైకు ర్యాలీలు జనాన్ని భయభ్రాంతుల్ని చేస్తున్నాయి. వేపగుంట వద్ద గల పెట్రోల్ బ్యాంకు లో

రూ.200 పెట్రోల్ కొట్టించడం, బ్రేకులు తీసేసి రోడ్డుమీద అష్టావక్రంగా తిరగడం ఇదే జనసేన అభ్యర్థి చింతలపూడి వెంకట్రామయ్య కి మద్దతు గా నిర్వహిస్తున్న ర్యాలీలో

యువత చేస్తున్న కృత్యాలకు జనం భయబ్రాంతులవుతున్నారు. దీన్ని ప్రశ్నించిన ఒక తెలుగు జాతీయ దిన పత్రిక విలేకరి పైకి కూడా తీసుకుపోవడం ఆటను తీవ్రగాయాలపాలయ్యారు.

ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం ఈ బైకులు చేస్తున్న విధ్వాంసాన్ని చూసి కూడా స్థానిక పోలీసులు నోరెత్తడం లేదంటే ఎన్నికల ప్రభావం ఏమేరకు ఉందొ బహిర్గతమవుతోంది. ఒక

బైకు వేగంగా వెళ్తేనే కేసులు పెట్టి హింసించే రక్షక భటులకు ఈ ఎన్నికల విధ్వంసం కనపడడం లేదా అని విలేకరులు ప్రశ్నిస్తున్నారు. పైగా వీళ్ళ బైకులకు పెట్రోల్

ఖాతాలోనే మిగిలిన బళ్లకూ పెట్రోల్ కొట్టించుకునే మేధావులూ తయారయ్యారు. వీళ్ళకి క్యూ లైన్ల వల్ల సామాన్య జనం నానా అవస్థలూ పడుతున్నారు. 

విచ్చలవిడి కి

పోలీసులే కారణమా ?

ఈ బైకుల హోరుతో ఈ ప్రాంతం పూర్తిగా శబ్ద కలియుష్యంగా మారిపోయింది. ఉదయం నుంచి, బైకులు విచ్చలవిడిగా హారన్ మ్రోగిస్తూ జనాన్ని

విసిగిస్తున్నారు. దీనికి పోలీసుల అనుమతి ఉందిట. పోలీసులు అనుమతి ఇచ్చేది కేవలం ర్యాలీలకు మాత్రమే. అందులో బైకులు, కార్లు హారన్ లు ఇష్టానుసారంగా

మోగించుకోవచ్చు అనే నిబంధనలు లేకపోవడం తో సిలోన్ బ్యాండ్ స్థాయిలో హోరెత్తి పోతున్నాయి. అదే విధంగా ఈ ర్యాలీలో తిరిగే ప్రచార వాహనాలకు అనుమతి ఇచ్చిన మైకులు

విడుదల చేసే శబ్ద కాలుష్యం భరించరాని స్థాయిలో ఉంటోంది. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకూ అనుమతి ఉందంటూ జనాన్ని వాయ్ కొట్టేస్తున్నారు. దీన్ని అదుపు చేసేవాడే లేడు.

నియంత్రణ లేకపోవడం తో ప్రశాంత నగరం లో జనం పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిపోయింది.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #ganta srinivasa rao  #telugudesam  #janasena  #pendurty  #vepagunta  #petrol bunk  #loud speakers  #harrassment  #pawan kalyan
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam