DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పశ్చిమంలో పత్తాలేకుండా పోయేది టిడిపి, జనసేన కూటమి లే  

ఎక్కడ చూసినా కావాలి జగన్... రావాలి జగన్....

విశాఖపట్నం, ఏప్రిల్ 4 , 2019 (DNS Online డిఎన్ఎస్ ) : మరో వారం రోజుల్లో జరుగనున్న ఎన్నికలకు జరుగుతున్నప్రచార సునామీ ధాటికి

తట్టుకు నిలబడలేక కొట్టుకుని మునిగిపోయే పడవలు తెలుగుదేశం, జనసేన కూటమిలేనని అభిప్రాయం ప్రజల్లో దాదాపుగా ఖరారైపోయింది. విభజన పేరిట లేక ఇచ్చి ఒకడు, అర్ధం

పర్థం లేకుండా విభజించింది మరొకడు, వాళ్లకి కళ్ళుమూసుకుని చట్టసభలో మద్దతు ఇచ్చింది ఇంకొకడు... ప్రశ్నిస్తా నంటూ ప్రగల్బాలు పలికిన సినీ నటుడు ఐదేళ్ల కాలం

పూర్తిగా కనుమరుగై ఇలా కోట్లాది మంది ఆంధ్ర ప్రజలను నట్టేట ముంచిన తెలుగుదేశం, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ లపై ఈ రాష్ట్ర ప్రజల్లో పెరిగిపోతున్న హ్యేయ భావం

ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో సుస్పష్టంగా కనిపిస్తోంది. తప్పని పరిస్థితుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం కు, కేంద్రంలో బీజేపీ కి అధికారం కట్టబెడితే ఆంధ్రాకి

వీళ్ళు చేసిన మోసాన్ని ప్రజలు బహిరంగంగానే ఎండగడుతున్నారు. వీళ్ళకి బేషరతుగా మద్దతు ప్రకటించిన జనసేనా ఐదేళ్ల కాలంలో కనీసం నోరెత్తకుండా ఎన్నికల ముందు

తానుకూడా ఇంకా ఉన్నానంటూ ప్రజల ముందుకు రావడంతో దీంతో ఆయా పార్టీల అభ్యర్థులకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రోడ్ షో ల్లో జనం లేక, వెంట జనం రాక పోవడంతో ఈ

పార్టీల అభ్యర్థులు రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే ర్యాలీలు పెట్టుకుంటూ.. జనానికి పెద్ద బిల్డప్  à°‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్

కు చెందిన అభ్యర్థి మళ్ల విజయ్ విజయ్ ప్రసాద్ రోజు రోజుకూ ప్రజా మద్దతు కూడగట్టుకోవడంలో సఫలీకృతమవుతున్నారని చెప్పవచ్చు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విశాఖ

పశ్చిమం లో పారిశ్రామిక వాడల్లో ఇంటింటా ప్రచారం అందరినీ ఆలోచింపచేస్తోంది. ముఖ్యంగా రావాలి జగన్ - కావాలి జగన్ నినాదం పిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరి

నోళ్ళల్లోనూ నానుతూనే ఉంది. పైగా అధికార తెలుగుదేశం పార్టీ చేసిన భూ దండాలు, అవినీతి కుంభకోణాలు, వక్రమార్గం పట్టించిన ప్రజా దానం అనే నినాదాలతో మళ్ల ప్రజలను

ఆలోచింప చేస్తున్నారు. 
ఈయనకి ప్రత్యర్థులుగా సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ విప్ పిజివిఆర్ నాయుడు తెలుగుదేశం తరపున బరిలో ఉండగా, జనసేన, వామపక్ష కూటమి ఉమ్మడి

అభ్యర్థిగా జెవి సత్యనారాయణ (సిపిఐ) పోటీలో ఉన్నారు. వీరిద్దరూ కార్మిక వర్గాలకు ఆమడ దూరంలో ఉండడంతో ప్రధాన పరిశ్రమల కార్మిక వర్గాలు ప్రతిపక్ష వైఎస్సార్

కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ పార్టీలో చేరిపోయారు. దీంతో ఒక్కసారిగా మళ్ల ఓటు బ్యాంకు మరింత బలోపేతమైంది. తన అనుచర వర్గానికి తప్ప ఇతరులకు అందుబాటు

లో ఉండరంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే పై వస్తున్నా విమర్శలు, పైగా ప్రభుత్వ పధకాలు అర్హులకు కాక, తమ పార్టీ వారికి మాత్రమే కేటాయించడం పెద్ద దుమారాన్నే లేపింది. పైగా

జన్మభూమి కమిటీల పేరుతొ అనుచరగణం చేస్తున్న హంగామాకి సొంత పార్టీనేతలు బెంబేలెత్తిపోయిన ఘటనలూ ఉన్నాయి. దీంతో పార్టీలకు అతీతంగా ఇతనిపై వ్యతిరేకత అమాంతం

పెరిగిపోయింది. 
ఇక జనసేన, వామపక్ష కూటమి అభ్యర్థి జెవి సత్యనారాయణ మూర్తి, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గా ఉన్న కొన్ని వర్గాలకే పరిమితమవడం, పైగా జనసేన క్యాడర్

కు దూరంగా ఉండడంతో  à°ªà±‚ర్తిగా వెనుకంజలో నిలిచిపోయారు. పైగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పలుమార్లు ఇదే నియోజకవర్గంలో ప్రచారం చేసిన ప్రజల నుంచి పెద్దగా

స్పందన లేకపోవడం గమనార్హం. ఇక మిగిలిన బీజేపీ తరపున అభ్యర్థిగా బరిలో నిలిచినా బుద్ధా చంద్రశేఖర్ ఆ పార్టీ కార్యకర్తలకే తెలియదు అంటే ఇక ప్రచారం సంగతి

చెప్పనవసరం లేదు. బీజేపీ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్రభావం ఈయన పై చూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia #dnsnews  #vizag   #viswanadha raju  #visakhapatnam  #telugudesam  #YSR Congress  #CPI  #Janasena  #Visakha West 

#industries  #JV Satyanarayana Murty  #Malla Vijay Prasad  #PGVR Naidu  #Ganababu
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam