DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న జీయర్ ట్రస్ట్ ద్వారా విశాఖ లో 69 మంది అవయవదానం

చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యక్రమం 

పత్రాలు చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ à°•à°¿ అందుచేత 

జీయర్ ట్రస్ట్ ద్వారా చెయ్యడం మా అదృష్టం:

ఆడారి కిషోర్ 

ఆడారి కిషోర్ కుమార్ కు సర్వత్రా అభినందనలు.

విశాఖపట్నం, ఏప్రిల్ 20 2019 (DNS Online ) : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యవంలో

ఆంధ్ర ప్రదేశ్ లోనే మొట్ట మొదటి సారిగా 69 మంది తో అవయవదానం  à°šà±‡à°¯à°¿à°‚à°šà°¿à°¨ రికార్డు నమోదయ్యింది. విశాఖ నగరం లో à°ˆ కార్యక్రమం తెలుగుదేశం నాయకులు ఆడారి కిషోర్ కుమార్

నేతృత్వం లో శనివారం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 69  à°µ జన్మదిన వేడుకల్లో భాగంగా తెలుగుదేశం నాయకులు ఆడారి కిషోర్ కుమార్

నేతృత్వం లో అక్కయ్య పాలెం లోని అయన కార్యాలయంలో శనివారం 69 మంది చే అవయవ దాన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసారు. à°ˆ సందర్బంగా ఆడారి కిషోర్  à°•à±à°®à°¾à°°à± మాట్లాడుతూ అవయవ

దానం చెయ్యడం ద్వారా మనిషి మరణించిన తర్వాత కూడా జీవించే అవకాశం ఉందని, ఇది కేవలం మనిషి జన్మకు మాత్రమే సాధ్యం అన్నారు. ఇటీవల తనువూ చాలించిన తమ కుమారుడు ఆడారి

చైతన్య భూషణ్ ( 5 ఏళ్ళు ) స్ఫూర్తిగా ఇంతమంది అవయవ దానం చేసే మహా యజ్ఞాన్ని చేపట్టామన్నారు. తమ కుమారుడి రెండు నేత్రాలు దానం చెయ్యడం ద్వారా ఇద్దరు చిన్నారులకు కంటి

చూపు లభించిందన్నారు. ఒప్పందం పత్రాలపై సంతకాలు చేసిన వారందరినీ అభించనందించారు. 

జీయర్ ట్రస్ట్ ద్వారా చెయ్యడం అదృష్టం. :. 

ఆధ్యాత్మిక రంగం తో ప్రవచన,

యజ్ఞ హోమాది కార్యక్రమాలతోనే కాక సమాజం పట్ల భాద్యత వహించి, వివిధ అంశాలపట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్న చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ద్వారా అవయవ దాన ప్రక్రియ

చేపట్టడం అదృష్టంగా ఆడారి కిషోర్ తెలిపారు. అభ్యుదయ భారతావనికి ఆదర్శ మూర్తిగా నిలిచినా స్వామి చేస్తున్న అవయవదాన యజ్ఞం లో ఒక సమిధలుగా మేము సైతం ఉండడం

పూర్వజన్మ సుకృతం అన్నారు. 

అనంతరం à°ˆ పత్రాలను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ విశాఖ కమిటీ అధ్యక్షులు శ్రీమాన్ రాజు కు  à°…ందించడం

జరిగింది. 

ఆధ్యాత్మికతతో పాటు అవయవదాన అవగాహన : చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ 

చిన్న జీయర్ ట్రస్ట్ విశాఖ కమిటీ అధ్యక్షులు శ్రీమాన్ రాజు మాట్లాడుతూ అవయవ

దానం పై ప్రజల్లో ఇంకా అవగాహనా లభించాల్సియుందన్నారు. పురాణం కాలంలోనే మహర్షి దధీచి అవయవాలను దానం చెయ్యడం ద్వారా దేవతలకు అస్త్ర శాస్త్రాలు తయారయ్యాయన్నారు.

వాటిల్లో అత్యంత అమూల్యమైనది ఇంద్రుని వజ్రాయుధం అన్నారు. దీన్ని దధీచి వెన్నుముకతో తయారు చేసినట్టు పురాణాలే చెప్తున్నాయన్నారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యవంలో వికాస

తరంగిణి పేరుతొ స్వచ్చంద సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మహిళా వికాసం పేరుతొ మహిళలకు కాన్సర్, తదితర వ్యాధులపై అవగాహనా కల్పిస్తున్నామన్నారు. సమాజం పట్ల భాద్యత

కల్గిన ఆడారి కిషోర్ కుమార్ తన కుటుంబ సభ్యులు, మిత్ర బృందం తో కలిసి అవయవ దానం చెయ్యడం అభినందనీయమన్నారు. మోహన్ ట్రస్ట్ ద్వారా ఈ పత్రాలను అందించడం

జరుగుతుందన్నారు. 

చిన్న జీయర్ స్వామిచే ఐడి కార్డులు వితరణ :

ఈ నెల 27 న విశాఖ నగరం లో జరుగనున్న జీయర్ నేత్ర విద్యాలయ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరు

కానున్న చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా అవయవ దానం చేసిన వారందరికీ ధ్రువీకరణ పత్రాలు, కార్డులు అందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశం లో అవయవ దానం చేసిన సభ్యులు

పాల్గొన్నారు.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #telugudesam  #chinna jeeyar trust  #vikasa tarangni   #Organ donation  #Arogya vikasam  #health camp  #adari kishore kumar  #chandrababu naidu  #birth day  #Varija  #Raju

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam