DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చందన యాత్రలో సామాన్య భక్తులకు ఈ సారి కూడా తిప్పలు తప్పేలా లేవు

చందన యాత్ర నిర్వహణ పై కలెక్టర్ సమీక్ష  . .

సాయంత్రం 4 తర్వాత కొండపైకి బస్సులు ఉండవు. .  

విశాఖపట్నం, ఏప్రిల్ 20, 2019 (DNS online) :  à°µà±ˆà°¶à°¾à°– శుద్ధ తదియ అక్షయ తృతీయ

సందర్బంగా మే 7 న సింహాచలం క్షేత్రం లో వెలసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం కోసం వచ్చే భక్తులకు ఈమారు కూడా తిప్పలు తప్పేలా లేవు. ప్రతి ఏడాది

లాగానే ఆలయ దర్శన ఏర్పాట్లు పై సింహాచల ఈఓ చేతులెత్తేయడం తో మరోసారి జిల్లా రెవిన్యూ యంత్రాంగానికి ఇవ్వడం జరుగుతోంది. దీంతో సామాన్య భక్తుల ముప్పేట తిప్పలు

తప్పేలా లేవు. కేవలం టికెట్లు పేరుతొ భక్తులను ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేసేందుకు యంత్రాంగం సిద్ధమైపోయింది. .

వి ఐపి  à°Ÿà°¿à°•à±†à°Ÿà±à°²à± ఉంటేనే సానుకూల

దర్శనం. :.

ప్రముఖుల పేరుతొ రూ. 1200 , రూ. 1000 టికెట్లు కొన్న వారికి పెద్ద పీట వేసి, రాజమార్గ దర్శనం చేయించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు, రూ. 500 , రూ. 200 టికెట్లు కొన్న

భక్తులకు కూడా కొంత దర్శనం చేయించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి.  à°‡à°• సర్వ దర్శనం క్యూలో భక్తులకు పట్టపగలే చుక్కలు కనిపించనున్నాయి.  .

ఎన్నికల కోడ్ కొంత

ఆపుతుందా ? .

ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల కోడ్ నడుస్తుండడంతో మంత్రులు, మంది మార్బలం, మెహర్బానీలు ఎక్కువగా ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ విఐపి కోటాలో

టికెట్లు మాత్రం వీళ్ళకే సొంతం కానున్నాయి. గతంలో మాదిరిగా ఒక ఎమ్మెల్యే, ఎంపీ వెనుక పదులు, వందల సంఖ్యలో అడ్డదారిలో జనం దూరి వెళ్లే అవకాశాలు తక్కువగా

ఉన్నాయి.  .

కొండపైకి బస్సులు బందే : .

కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు, దేవస్థానం బస్సులకు ముందు రోజునుంచే సమయం పరిధి పెట్టడంతో సుదూర ప్రాంతాల

నుంచి వచ్చే సామాన్య భక్తులు నానా అవస్థలు పడనున్నారు. స్వామి నిజరూప దర్శనం చేసుకునేందుకు రాష్ట్రం నుంచే కాక ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా

పెద్ద సంఖ్యలో భక్తులు ఏటా హాజరవుతుంటారు. వీళ్ళందరూ బస్సుల ద్వారా, నడక మార్గం ద్వారా కొండకు చేరుకుంటారు. సాయంత్రం సింహాచలం వచ్చే భక్తులకు ఈ ఏడాది చుక్కలు

కనపడనున్నాయి. బస్సులను సాయంత్రం 4 గంటల తర్వాత కొండపైకి అనుమతించకపోతే వేలాదిగా వచ్చే భక్తులు ఎక్కడ ఉండాలో జిల్లా యంత్రాంగమే చెప్పాలి. ఏడాదికో రూలు తెరపైకి

తీసుకు వచ్చే జిల్లా యంత్రాంగం, నిర్వహణ చేతకాక చేతులెత్తేసిన దేవస్థానం చేస్తున్న నిర్వాకం వల్ల భక్తులు ఈ ఏడాది ముందు రోజునుంచే చుక్కలు

చూడనున్నారు. 

 

#dns  #dns live  #dns news  #dns media  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #simhachalam  #chandana yatra  #rush  #temple  #varaha lakshmi nrusimha swamy  #collector  #eo  #APSRTC  #buses
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam