DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జూన్ 1 నుంచి ట్రైబల్ వర్శిటీ లో ప్రవేశాల కై జాతీయ స్థాయి పరీక్ష

విశాఖపట్నం, ఏప్రిల్ 22, 2019 (DNS online) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కేటాయించిన గిరిజన వర్సిటీ ని విజయనగరం జిల్లాలోని రెల్లి గ్రామం లో  à°¨à±†à°²à°•à±Šà°²à±à°ªà°¿, దీని à°•à°¿

రూపకల్పన చేసి, ప్రవేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ కు ఆదేశాలిచ్చినట్టు ఎయు విసి డాక్టర్ నాగేశ్వర రావు తెలిపారు. సోమవారం ఎయు విసి డాక్టర్

నాగేశ్వర రావు నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ  à°µà°¿à°œà°¯à°¨à°—à°°à°‚ జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో అయిదువందలకు పైగా ఎకరాలు కేటాయించారన్నారు.

దీనికి ఏయూ 'మెంటార్' గా వ్యవహరించి, రానున్న ఏడేళ్లకు డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్డును ఒక కమిటీ తయారు చేస్తోందని వివరించారు. ఈ విద్యాలయం ఈ విద్య సంవత్సరం (2019 -2010 )

నుంచి ప్రవేశాలు మొదలు పెడుతుందని, దీనికై తాత్కాలికంగా  à°µà°¿à°œà°¯à°¨à°—రంలోని (ఇటీవలే  à°®à±‚తబడిన కళాశాల ఇది ) ప్రావీణ్య ఇంజినీరింగ్ కళాశాలలో రెండు పీజీ, రెండు

ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రారంభమవుతాయన్నారు. 

ప్రవేశ పరీక్ష విధానం ఇదే:.

        ఇప్పడికే దేశంలో à°’à°• ట్రైబల్ వర్శిటీ మధ్య ప్రదేశ్ లోని అమర్ కంటక్ లో (

ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ) నడుస్తోందని నాగేశ్వర రావు తెలిపారు. ఆ వర్సిటీ తో కలసి ప్రవేశ పరీక్ష నిర్వహించి, జాతీయ స్థాయిలో మెరిట్ ఆధారంగా

విద్యార్థులకు విజయనగరం విద్యాలయంలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తులను ఆంధ్ర యూనివర్సిటీ వెబ్సైటు నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకొ

వచ్చ్చన్నారు. . దరఖాస్తుల సమర్పణకు మే 16 , 2019 చివరి తేదీ. హాల్ టికెట్లను 20 మే, 2019 à°¨ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.  à°œà±‚న్ à°’à°•à°Ÿà°¿, రెండు తేదీల్లో జాతీయ స్థాయి ప్రవేశ  à°ªà°°à±€à°•à±à°·

ఉంటుంది. దేశ వ్యాప్తంగా కేవలం 13 పరీక్ష కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష జరుగుతుందని, ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం శ్రీకాకుళం జిల్లాలోనే ఉందని, అయితే కొత్తగ ఏర్పడిన

విద్యాలయం కావడంతో ఎక్కువమందికి అనువుగా ఉండేందుకు విశాఖపట్నం, విజయవాడ కేంద్రాల్లో కూడా ఈ పరీక్షలను నిర్వహించాల్సింది గా అమర కంటక్ వర్సిటీ వారిని

కోరినట్టు వీసీ తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం లో రెండు పీజీకోర్సులకు (ఎం ఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మె సోషల్ వర్క్) ఇరవై చొప్పున, రెండు ఇంటిగ్రేటెడ్

కోర్సుల్లో ముప్పయి చొప్పున విద్యార్ధులకు ప్రవేశాలు లభిస్తాయన్నారు. ఇవి కాక ఉపాధి వృత్తుల్లో సర్టిఫికేట్ కోర్సులు కూడా ఆఫరు చేసి ముద్రా బ్యాంకుల ద్వారా

యువతకు రుణాలు ఇప్పించి వ్యాపారాలు ప్రారంభింప చేస్తామన్నారు. 

ఈ విలేకరుల సమావేశం లో ఎయు రెక్టార్, డాక్టర్ ప్రసాద రావు, రిజిస్టర్ డాక్టర్ నిరంజన్ తదితరులు

పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns news  #dns media  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #andhra unviersity  #alumni  #tribal university #vizinagaram  #Vijayawada


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam