DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైతులకు అండగా మోడీ ప్రభుత్వం : తోట విజయలక్ష్మి  

రెండు రైతు స్కీం లు ప్రారంభం 

విశాఖపట్నం, జూన్ 1 ,2019 (DNS  Online ): భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండవ సారి ప్రధానిగా భాద్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తోలి

కేబినెట్ సమావేశం లో వ్యవసాయ రంగానికి సంబంధించి రెండు పధకాలను ప్రకటించినట్టు ఆంధ్ర ప్రదేశ్ మహిళామోర్చ అధ్యక్షులు తోట విజయలక్ష్మి తెలిపారు. కిసాన్ సమ్మాన్

యోజన లో ఇంతకు ముందు ఉన్న భూ పరిమితి (అనగా 5 ఎకరాలు ) ఎత్తివేసి, ఇప్పుడు చిన్న, సన్నకారు రైతులకు కూడా వర్తింప చేస్తున్నారు. ప్రతీ ఏడాది రైతుకి 6000 రూపాయిలు ఆర్ధిక

సహాయం నేరుగా అతని ఖాతాకు వెళ్తుంది.

ప్రధాన మంత్రి కిసాన్ పెన్షన్ పధకం : 

ఇక్కడ రైతు 18 నుండి 40 ఏళ్ళు మధ్య వయసులో ఉండాలి. వీరు నెలనెలా కొంత ఆదా చేసుకుంటే

ప్రభుత్వం కూడా ఆ ఆదాకు సరిపడా డబ్బు ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ విధంగా రైతుకి 60 సంవత్సరాలు రాగానే, కనీసం నెలకు 3000 పెన్షన్ వచ్చేలా దోహద పడుతుంది. పూర్తి

వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అటల్ పెన్షన్ యోజనా లో à°ˆ విధానాన్ని చూసాము. ఇటువంటి పెన్షన్ పధకాన్ని చిన్న వ్యాపారులకు కూడా వర్తిస్తున్నారని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam